RRR Sequel: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కు ముహూర్తం ఫిక్స్, జక్కన్న టీమ్ కు దిల్ రాజు గ్రాండ్ పార్టీ
ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి దూసుకుపోతోంది. జక్కన్న టీమ్ మూడేళ్ల కష్టానికి మంచి ఫలితాలే వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ అంశం తెరమీదకు వచ్చింది. బాహుబలి రెండు సినిమాలు వచ్చినట్టు, ట్రిపుల్ ఆర్ కూడా సీక్వెల్ ఉంటుంది అన్న న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
మార్చ్ 25న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ దుమ్మురేపుతోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపుగా 750 కోట్ల కలెక్షన్ మార్క్ దాటిపొయిన ట్రిపుల్ ఆర్ కలెక్షన్లు.. 1000 కోట్లకు చేరువలో ఉన్నాయి.
ట్రిపుల్ ఆర్ సీక్వెల్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ప్రభాస్ తో బాహుబలి చేసిన రాజమౌళి.. రెండు భాగాలుగా సినిమా ఉంటుందని ముందే ప్రకటించి అనుకున్నట్టుగానే చేశాడు. ఇక ఇప్పుడు ముందే అనుకోకపోయినా.. ట్రిపుల్ ఆర్ కు కూడా సీక్వెల్ ఉంటుందని సిగ్నెల్స్ ఇస్తున్నారు జక్కన్న టీమ్.
ట్రిపుల్ ఆర్ భారీ విజయానికి మురిసిపోయి నిర్మాత దిల్ రాజు జక్కన్న టీమ్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ఎన్టీఆర్, చరణ్ సతీసమేతంగా హాజరయినట్టు సమాచారం. ఆ పార్టీలో రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ తో పాటు, కీరవాణి.. ఇతరత్ర మెయిన్ టీమ్ అంతా ఒక చోట చేశారు.
అయితే ట్రిపుల్ ఆర్ సీక్వెల్ ముహూర్తానికి దిల్ రాజు పార్టీ వేదికగా మారినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై చర్చ జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా సీక్వెల్ పై రచయిత విజయేంద్ర ప్రసాద్ ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథ కూడా ఆయన రెడీ చేశాడ. ఇదే విషయాన్ని పార్టీలో కూడా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం.
ఆర్ఆర్ఆర్ సీక్వెల్ తీయదగిన సినిమానే.. దానికి సీక్వెల్ వస్తే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే విజయేంద్ర ప్రసాద్ ఇంతకు ముందు కూడా ఈ అంశంపై మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ సక్సెస్ తరువాత మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ.. ఈ మూవీ సీక్వెల్ కథ గురించి మాట్లాడుకున్నామని. ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చినప్పుడు చర్చలు జరిగాయి అన్నారు.
మొత్తానికి నిప్పులేనిదే పొగరాదు అన్నట్టు ఈ సినిమా రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా సీక్వెల్ పై గట్టిగానే సిగ్నెల్స్ వదులుతున్నారు అంటే అది పక్కా అంటున్నారు సినిమా పండితులు. అటు ప్యాన్స్ కూడా ట్రిపుల్ ఆర్ సీనిమా సీక్వెల్ అంటే పండగే అంటున్నారు. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వస్తుందని ఎదురు చూస్తున్నారు.
అయితే ఈసారి ఈ సీక్వెల్ మూవీకి నిర్మాతగా దిల్ రాజు ఉండే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఆయన చరణ్ - శంకర్ కాంబోలో భారీ బడ్జెట్ సినిమా నిర్మిస్తున్నారు. దానితో పాటు ట్రిపుల్ ఆర్ సీక్వెల్ లో కూడా భాగం పంచుకుంటారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అయితే ఇక్కడ ఇంకో చిక్కు ఉంది. రాజమౌళి ఇప్పటికిప్పుడు ఈ సినిమా చేయాలి అంటే సాధ్యం కాదు. అంటు ఎన్టీఆర్, చరణ్ కూడా ఇప్పటికే మూడేళ్ళు త్యాగం చేశారు. నెక్ట్స్ సినిమాలు కూడా ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఇంకో రెండు మూడేళ్లు అందరూ బిజీ బిజీ.. మరి ఈ సీక్వల్ సాధ్యం అయ్యేది ఎప్పుడు...? చూడాలి మరి.