- Home
- Entertainment
- బిగ్ బాస్ తెలుగు 9 లేటెస్ట్ ఓటింగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్లోకి క్రేజీ కంటెస్టెంట్.. టాప్‌లో ఉన్నదెవరంటే?
బిగ్ బాస్ తెలుగు 9 లేటెస్ట్ ఓటింగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్లోకి క్రేజీ కంటెస్టెంట్.. టాప్‌లో ఉన్నదెవరంటే?
బిగ్ బాస్ తెలుగు 9 12వ వారానికి సంబంధించి నామినేషన్‌లో ఉన్న వారి లేటెస్ట్ ఓటింగ్ డిటెయిల్స్ బయటకు వచ్చింది. ఈ వారం డేంజర్ జోన్‌లోకి ఊహించని కంటెస్టెంట్ రావడం ఆశ్చర్యపరుస్తోంది.

బిగ్ బాస్ 9 తెలుగు లేటెస్ట్ ఓటింగ్
బిగ్ బాస్ తెలుగు 9.. 12వ వారం మిడ్ వీక్ కి చేరుకుంది. ఈ వారం నామినేషన్‌లో ఉన్నవారికి ఓట్ వేసేందుకు ఇంకా రెండు రోజులే ఉంది. గత వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. దివ్య ఎలిమినేట్ కావాల్సి ఉండగా, ఇమ్మాన్యుయెల్ వద్ద ఉన్న పవర్‌తో సేవ్ అయ్యింది. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించి ఆసక్తి నెలకొంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.
డేంజర్ జోన్‌లో మరోసారి దివ్య
12వ వారానికి సంబంధించి కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయెల్, సంజనా గల్రానీ, భరణి, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, దివ్య నిఖిత నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది సస్పెన్స్ ని క్రియేట్ చేస్తోంది. లేటెస్ట్ ఓటింగ్ రిజస్ట్ చూస్తే, బుధవారం వరకు నమోదైన ఓటింగ్ ప్రకారం ఈ వారం కూడా దివ్య బాటమ్ లో ఉంది. ఆమె మూడు వారాలుగా లీస్ట్ లో ఉంటోంది. గత వారమే హౌజ్‌ని వీడాల్సి వచ్చింది. కానీ జస్ట్ లో తప్పించుకుంది. కానీ ఇప్పుడు కూడా లీస్ట్ లోనే ఉండటం గమనార్హం. ఆమెకి ఐదు శాతం ఓట్లు మాత్రమే నమోదైనట్టు తెలుస్తోంది.
అనూహ్యంగా డేంజర్ జోన్‌లోకి సుమన్ శెట్టి
ఇక ఆ తర్వాత డేంజర్ జోన్‌లో ఊహించని కంటెస్టెంట్లు, క్రేజీ కంటెస్టెంట్ ఉండటం విశేషం. ఆయన ఎవరో కాదు సుమన్ శెట్టి. తనదైన కామెడీతో ఆడియెన్స్ ని అలరించిన సుమన్ శెట్టి జెన్యూన్ ఆటగాడిగా రాణిస్తున్నారు. అభిమానుల మనసులను దోచుకుంటున్నాడు. ప్రారంభం నుంచి నిర్వహించిన పోటీలో సుమన్ శెట్టి టాప్‌లో ఉంటున్నాడు, కానీ ఇప్పుడు ఆయన అనూహ్యంగా పడిపోయాడు. దివ్య తర్వాత ఆయనే బాటమ్‌లో ఉన్నాడు. ఓ రకంగా డేంజర్ జోన్‌లోనే ఉన్నట్టు చెప్పొచ్చు. ఆయనకు కూడా ఐదు నుంచి ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇదే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే దివ్యతోపాటు సుమన్ శెట్టి కూడా ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదు.
ఓటింగ్‌కి మరో రెండు రోజులు ఛాన్స్
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో పోలింగ్ ప్రకారం టాప్‌లో కళ్యాణ్ ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో తనూజ ఉంది. మూడో స్థానంలో ఇమ్మాన్యుయెల్ ఉన్నాడు. నాల్గో స్థానంలో సంజనా గల్రానీ ఉన్నారు. ఐదో స్థానంలో భరణి ఉన్నారు. మొదటి రెండు రోజుల్లో డౌన్‌లో ఉన్న భరణి కాస్త పుంజుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆరో స్థానంలో డీమాన్ పవన్, ఏడో స్థానంలో సుమన్ శెట్టి, ఎనిమిదో స్థానంలో దివ్య ఉన్నారు. ఓ రకంగా దివ్యతోపాటు సుమన్ శెట్టి, డీమాన్ పవన్ కూడా డేంజర్‌లోనే ఉన్నట్టుగా చెప్పొచ్చు. గురువారం, శుక్రవారం ఓటింగ్‌లో ఏదైనా మార్పు వస్తే ఎలిమినేషన్ మారే అవకాశం ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో తనూజ, కళ్యాణ్, డీమాన్ పవన్, రీతూ చౌదరీ, భరణి, సంజనా, ఇమ్మాన్యుయెల్, దివ్య, సుమన్ శెట్టి ఉన్నారు.

