- Home
- Entertainment
- కొడుకు సీక్రెట్ తెలుసుకున్న సుమ... ఆ వీడియోతో రోషన్ కు చీపురుతో ట్రీట్ మెంట్ ఇచ్చిన తల్లి.!
కొడుకు సీక్రెట్ తెలుసుకున్న సుమ... ఆ వీడియోతో రోషన్ కు చీపురుతో ట్రీట్ మెంట్ ఇచ్చిన తల్లి.!
స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల Roshan Kanakala హీరోగా బబ్లూ గమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రోషన్ చేసిన పనికి కనకాల సుమ కొడుకుపై ఫైర్ అయ్యింది.

స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా పరిచయం అవుతూ రూపుదిద్దుకున్న చిత్రం ‘బబుల్ గమ్’ (Bubble Gum). ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మహేశ్వరి మూవీస్ బ్యానర్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు.
పీ విమల నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 29, 2024లో ఈ మూవీ గ్రాండ్ గానే విడుదలైంది. సుమ కొడుకు రోషన్ నటనకు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అయితే ఈ చిత్రం ‘సలార్’కు పోటీగా రావడం విశేషం.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం విడుదలైన తర్వాత, విడుదలకు ముందుకు యాంకర్ సుమ కనకాల ఎంతగానో ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అయితే, తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా సుమ కొడుకు రోషన్ ఓ వీడియోను పంచుకున్నారు.
ఆ వీడియోలో రోషన్ సీక్రెట్ గా తన లాప్ టాప్ లో ఓ వీడియోను చూస్తుంటారు. అదేంటనీ సుమ అడుగుతూ కొడుకు రోషన్ ను అడుగుతుంది. దాస్తూ దాస్తూ చివరిగా చూపిస్తాడు. అందులో రోషన్ ‘బబ్లూ గమ్’ మూవీలో హీరోయిన్ తో చేసిన రొమాన్స్ వీడియోలను చూసింది.
కొడుకు అమ్మాయితో రొమాన్స్ చేయడం.. లిప్ లాక్ చేయడం తో చూసి షాక్ అయ్యింది. దీంతో వెంటనే అందేంటనీ రోషన్ అడుగుతుంది. దానికి రోషన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అయినా రోషన్ దొరికిపోతాడు.
దీంతో సుమ కొడుకు చేసిన పనికి ఫైర్ అవుతుంది. రోషన్ ఈ గదిలో నువ్వు చేసిది ఇదా అంటూ చీపురు తిరిగేసి బాదుతుంది. అయితే ఈ వీడియోను మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ వీడియో వైరల్ గా మారింది.