- Home
- Entertainment
- క్లీనింగ్ సిబ్బందిని అవమానించిన రోజా, దూరంగా ఉండాలంటూ సైగలు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
క్లీనింగ్ సిబ్బందిని అవమానించిన రోజా, దూరంగా ఉండాలంటూ సైగలు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
క్లీనింగ్ చేసుకునే సాధారణ కార్మికులకుఎవరైనా గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. వారులేకుంటే మనం ఇంత ప్రశాంతంగా ఉండలేము అటువంటిది వారిని అవమానించిందట స్టార్ నటి.. ఆంధ్ర పొలిటీషియన్ రోజ. ఇంతకీ సంగతేంటంటే..?

Actress roja
ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోయి పెద్దగా బయటకురావడం లేదు రోజ. తన అత్తవారింట ఎక్కువగా కనిపిస్తోంది. తమిళనాట తిరుగుతోంది. చెన్నైలోనే ఎక్కువ గా ఉంటోంది. ఫ్యామిలీతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తోంది. ఏదో అప్పుడప్పుడు ఉన్నాను అన్నట్టుగా ఏపీ రాజకీయాలపై స్పందిస్తోంది రోజా. ఇక ఈమధ్య కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోంది రోజ.
జమున మీద పగబట్టిన ఎన్టీఆర్ - ఏఎన్నార్, ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?
roja
కాగా రోజా చేసిన ఓ పని విమర్షలకు దారి తీస్తోంది. అసలే ఓటమి బాధ నుంచి బయటపడలేక ఇబ్బందిపడుతున్న రోజాకు దెబ్బ మీద దెబ్బ తప్పడంలేదు. రెండు సార్లు ఎమ్మెల్యేగా.. ఓ మారు మంత్రిగా పనిచేశారు రోజా. ఆంధ్రప్రదేశ్ సాంసృతిక శాఖా మంత్రిగా రెండేళ్లకు పైగా పదవిలో ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రభంజనం తట్టుకుని నిలబడ్డ వెంకటేష్ సినిమా ఏదో తెలుసా..?
హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని స్టార్ డమ్ చూశారు రోజ. తెలుగులో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక తమిళనాట సూపర్ స్టార్ రజీనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్, శరత్ కుమార్, లాంటి హీరోలతో నటించించి. హీరోయిన్ గా స్టార్ డమ్ ను చూసి రోజా.. ఆతరువాత తల్లి పాత్రలు కూడా చేసింది.
రాజమౌళి ఆఫర్.. నో చెప్పిన సూర్య.. గోల్డెన్ ఛాన్స్ ను తమిళ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?
Ex Minister Roja
రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సినిమాలు మానేసిన ఆమె.. ఎమ్మెల్యే , మంత్రి అయిన తరువాత స్క్రీన్ కు దూరం అయ్యారు. ఇక ఇప్పుడు ఓడిపోవడంతో రోజ మళ్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని టాక్ వినిపిస్తుంది. ఈ విసయంలో అఫీషియల్ గా ఎవరూ చెప్పకపోయినా.. పరిస్థితులు మాత్రం అలానే కనిపిస్తున్నాయి. ఈక్రమంలో రోజా ఓ వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాట విమర్శలు ఎదుర్కొంటున్నారు.
10 ప్లాప్ లు అయినా తగ్గని స్టార్ హీరో.. సినిమాకు 100 కోట్లు పైనే వసూలు చేస్తున్న నటుడు ఎవరు...?
Roja
నటి రోజా సామి మురుగన్ ఆరుపద గృహాలలో ఒకటైన తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయానికి దర్శనం కోసం వెళ్లారు. నిన్న తిరుచెందూరు ఆలయంలో ఆణి వరుషాభిషేక కార్యక్రమం జరగడం తో.. అందులో ఆమె పాల్గొన్నారు. ఈ వేడుకలో రోజా తన భర్త సెల్వమణితో కలసి స్వామివారి దర్శనానికి వెళ్లగా.. అక్కడ పలువురు గుమిగూడి ఆమెతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. ఒక్కసారిగా పక్కనే ఉన్న కొందరు పారిశుధ్య కార్మికులు ఆయనతో ఫొటో దిగేందుకు వచ్చారు.
కాని రోజా వారిని దగ్గరకు రానివ్వలేదు. దూరంగా ఉండి ఫోటో దిగండి అన్నట్టుగా సైగ చేశారని సమాచారం. వారిని చూసి చూడగానే తన దగ్గరకు రావద్దని సైగ చేసి దూరంగా ఉండి సెల్ఫీ దిగాలని కోరినట్లు తెలుస్తోంది. ఆమె అలా అనడంతో బాధపడ్డ క్లీనింగ్ సిబ్బంది ఒక్కసారిగా ముఖం మారిపోయింది. ఆ బాధతోనే ఆమె పక్కన నిలబడి రోజాతో సెల్ఫీ దిగి వెళ్లిపోయారు.
Roja Selvamani
ఇక ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు రోజాపై విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది పెద్ద వివాదం అవుతోంది. ఓడిపోయిన తరువాత కూడా ఇలా పొగరు చూపించడం.. సామాన్యులను ఇలా అవమానించడంపై రోజాపై రకరకాల విమర్షశలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా రోజా తిరుమలలో ఇలానే చేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చిన అభిమానులను దూరంగా ఉండాలని అన్నారు.