MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • తమిళ రాజకీయాల్లోకి రోజా జంప్..? విజయ్ దళపతి పార్టీలో కి వెళ్తుందా..?

తమిళ రాజకీయాల్లోకి రోజా జంప్..? విజయ్ దళపతి పార్టీలో కి వెళ్తుందా..?

నటి మాజీ మంత్రి రోజా పరిస్థితి ఏంటి..? ఆమె తెలుగు రాజకీయాలకు దూరం కాబోతోందా..? తమిళ రాజకీయాలవైపు చూస్తోందా..? ఏ పార్టీలో చేరబోతోంది..?  ప్రస్తుతం వస్తున్న వార్తల్లో నిజం ఎంత..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 09 2024, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వైసీపీ ఘోర పరాభవంతో..ఫైర్ బ్రాండ్స్ గా పేరున్న చాలామంది నేతలు ఇప్పుడు అస్సలు నోరు విప్పడంలేదు. అందులో మరీ ముఖ్యంగా రోజా అయితే ఎక్కడా కనిపించడంలేదు. వైసీపీ అధికారంలో ఉండగా.. నోటికి వచ్చినట్టు మాట్లాడారు రోజా. రాజకీయ నేతలతో పాటు.. పవర్ కళ్యాణ్, చిరంజీవి, రజినీకాంత్ లాంటివారిపై అనవసరంగా నోరు పారేసుకుంది. కాని ఈరేంజ్ లో ఓటమిని వారు ఊహించలేకపోయారు. దాంతో ఇప్పుడు అసలే బయట కనిపించడానికే భయపడే పరిస్థితి వచ్చింది. 

జూనియర్ ఎన్టీఆర్ పాడిన సాంగ్స్ ఎన్నో తెలుసా..? అన్నీ సూపర్ హిట్ పాటలే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరీ ముఖ్యంగా రోజా పరిస్థితి ధారుణంగా ఉంది. ఆమె నగిరి నియోజకవర్గంలో సొంత పార్టీవాళ్లే.. రోజా ఓటమికి పనిచేశారు అన్నది బహిరంగ నిజం. దాంతో వైసీపీలో ఉంటే.. నగిరి నుంచి ఆమె మరోసారి పోటీ చేసినా గెలవడం కష్టమనే సూచనలు వచ్చాయి. ఇకదానికి తోడు కేసుల భయం కూడా ఆమోలో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఆమె తన మెట్టినిల్లు అయిన చెన్నైకే పరిమితం అవుతోంది. నగిరికి కాని.. వైసీపీ కేంద్ర కార్యాలయానికి కాని ఆమె వచ్చినట్టు లేదు. ఓటమి తరువాత అసలు యాక్టీవగా లేరురోజ. 
 

36

అంతే కాదు వైసీపీ నిరసన కార్యక్రమాలు, జగన్ దీక్షల్లో కూడా ఆమె ఎక్కవగా కనిపించలేదు. ఏదో ఉన్నారు అన్నట్టే ఉంటున్నారు. గతంలో చీటికిమాటికి పెస్ మీట్ లు పెట్టి.. అందరిపై నోరు పారేసుకునే రోజా.. జగన్ ఇంతలా మొత్తకుంటున్నా..అతనికి సపోర్ట్ గా ఒక్క సారి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. దాంతో రోజా వైసీపీని వీడబోతున్నారు అన్న టాక్ గట్టిగావినిపిస్తోంది. అయితే రోజా ఏ పార్టీలోకి వెళ్ళారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రాలో ఆమె వేరే పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదు. అందరిని నోటికొచ్చినట్టు తిట్టారు కాబట్టి.. వైసీపీని వీడితే.. ఆమె ఆంధ్రా రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టే అనాలి. 

46

ఇక్కడ ఏపార్టీ ఆమెను చేర్చుకోరు అనేది నిజం.. దాంతో తన అత్తారిల్లు అయిన తమిళనాడు రాజకీయాల్లోకి ఆమె వెళ్ళబోతుందని తెలుస్తోంది. ఆమె ఇప్పుడు ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు.. తమిళనాడులో ఎక్కువగా పర్యటిస్తుంది. దాంతో ఆమె అరవరాజకీయాలవైపు చూస్తుందని టాక్. మరో వాదన ఏంటంటే.. విజయ్ దళపతి పెట్టిన కొత్త పార్టీలోకి ఆమె వెళ్తుందని టాక్ గట్టిగా నడుస్తోంది. లేదా ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకేలో రోజే చేరే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో.. ఈలోపే ఆమె అక్కడ పాగా వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

56

ఇక ముందుగా రోజా సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందన్న టాక్ కూడా నడిచింది. అయితే జబర్థస్త్ లోకి ఆమెకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టినట్టు సమాచారం. ఇక చిరు, పవన్, బాలయ్యపై ఆమె చేసిన విమర్శల కారణంగా.. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలపై హోప్స్ లేవు.. తమిళనాట రజినీకాంత్ పై ఆమె చేసిన వాఖ్యలు.. వైసీపీ తిట్లు కారణంగా రోజాపై అక్కడ కూడా వ్యతిరేకత ఉంది. దాంతో రాజికీయంగానే చూసుకోవాలి అని ఆమె భవిస్తుందన్న టాక్ నడుస్తోంది. మరి రోజా ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. ఒకటి మాత్రం నిజం.. ప్రస్తుతం వైసీపీలో ఆమె యాక్టీవ్ గా లేరు అన్నది అందరికి తెలిసిన నిజం.

66

తెలుగు రాజకీయాల్లో బూతుల మంత్రిగా పేరు ఉన్న రోజాకు.. తమిళనాడు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తాయా అనేది చూడాలి. అసలే రోజా తెలుగు రాజకీయాలు వదిలి తమిళ పాలిటిక్స్ వైపు వెళ్తారా..? వెళ్తే.. అక్కడ వచ్చే విమర్శలు ఆమె ఫేస్ చేయగలరా అనేది కూడా ప్రశ్నే. ఆంధ్రాలో ఉంటే.. రోజా వైపు.. టీటీడీ టికెట్ల స్కామ్ దగ్గర నుంచి అనేక రకాల కేసులను ఆమె ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి రోజా నిర్ణయం ఎలా ఉండబోతుంది చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved