MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Emo Emo Idi: కట్టిపడేస్తున్న మేక రోషన్‌ ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్.. శైలేష్‌ కొలనులో కొత్త యాంగిల్‌

Emo Emo Idi: కట్టిపడేస్తున్న మేక రోషన్‌ ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్.. శైలేష్‌ కొలనులో కొత్త యాంగిల్‌

Emo Emo Idi: రోషన్‌ మేక, ప్రీతి ముఖుందన్‌ జంటగా నటిస్తోన్న మూవీ `ఎమో ఎమో ఇది`. శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ మెలోడీ కట్టిపడేస్తోంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 29 2026, 06:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రోషన్‌ మేక, శైలేష్‌ కొలనుల కొత్త మూవీ `ఎమో ఎమో ఇది`
Image Credit : Asianet News

రోషన్‌ మేక, శైలేష్‌ కొలనుల కొత్త మూవీ `ఎమో ఎమో ఇది`

శ్రీకాంత్‌ కొడుకు మేక రోషన్‌ హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల ఆయన `ఛాంపియన్‌` చిత్రంలో మెరిశారు. పీరియడ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. కానీ బ్రేక్‌ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఆయన `ఎమో ఎమో ఇది` అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి డా శైలేష్‌ కొలను దర్శకత్వం వహించడం విశేషం. `హిట్‌` వంటి మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్స్ రూపొందించిన ఆయన కంప్లీట్‌గా మారి చేసిన చిత్రమిది. లవ్‌ స్టోరీ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎమో ఎమో ఇది మూవీ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌
Image Credit : Asianet News

ఎమో ఎమో ఇది మూవీ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌

ఈ మూవీ అక్టోబర్‌ ఎండింగ్‌లో రిలీజ్‌ కాబోతుంది. చిత్ర ప్రకటన సమయంలో విడుదల చేసిన ‘ది ఫస్ట్ బ్రీజ్ ఆఫ్ #EmoEmoIdi’ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ వీడియోతో సినిమాలోని ఆహ్లాదకరమైన ప్రేమకథా ప్రపంచాన్ని పరిచయం చేసిన మేకర్స్.. ఇప్పుడు మరింత అందమైన అనుభూతిని పంచేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. సున్నితమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే సాహిత్యంతో రూపొందిన ఈ పాట ఆద్యంతం ఆహ్లాదకరమైన ప్రేమానుభూతిని పంచుతుంది. రోషన్ మేకా, ప్రీతి ముఖుందన్ మధ్య కనిపించే అందమైన కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో తెరకెక్కించిన విజువల్స్ పాటకు డ్రీమీ రొమాంటిక్ ఫీల్‌ను అందిస్తున్నాయి.

33
ఎమో ఎమో ఇది రిలీజ్‌ డేట్‌
Image Credit : Asianet News

ఎమో ఎమో ఇది రిలీజ్‌ డేట్‌

ఈ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, కార్తీక్, రమ్య బెహరా తమ మధురమైన గాత్రాలతో ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. అద్భుతమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే గానం, కనువిందు చేసే విజువల్స్ కలగలిసి ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్‌ను ఈ సీజన్‌లోని సరికొత్త లవ్ ఆంథమ్‌గా నిలిపాయి. రోషన్ మేకా, ప్రీతి ముఖుందన్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ప్రేమ, భావోద్వేగాలు, ఆహ్లాదకరమైన అనుభూతులతో తెరకెక్కుతున్న ‘ఎమో ఎమో ఇది’ చిత్రం అక్టోబర్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Rai Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య రాయ్ బ్లాక్ డ్రెస్ లుక్ వైరల్.. వైరల్ వీడియో
Recommended image2
Urvashi Rautela: వాల్తేరు వీరయ్య బ్యూటీ ఏఐ ఫోటోల దుమారం.. లాస్ ఏంజెల్స్ కంపెనీకి 7000 కోట్ల షాక్
Recommended image3
Venu Madhav: ఇంకెవరైనా అయితే చెప్పుతో కొట్టేవాళ్ళు, కానీ ఆ కమెడియన్ కి 70 వేలు రెమ్యునరేషన్ ఇచ్చిన డైరెక్టర్
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: కట్టలు తెంచుకున్న ముఖేష్‌, వర్షిణి రొమాన్స్.. పాపం దేబ్జానీ బకరా అయిపోయిందిగా
Recommended image2
Raviteja: బాలయ్య, రవితేజ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఇదే.. పరుచూరి బ్రదర్స్ చేసిన మోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved