'ఓపెన్ హైమర్'కి నెహ్రూ టాప్ సీక్రెట్ లెటర్ పంపారా ?.. భగవద్గీత కాకుండా ఇండియాతో మరో కనెక్షన్
క్రిస్టఫర్ నోలెన్ పేరు చెప్పగానే ఇంటర్ స్టెల్లార్ లాంటి నభూతో నభవిష్యతి అనిపించే చిత్రాలు గుర్తుకు వస్తాయి. నోలెన్ ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్. నోలెన్ చివరగా టెనెట్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన అత్యంత ఆసక్తికరమైన బయోగ్రఫీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
క్రిస్టఫర్ నోలెన్ పేరు చెప్పగానే ఇంటర్ స్టెల్లార్ లాంటి నభూతో నభవిష్యతి అనిపించే చిత్రాలు గుర్తుకు వస్తాయి. నోలెన్ ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్. నోలెన్ చివరగా టెనెట్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన అత్యంత ఆసక్తికరమైన బయోగ్రఫీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై రెండు అణు బాంబులు పడ్డాయి. దీనితో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నారు.
మొట్టమొదటి అణుబాంబు సృష్టించింది ఆయనే. అణుబాంబు పితామహుడిగా రాబర్ట్ ఓపెన్ హైమర్ గుర్తింపు పొందారు. ఒక మహా ప్రాజెక్టు లాగా ఓపెన్ హైమర్ కి అణుబాంబుని తయారు చేసే బాధ్యత అప్పగించారు. ఆ సమయంలో ఓపెన్ హైమర్ లో ఎలాంటి అంతర్మధనం జరిగింది.. ఆయన ఆలోచనలు ఏ రకంగా ఉండేవి.. ప్రజల ప్రాణాల గురించి ఆయన ఆలోచించారా ? ఇలాంటి అంశాలన్నీ ఎమోషనల్ గా ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. జూలై 21 ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.
యూఎస్ నుంచి ఈ చిత్రానికి ఆల్రెడీ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. క్రిస్టఫర్ నోలెన్ అణుబాంబు తరహాలో ఎమోషన్స్ పేల్చారు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఓపెన్ హైమర్ చిత్రం కోసం ఇండియన్ ఆడియన్స్ కూడానా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియాతో ఓపెన్ హైమర్ కి పరోక్షంగా ఉన్న కనెక్షన్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది.
అదేంటంటే ఓపెన్ హైమర్ ఇండియా పవిత్ర గ్రంథం భగవద్గీత నుంచి ఎంతో ఇన్సిపిరేషన్ పొందారు. అంతే కాదు ఆయన సంస్కృతంని స్పష్టంగా చదవగలరని తెలుస్తోంది. ఓపెన్ హైమర్ అణుబాంబుని మొదటిసారి టెస్ట్ చేసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది ప్రపంచ వినాశనానికే అని ఆయనకి అర్థం అయ్యింది. ఈ మానసిక సంఘర్షణ నుంచి బయటపడేందుకు భగవద్గీత చదివారు.
భగవద్గీత శ్లోకాల్లో శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశాన్ని కూడా ఓపెన్ హైమర్ కోట్ చేశారు. సృష్టించేది నేనే.. నాశనం చేసేది కూడా నేనే.. నీవు నీ కర్తవ్యం మాత్రమే చేయి.. అని ఓపెన్ హైమర్ అప్పట్లో తెలిపారు. ఆ పాత్ర పోషిస్తున్న సిల్లియన్ మర్ఫీ కూడా తాను భగవద్గీత చదివానని చెప్పడం విశేషం. కేవలం ఇండియాకి ఓపెన్ హైమర్ కి భగవద్గీత మాత్రమే కనెక్షన్స్ కాదు..మరొక ఆసక్తికర కనెక్షన్ కూడా ఉంది. అదేంటంటే దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాబర్ట్ ఓపెన్ హైమర్ కి 1954లో సీక్రెట్ లెటర్ పంపారట.
ఈ విషయాన్ని ఇండియన్ శాత్రవేత్త హోమి జహంగీర్ బాబా బయోగ్రఫీలో పొందుపరిచారు. జహంగీర్ బాబా బయోగ్రఫీని భక్తిర్ దాదాభోయ్ అనే ఆథర్ రాశారు. ఓపెన్ హైమర్ కి జహంగీర్ బాబా చాలా సన్నిహితంగా మెలిగినట్లు బయోగ్రఫీలో ఉంది. జహంగీర్ బాబా ద్వారా ఓపెన్ హైమర్ కి జవహర్ లాల్ నెహ్రుతో అప్పట్లో పరిచయం ఏర్పడిందట. అణుబాంబుని విజయవంతగా టెస్ట్ చేసిన తర్వాత నుంచి నెహ్రు ఓపెన్ హైమర్ ని ఇండియా విజిట్ చేయాలని రిక్వస్ట్ చేసేవారట. అంతే కాదు ఇండియాలో వచ్చి స్థిరపడాలని కూడా కోరారట.
అదే విధంగా నెహ్రు ఆయనకి ఒక టాప్ సీక్రెట్ లెటర్ కూడా పంపినట్లు బయోగ్రఫీలో ఉంది. అయితే నెహ్రు రిక్వస్ట్ ని ఓపెన్ హైమర్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. 1954లో ఓపెన్ హైమర్ దేశానికీ వ్యతిరేకంగా మారారని నిందలు పడ్డాయి. ఆయనపై సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ కూడా ఏర్పడ్డాయి. దీనితో ఓపెన్ హైమర్.. నేహ్రూ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది.