MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • 2021 Round up:'సారంగదరియా' నుండి 'శ్రీవల్లి' వరకు...  యూట్యూబ్ ని షేక్ చేసిన టాలీవుడ్ టాప్ ఫైవ్ సాంగ్స్

2021 Round up:'సారంగదరియా' నుండి 'శ్రీవల్లి' వరకు...  యూట్యూబ్ ని షేక్ చేసిన టాలీవుడ్ టాప్ ఫైవ్ సాంగ్స్

2021 (2021 Round up) మిశ్రమ పలితాలతో ముగిసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రాలు బోల్తాపడితే, చడీ చప్పుడు లేకుండా వచ్చిన చిన్న చిత్రాలు బ్లాక్ బస్టర్స్ నమోదు చేశాయి. బాలకృష్ణ, రవితేజ లాంటి స్టార్స్ సాలిడ్ హిట్స్ కొట్టి కమ్ బ్యాక్ అయ్యారు. అలాగే సంగీత ప్రియులకు కొన్ని సినిమాలు అద్భుతమైన సాంగ్స్ అందించాయి.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 31 2021, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


2021లో కొన్ని టాలీవుడ్ సాంగ్స్ యూట్యూబ్ ని షేక్ చేశాయి. వందల మిలియన్స్ వ్యూస్ దక్కించుకొని నయా రికార్డ్స్ నెలకొల్పాయి. గత ఏడాది మ్యూజిక్ లవర్స్ మనసు దోచిన సాంగ్స్  పరిశీలిస్తే... ఎక్కువగా చిన్న చిత్రాల సాంగ్స్ పెద్ద విజయం సాధించాయి. అవి ఏమిటో చూద్దాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నాగ చైతన్య-సాయి పల్లవి (Sai Pallavi) జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లవ్ స్టోరీ' (Love story) హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలోని 'సారంగదరియా' సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా 352 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ నమోదు చేసింది. ప్రవీణ్ సి హెచ్ సంగీతం అందించగా.. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. ఇక టాలీవుడ్ 2021 టాప్ వ్యూస్ సాధించిన సాంగ్ గా నిలిచింది. కాగా సాంగ్ విషయంలో పెద్ద వివాదం నడిచింది. ఫోక్ సింగర్ కోమలి సారంగదరియా సాంగ్ తనది అంటూ, రచయిత సుద్దాల పై ఫిర్యాదు చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఆమెకు పారితోషికం ఇచ్చి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. 
 

36

యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు (Jathirantnalu)సెన్సేషనల్ హిట్ అందుకుంది. నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్స్ గా నటించగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక రోల్స్ చేశారు. ఈ మూవీలోని 'చిట్టి నీ నవ్వంటే...' సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్ ని రాధన్ కంపోజ్ చేశారు. రామ్ మిర్యాల అద్బుతంగా పాడగా.. చిట్టి సాంగ్ యూట్యూబ్ లో 121 మిలియన్ వ్యూస్ సాధించి మూడవ స్థానంలో నిలిచింది.

46

ఆది సాయి కుమార్- సురభి కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ ఎంటర్టైనర్ శశి. దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నడికట్ల తెరకెక్కించారు. 2021 సమ్మర్ కానుకగా శశి విడుదలైంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన 'ఒకే ఒక లోకం నువ్వే' సాంగ్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ అరుణ్ చిలువేరు కంపోజ్ చేశారు. ఒకే ఒక లోకం.. సాంగ్ 150 మిలియన్స్ వ్యూస్ సాధింది టాప్ 2 స్థానం దక్కించుకుంది. 
 

56

2021లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఉప్పెన (Uppena)మూవీ. డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సానా డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ తో చేసిన ప్రయోగాత్మక చిత్రం ఉప్పెన రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. కాగా ఉప్పెన మూవీలోని 'జలజల జలపాతం నువ్వు' సాంగ్ యూత్ ని షేక్ చేసింది. శ్రీమణి సాహిత్యం అందించగా.. దేవిశ్రీ కంపోజ్ చేశారు. శ్రేయా ఘోషల్, జస్ప్రీత్ జాస్ పాడారు. ఈ సాంగ్ 114 మిలియన్స్ వ్యూస్ తో 4వ స్థానంలో నిలిచింది.

66


లాస్ట్ లో వచ్చి కూడా తన పేరున రికార్డు నమోదు చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప చిత్రంలోని 'శ్రీవల్లి' సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందుకుంది. దేవిశ్రీ సంగీతం అందించగా చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. సిద్ శ్రీరామ్ పాడిన శ్రీవల్లి సాంగ్.. 112 మిలియన్ వ్యూస్ అందుకొని టాప్ ఫైవ్ లో స్థానం సంపాదించుకుంది. 

Also read 2021 round up:ఈ యేడు బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్,హిట్స్ లిస్ట్

Also read Roundup 2021: 2022లో సందడి మొత్తం వీరిదే... వచ్చే ఏడాది తెలుగు తెరను ఊపేయనున్న పది మంది హీరోయిన్స్

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
సాయి పల్లవి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved