RRR డిస్ట్రిబ్యూటర్లకు భీమ్లా నాయక్ గుబులు.. ఏం జరుగుతుందో ఏమో..
దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఏకైక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న మూవీ కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది.

RRR Movie
దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఏకైక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న మూవీ కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లాంటి సూపర్ స్టార్లు కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీనితో ఈ చిత్రం బాహుబలిని మించే విధంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
RRR Movie
ఆర్ఆర్ఆర్ టీం కూడా ఈ చిత్రం బాహుబలికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని చెబుతున్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ దేశం మొత్తం తిరిగి ప్రచారం నిర్వహించారు. మరికొన్ని గంటల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ హైప్ ఉన్నప్పటికీ ఆర్ఆర్ఆర్ చిత్రం కొన్ని సవాళ్ళని ఎదుర్కొనక తప్పదని ట్రేడ్ పండితులు అంటున్నారు.
RRR Movie
రాజమౌళి దర్శకత్వంపై నమ్మకం, బాహుబలి రికార్డులు.. ఎన్టీఆర్, రాంచరణ్ స్టార్ పవర్ తో ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 520 కోట్ల మాసివ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది ఇండియాలోనే ఆల్ టైం రికార్డు. ఉదాహరణకు బాహుబలి 2 చిత్రం ఫుల్ రన్ లో నైజాం ఏరియాలో 70 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఇదే ఏరియా రైట్స్ 70 కోట్లకు అమ్ముడయ్యాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆర్ఆర్ఆర్ చిత్రంపై బయ్యర్లు ఏస్థాయిలో డబ్బు వెచ్చిస్తున్నారో అని.
RRR Movie
ముందుగా చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఆర్ఆర్ఆర్ చిత్రానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. బాహుబలి 2 చిత్రానికి ఆడియన్స్ లో రిపీట్ వాల్యూ ఉండింది. కాబట్టే ఆ రేంజ్ లో వసూళ్లు సాధ్యం అయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ట్రెండ్ అనలిస్టులు భావిస్తున్నారు.
RRR Movie
కరోనా తగ్గినప్పటికీ కొందరు ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం తగ్గించారు అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బాహుబలికి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ లభించింది. కానీ ఇప్పుడు మాత్రం కొందరు ఆడియన్స్ ఓటిటి లో వచ్చే చూసుకోవచ్చులే అనే ఫీలింగ్ తో ఉన్నారు. బాహుబలి లాంటి చిత్రానికి రిపీట్ ఆడియన్స్ బాగా ఉన్నారు.
RRR Movie
ఇప్పుడు వాళ్ళు కూడా ఒకసారి థియేటర్ లో చూస్తే చాలు.. నెలకో రెండు నెలలకో ఎలాగు ఓటిటిలోకి వచేస్తుందిగా అనే ఫీలింగ్ మొదలయింది. 520 కోట్లు తిరిగి రాబట్టాలంటే ఇలాంటి చిన్న చిన్న అంశాలు చాలా పెద్దవిగా మారే ప్రమాదం ఉంది. ఇక ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం అద్భుతమైన మౌత్ టాక్ సొంతం చేసుకుంది.
RRR Movie
పవర్ స్టార్ సినిమాకు ఆ రేంజ్ టాక్ వస్తే వసూళ్లు ఒక రేంజ్ లో ఉంటాయని భావించారు. కానీ భీమ్లా నాయక్ చిత్రం వసూలు చేయాల్సిన దానికంటే 10 నుంచి 15 కోట్లు వెనుకబడింది అనే ప్రచారం ఉంది. పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ తో భీమ్లా నాయక్ చిత్రానికి 97 కోట్ల వరకు షేర్ వచ్చింది. కానీ వచ్చిన టాక్ తో పోల్చుకుంటే అది తక్కువే అని అంటున్నారు.
RRR Movie
ఇప్పుడు ఇదే టెన్షన్ ఆర్ఆర్ఆర్ బయ్యర్లలో మొదలైంది. టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ ఎక్కడ తేడా కొడతాయో అనే గుబులు నెలకొంది. అందుకే బయ్యర్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లో తమకు డిస్కౌంట్ ఇవ్వాలని దానయ్యని కోరుతున్నారట. కానీ దానయ్య మాత్రం అందుకు అంగీకరించడం లేదని అంటున్నారు.
RRR Movie
ఓపెనింగ్స్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉండబోతున్నాయి. ప్రభుత్వం టికెట్ ధరల్ని కూడా పెంచిన సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఉండబోతోంది అనేది పై అంశాలపై.. అలాగే టాక్ పై ఆధారపడి ఉంటుంది.