- Home
- Entertainment
- Natu Natu Song: ఇంకా ఆగని నాటు నాటు సాంగ్ మ్యానియా... రచ్చ చేస్తున్న ట్రిపుల్ ఆర్ సాంగ్...
Natu Natu Song: ఇంకా ఆగని నాటు నాటు సాంగ్ మ్యానియా... రచ్చ చేస్తున్న ట్రిపుల్ ఆర్ సాంగ్...
ట్రిపుల్ ఆర్(RRR) నుంచి ఎప్పుడు ఏ అప్ డేట్ వచ్చినా బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. పాటైనా... టీజరైనా.. మేకింగ్ అయినా.. ఏదైనా సరే మిలియ్స్ లో ఫ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది ట్రిపుల్ ఆర్ (RRR) లోని నాటు నాటు సాంగ్. దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan)ల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతుంది ట్రిపుల్ ఆర్(RRR). మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 25న రిలీజ్ కు ముస్తావు అవుతుంది.
నిజానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7నే రిలీజ్ కావల్సి ఉంది. కాని కరోనా కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది ట్రిపుల్ ఆర్ (RRR). అంతకు ముంద కూడా అనేక కారణాలతో వల్ల రెండు సార్లు ట్రిపుల్ ఆర్ (RRR) రిలీజ్ వాయిదా పడింది. ఇక చివరిగా మార్చ్ 25 డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా గురంచ నందమూరి అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా వెయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
ఇప్పటి వరకూ ట్రిపుల్ ఆర్ (RRR) నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కాని, టీజర్స్ కాని.. స్పెషల్ వీడియోస్ అన్నీ ఆడియన్స్ ను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా తారక్ తో కలిసి రామ్ చరణ్(Ram Charan) డాన్స్ ఇరగదీసిన నాటు నాటు పాటకు ఎవరూ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్స్ రికార్డు సృష్టించాయి. అంతేకాదు ఈ పాటను ఇమిటేట్ చేస్తూ.. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ వివిధ భాషల్లో అనేకమంది తమదైన స్టైల్లో కవర్ సాంగ్స్, రీల్స్, వీడియోస్ చేసి ఆకట్టుకున్నారు.
ఇక యూట్యూబ్‌లో నాటు నాటు సాంగ్ క్రీయేట్ చేసిన రికార్డ్ గు రించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ స్థాయిలో వ్యూవర్ షిప్ తో దూసుకుపోయిన నాటు సాంగ్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇక రీసెంట్ గా ఈ పాట మరో రికార్డు సొంతం చేసుకుంది. అన్ని భాషల్లోనూ కలుపుకొని నాటు నాటు సాంగ్ ఏకంగా 200 మిలియన్ క్లబ్‌లోకి చేరుకుంది. ఈ వ్యూస్‌తో తన మేనియా ఇంక తగ్గలేదని నిరూపించుకుంది సాంగ్.
ప్రముఖ రచయిత చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈపాటకి కీరవాణి సంగీతం తోడవడంతో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడే ఇంత రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఈ సాంగ్ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందా.. ఏ స్థాయిలో హైలెట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్నారు.
రామ్ చరణ్( Ram Charan) అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్(NTR) కొమురం భీమ్ గా నటించిన ఈ సినిమాలో చరణ్ జోడీగా సీత పాత్రలో ఆలియా భట్ నటిస్తుండగా.. తారక్ జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియో నటించింది. కీలక పాత్రల్లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్( Ajay Devagan) నటించగా.. శ్రీయ, సముద్రఖని కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు.
ఇక చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమా ఫ్యాన్స్ ను బాగా నిరాశపరిచింది. సంక్రాంతికి పక్కాగా రిలీజ్ అవుతుంది అనుకున్నారంతా. అంతే కాదు టీమ్ కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ ను చేశారు. కాని చివరికి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక మార్చి 25న రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ ఆర్ (RRR) ప్రమోషన్స్ ను ఫస్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేయాలని చూస్తున్నారట టీమ్.