జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ విలన్‌గా నటించిన సినిమాలు ఏవో తెలుసా?
మే 1న విడుదలైన 'రైడ్ 2' సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్ విలన్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ఆయన మనోహర్ ధంకడ్ అలియాస్ దాదా భాయ్ పాత్రను పోషించారు. ప్రేక్షకులు ఆయన పాత్రను బాగానే ఆదరించారు. ఇక ఈ సినిమాకంటే ముందు రితేష్ గతంలో ఎప్పుడెప్పుడు విలన్‌గా నటించారో తెలుసా?

రైడ్ 2 కి ముందు రితేష్ విలన్ పాత్రలు
మాజీ హీరోయిన్ జెనిలియా భర్త, రితేష్ దేశ్‌ముఖ్ ఫిల్మోగ్రఫీని పరిశీలిస్తే, 'రైడ్ 2'కి ముందు ఆయన రెండుసార్లు విలన్‌గా నటించారు. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.
ఏక్ విలన్ లో రితేష్
రితేష్ దేశ్‌ముఖ్ మొదటిసారిగా 'ఏక్ విలన్' చిత్రంలో విలన్‌గా నటించారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లు గా నటించారు.
ఏక్ విలన్ బాక్సాఫీస్ కలెక్షన్స్
27 జూన్ 2014న విడుదలైన 'ఏక్ విలన్' బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం భారతదేశంలో రూ.105.62 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.169.62 కోట్లు వసూలు చేసింది.
మర్జావాన్ లో రితేష్
రితేష్ విలన్‌గా నటించిన రెండవ చిత్రం 'మర్జావాన్'. ఈ చిత్రానికి మిలాప్ జవేరి దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించారు.
మర్జావాన్ బాక్సాఫీస్ కలెక్షన్స్
15 నవంబర్ 2019న విడుదలైన 'మర్జావాన్' బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. యావరేజ్ పెర్ఫామెన్స్ ను కనబరిచింది. ఈ చిత్రం భారతదేశంలో రూ.47.78 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.65.34 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు సినిమాల్లో రితేేష్ విలన్ గా నటించారు.