- Home
- Entertainment
- ఆకుపచ్చ చీరలో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తున్న రీతూ వర్మ.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న తెలుగమ్మాయి..
ఆకుపచ్చ చీరలో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తున్న రీతూ వర్మ.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న తెలుగమ్మాయి..
తెలుగు హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma) సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. నిండు తెలుగుదనంతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. రీతూ వర్మ లేటెస్ట్ ఫొటో షూట్ ఆకర్షణీయంగా ఉంది. తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ గ్లామర్ ఫీల్డ్ కు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తూ వచ్చింది. ఇటీవల చీరకట్టులో దర్శనమిస్తూ అచ్చమైన తెలుగమ్మాయి అనిపిస్తోంది. ట్రెడిషనల్ వేర్ తో వచ్చే అట్రాక్షనే వేరు అని తెలియజేస్తోంది.
రీతూ వర్మ అభిమానులు కూడా ఆమెను ట్రెడిషన్ లుక్ లోనే చూసేందుకు ఇష్టపడుతారు. మరీ ముఖ్యంగా శారీలో రీతూ వర్మ కనువిందు చేసిందంటే చాలు అభిమానులు ఖుషీ అవుతుంటారు. ఈ సందర్భంగా రీతూ లేటెస్ట్ గా చేసిన ట్రెడిషనల్ ఫొటోషూట్లు ఆకట్టుకుంటోంది.
తాజాగా ఆ ఫొటోషూట్ కు సంబంధించిన పిక్స్ ను రీతూ ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో రీతూ గ్రీన్ కలర్ పట్టు శారీ, మెరూన్ ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ లో మెరిసిపోతోంది. మెడభాగంలో బెస్ట్ జ్యూయలరీ ధరించడంతో తన మెహం ప్రకాశిస్తోంది.
తన చిరునవ్వుతో వెన్నెల వెలుగులను పూయిస్తోంది. ఆకట్టుకునేలా ఫొటోలకు పోజులిస్తూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. ‘నా అంతర్గత దేశీ అమ్మాయిని ప్రకాశింపజేస్తుున్నాను’ అంటూ క్యాపక్షన్ ఇస్తోంది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఆమె అందాన్ని పొగుడుతూ ఫొటోలను లైక్ చేస్తున్నారు.
ప్రస్తుతం రీతూ వర్మ టాలీవుడ్, కోలీవడ్ లో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. చివరిగా ‘వరుడు కావలెను’ చిత్రంలో నాగశౌర్య సరసన నటించింది. ఓటీటీ వేదికన రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్సే దక్కించుకుంది.
సినిమాల విషయంలోనూ రీతూ వర్మ తొందరపడటం లేదు. ఆచితూచి అడుగేస్తోంది. పాత్ర నచ్చితేనే ఒకే చెబుతోంది. చాలా డీసెంట్ రోల్స్ లో నటిస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. రీతూ నటించిన మూడు చిత్రాలు ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమవుతున్నారు. అందులో ‘ఒకే ఒక జీవితం’, ‘ఆకాశం’, ‘ధ్రువ నక్షతం’ చిత్రాలున్నాయి. ఇవి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనును పూర్తి చేసుకుంటున్నాయి. తెలుగు, తమిళంలో సినిమాలు రిలీజ్ కానున్నాయి.