'రొమాంటిక్ ' మూవీ రివ్యూ!
ఆకాష్ పూరి(Akash Puri), కేతిక శర్మ జంటగా నటించిన 'రొమాంటిక్'(Romantic) మూవీ రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. కారణం అందరికి తెలిసిందే. కరోనా ప్రభావంతో చాలా చిత్రాలు వాయిదా పడుతూ వచ్చాయి. కానీ రొమాంటిక్ చిత్రానికి మంచి బజ్ కొనసాగుతూ వచ్చింది.
ఆకాష్ పూరి(Akash Puri), కేతిక శర్మ జంటగా నటించిన 'రొమాంటిక్'(Romantic) మూవీ రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. కారణం అందరికి తెలిసిందే. కరోనా ప్రభావంతో చాలా చిత్రాలు వాయిదా పడుతూ వచ్చాయి. కానీ రొమాంటిక్ చిత్రానికి మంచి బజ్ కొనసాగుతూ వచ్చింది. ఆకాష్ తండ్రి పూరి జగన్నాధ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎట్టకేలకు ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ : వాస్కొ డ గామ (ఆకాష్ పూరి) చట్టాన్ని లెక్క చేయకుండా తిరిగే నేరస్థుడు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. తన బామ్మ రమాప్రభ కోరిక మేరకు ఆకాష్ పూరి డబ్బు సంపాదించేందుకు ఈ మార్గం ఎంచుకుంటాడు. గోవాలో డ్రగ్ మాఫియాని రూల్ చేసే లార్డ్ రోడ్రిగా గ్యాంగ్ లో ఆకాష్ చేరుతాడు. తక్కువ సమయంలోనే ఆకాష్ ఆ గ్యాంగ్ లో కీలక వ్యక్తిగా మారుతాడు. కొన్ని పరిస్థితుల వల్ల ఆకాష్ లార్డ్ రోడ్రిగాని, ఓ ఎస్ ఐ ని చంపుతాడు. ఈ క్రమంలోనే ఆకాష్ కి మోనికా( కేతిక శర్మ) పరిచయం అవుతుంది. ఆమెపై క్యాష్ మనసుపారేసుకుంటాడు. ఇక ఆకాష్ ని పట్టుకునేందుకు ఏసిపి అధికారిగా రమ్యకృష్ణ రంగంలోకి దిగుతుంది. ఆకాష్ ని రమ్యకృష్ణ అడ్డుకోగలిగిందా ? ఆకాష్, కేతిక మధ్య ప్రేమ ఏమైంది ? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ : దర్శకుడు పూరి తనయుడు కాబట్టి ఆకాష్ పూరిపై అందరి ఫోకస్ ఉంటుంది. తన మొదటి చిత్రంతో పోల్చుకుంటే ఆకాష్ ఈ మూవీలో మెచ్యూరిటీ ప్రదర్శించాడు. చలా సన్నివేశాలు ఆకాష్ పెర్ఫామన్స్ తో హైలైట్ గా మారాయి. ఆకాష్ ప్రతి డైలాగ్ డెలివరీలో కాన్ఫిడెన్స్ కనిపించింది. సినిమా ప్రధానంగా ఆకాష్ భుజాలపై సాగినట్లుగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ కేతిక శర్మ తన గ్లామర్ తో ఈ చిత్రం ద్వారా చాలా మంది అభిమానులని సొంతం చేసుకోవడం ఖాయం. యువతలో ఆమె క్రేజ్ పెరుగుతుంది. నటన కూడా డీసెంట్ గానే ఉంది. ఇక రమ్య కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా నటించింది. రమ్యకృష్ణ నటన ఈ చిత్రంలో మరో హైలైట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ ఎంగేజింగ్ గా , ఆకట్టుకునే విధంగా ఉండడం ఈ చిత్రాన్ని మరో బలం అని చెప్పొచ్చు. ఆకాష్, కేతిక మధ్య ప్రేమ కూడా ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఇక ఈ చిత్రంలో నెగిటివ్స్ మాట్లాడుకుంటే.. రొమాంటిక్ అనే టైటిల్ ఈ చిత్రానికి యాప్ట్ కాదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని నిమిషాలు, సెకండ్ హాఫ్ లో కొన్ని నిమిషాలు మినహా రొమాన్స్ ఎక్కడా కనిపించదు. మొత్తం యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి. ఆకాష్ తన ఏజ్ కు మించిన పాత్ర పోషించినట్లుగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ విషయంలో హీరో ప్రవర్తించే విధానం, కొన్ని సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమాత్రం మింగుడు పడని విధంగా ఉంటాయి.
నటీనటులు : ముందుగా చెప్పుకున్నట్లుగా ఆకాష్ పూరి, రమ్య కృష్ణ పాత్రలు ఈ చిత్రానికి ప్రధాన బలం. ప్రతి సన్నివేశంలో ఆకాష్ యాటిట్యూడ్, డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. సహజంగానే హుందాగా కనిపించే రమ్యకృష్ణ పోలీస్ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కేతిక శర్మ గ్లామర్ పరంగా హైలైట్ గా నిలిచింది. హీరోయిన్ గ్లామర్ కి మాత్రమే పరిమితం కావడం రెగ్యులర్ గా పూరి చిత్రాల్లో ఉండే వ్యవహారమే. మిగిలిన పాత్రలలో కొత్తదనం కనిపించదు.
సాంకేతికంగా : సినిమా మొత్తం పూరి జగన్నాధ్ స్టైల్ లోనే సాగుతుంది. పూరి ఫార్ములాని ఎగ్జిక్యూట్ చేయడంలో డెబ్యూ దర్శకుడిగా అనిల్ పాదురి విజయం సాధించారు. ప్రధాన నటీనటుల నుంచి దర్శకుడు మంచి పెర్ఫామెన్స్ రాబట్టుకోగలిగాడు. సునీల్ కశ్యప్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. బ్యాగ్రౌండ్ సంగీతం కూడా బావుంటుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఒకే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.
చివరగా : కంప్లీట్ గా పూరి జగన్నాధ్ మార్క్ తో సాగే చిత్రం రొమాంటిక్. ఆకాష్ పూరి పెర్ఫామెన్స్, కేతిక శర్మ గ్లామర్, యువతని ఆకట్టుకునే కొన్ని సన్నివేశాలు ఈ చిత్రాన్ని కాపాడాయి. ఏదో ఊహించేసుకోకుండా అంచనాలని అదుపులో ఉంచుకుంటే ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.
రేటింగ్ : 2.75/5