RRR: హౌరా బ్రిడ్జి వద్ద చేతులు కలిపిన రామ్, భీమ్.. గూస్ బంప్స్, కలకత్తాలో ఆ సీన్స్
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం చుట్టేస్తున్న రాంచరణ్, ఎన్టీఆర్ నేడు కలకత్తాకి వెళ్లారు. అక్కడ చారిత్రాత్మక హౌరా బ్రిడ్జిని సందర్శించారు.

RRR Movie
దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం చుట్టేస్తున్నారు. ఢిల్లీ, అమృత్ సర్ లాంటి నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన ఆర్ఆర్ఆర్ టీం ఇప్పుడు కోల్ కతాలో వాలిపోయింది.
RRR Movie
రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ ముగ్గురూ చారిత్రాత్మక హౌరా బ్రిడ్జిని సందర్శించారు. హౌరా బ్రిడ్జి వద్ద రాంచరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ స్టైల్ లో చేతులు కలపడం గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
RRR Movie
అలాగే చిత్ర యూనిట్ హౌరా బ్రిడ్జి వద్దే పశ్చిమ బెంగాల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాలు తెలియజేశారు. హౌరా బ్రిడ్జి వద్ద రాంచరణ్, ఎన్టీఆర్ లని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. రాంచరణ్, ఎన్టీఆర్ నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తించారు.
RRR Movie
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని కీలక సన్నివేశాలని కోల్ కతా లో కూడా చిత్రీకరించారు. బ్రిటిష్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోల్ కతా సీన్స్ కీలకం కానున్నాయట. బ్రిటిష్ కాలంలో వారి పరిపాలనకు, వ్యాపారానికి కలకత్తా ప్రధాన నగరాల్లో ఒకటిగా ఉండేది.
RRR Movie
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. దేశం మొత్తం ఈ చిత్రం కోసం ఎదురుచూస్తోంది.
RRR Movie
సమకాలీకులు అయినా అల్లూరి సీతా రామరాజు, కొమరం భీం అజ్ఞాతంలో ఉన్న సమయంలో వారిద్దరూ స్నేహితులుగా మారి ఉంటే ఎలా ఉంటుంది అనే కల్పిత కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.