MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Sridevi: 9 కోట్లు పెట్టి భార్య, తమ్ముడితో సినిమా.. 1993లో అతిపెద్ద డిజాస్టర్‌

Sridevi: 9 కోట్లు పెట్టి భార్య, తమ్ముడితో సినిమా.. 1993లో అతిపెద్ద డిజాస్టర్‌

అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన 'రూప్ కీ రాణీ చోరోం కా రాజా' విడుదలై 31 ఏళ్లు పూర్తయ్యాయి. 1993 ఏప్రిల్ 16న ఈ సినిమా రిలీజైంది. నిర్మాత నీళ్లలా డబ్బు ఖర్చుపెట్టి, తన భార్య, తమ్ముడిని హీరోహీరోయిన్లుగా పెట్టి ఈ సినిమా తీశారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 16 2026, 09:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రూప్ కీ రాణీ చోరోం కా రాజా
Image Credit : facebook

రూప్ కీ రాణీ చోరోం కా రాజా

1993లో వచ్చిన 'రూప్ కీ రాణీ చోరోం కా రాజా' సినిమా నిడివి 177 నిమిషాలు. నిర్మాత బోణీకపూర్ ఈ సినిమాలో తన భార్య శ్రీదేవిని హీరోయిన్‌గా, తమ్ముడు అనిల్ కపూర్‌ను హీరోగా తీసుకున్నారు. సినిమాలో భారీ, ఖరీదైన సెట్లు ఉన్నప్పటికీ, కథలో దమ్ము లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అనిల్ కపూర్, శ్రీదేవిలతో
Image Credit : facebook

అనిల్ కపూర్, శ్రీదేవిలతో

బోణీకపూర్ 1987లో అనిల్ కపూర్, శ్రీదేవిలతో 'మిస్టర్ ఇండియా' సినిమా తీశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అదే జోడీని ఆయన తన 'రూప్ కీ రాణీ చోరోం కా రాజా'లో రిపీట్ చేశారు. కానీ, ఆయన ప్లాన్ వర్కవుట్ కాలేదు. సినిమా రిలీజైన మొదటి రోజే ప్రేక్షకులు తిరస్కరించారు.

Related Articles

Related image1
Balakrishna: బాలకృష్ణ జాతకం ప్రకారం గండం ఎప్పుడుందో తెలుసా, అందుకే ప్రాణం పోయినా ఆ పని చేయడు
Related image2
Prasad Behera: ఇంతకన్నా నన్ను పీకేది ఏమీ లేదు.. ఆవేదనతో నటుడు ప్రసాద్ బెహరా తీవ్ర వ్యాఖ్యలు
36
శేఖర్ కపూర్ దర్శకుడు
Image Credit : instagram

శేఖర్ కపూర్ దర్శకుడు

నిజానికి, బోణీకపూర్ 'మిస్టర్ ఇండియా' విడుదలైన 1987లోనే 'రూప్ కీ రాణీ చోరోం కా రాజా' సినిమాను ప్రకటించారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు శేఖర్ కపూర్ దర్శకుడు. 'మిస్టర్ ఇండియా'కు కూడా శేఖర్ కపూరే దర్శకత్వం వహించారు.

46
అతిపెద్ద డిజాస్టర్‌
Image Credit : facebook

అతిపెద్ద డిజాస్టర్‌

'రూప్ కీ రాణీ చోరోం కా రాజా' సినిమాను శేఖర్ కపూర్ మధ్యలోనే వదిలేశారు. ఆ తర్వాత సతీశ్ కౌశిక్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. దర్శకుడిగా సతీశ్‌కు ఇదే మొదటి సినిమా. కానీ, అది అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
56
ఆరేళ్ల సమయం
Image Credit : instagram

ఆరేళ్ల సమయం

ఈ సినిమాను పూర్తి చేయడానికి ఆరేళ్ల సమయం పట్టిందంటే మీరు ఆశ్చర్యపోతారు. దీని బడ్జెట్ 9 కోట్ల రూపాయలు. 90వ దశకంలో ఇది అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటి. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో నిర్మాతలకు కోట్లలో నష్టం వాటిల్లింది.
66
నటీనటులు
Image Credit : facebook

నటీనటులు

'రూప్ కీ రాణీ చోరోం కా రాజా'లో అనిల్ కపూర్, శ్రీదేవిలతో పాటు అనుపమ్ ఖేర్, జాకీ ష్రాఫ్, జానీ లీవర్, ఆకాశ్ ఖురానా, పరేష్ రావల్, బిందు, అజిత్ వచానీ, దలీప్ తాహిల్, అంజన్ శ్రీవాస్తవ్, రజాక్ ఖాన్, రామ్ సేఠీ వంటి వారు నటించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image3
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణ జాతకం ప్రకారం గండం ఎప్పుడుందో తెలుసా, అందుకే ప్రాణం పోయినా ఆ పని చేయడు
Recommended image2
Prasad Behera: ఇంతకన్నా నన్ను పీకేది ఏమీ లేదు.. ఆవేదనతో నటుడు ప్రసాద్ బెహరా తీవ్ర వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved