- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుధారకు ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయబోతున్న రిషి.. గౌతమ్ పరిస్థితి ఏంటో?
Guppedantha Manasu: వసుధారకు ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయబోతున్న రిషి.. గౌతమ్ పరిస్థితి ఏంటో?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక వసుధార (Vasudhara) లైబ్రరీ మేటర్ జగతికి చెప్పినందుకు రిషి చిరాకు పడుతూ ఏ విషయం చెప్పాలో..ఏ విషయం చెప్పకూడదో తెలియదా అంటూ విరుచుకు పడతాడు.

ఈ క్రమంలో 'అందుకే కదా నిన్ను హాస్టల్ కి' అని మెన్షన్ చేస్తాడు. ఇక ఏంటి సార్ అని వసు (Vasu) అడగగా ఏం లేదు గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రిషి పై గౌతమ్ కొంతసేపు ఫన్నీ గా విరుచుకు పడతాడు. ఆ తర్వాత రిషి నేను చేసిన బొమ్మ కనిపించడం లేదు ఏంటిరా అని అడగగా.. నాకేం తెలుసు అని గౌతమ్ (Goutham) అబద్దం చెబుతాడు.
ఇక ఆ తర్వాత గౌతమ్ (Goutham) తన చేతిలో ఉన్న చార్ట్ ఆఫీస్ కి సంబంధించిన చార్ట్ అని గ్రహించి చార్ట్ మారిపోయింది అని తెలుసుకొని ఆఫీస్ రూమ్ కి వెళ్తాడు. ఇక మహేంద్ర వసుధార ఆర్ట్ ఉన్న చార్ట్ ను ఓపెన్ చేస్తూ ఉండగా గౌతమ్ మీరు దీన్ని చూడద్దు అని ఫన్నీ గా లాక్కుంటాడు. తర్వాత దాన్ని మహేంద్ర (Mahendra) కు తెలియకుండా తన షర్ట్ వెనకాల పెట్టుకుని బయటకు వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత మహేంద్ర (Mahendra) ' గౌతమ్ ఎందుకు చార్ట్ ను దాచుకకుంటున్నాడు. మొత్తానికి ఏదో జరుగుతుంది' తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత మహేంద్ర, జగతి, రిషి లు కలిసి ఆఫీస్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు రిషి డాడ్ మీరు టాబ్లెట్ వేసుకునే టైం అయింది అని చెప్పి రిషి (Riehi) నే స్వయంగా టాబ్లెట్ ఇస్తాడు.
దానికి జగతి (Jagathi) , మహేంద్ర లు మనసులో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు. మీటింగ్ ఫినిష్ అయిన తర్వాత వాళ్లు వెళుతూ ఉండగా జగతి తో రిషి మేడం మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అక్కడే ఉంచుతాడు. షార్ట్ ఫిలింలో గౌతమ్ (Goutham) యాక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెబుతాడు.
ఆ తర్వాత గౌతమ్ (Goutham) , వసకు ప్రపోజ్ చేయడానికి రాగా రిషి, గౌతమ్ చేతిలో ఫ్లవర్ లాక్కొని గౌతమ్ ని బయటికి పంపుతాడు. ఇక ఆ ఫ్లవర్ తో రిషి వసుధార (Vasudhara) కు ప్రపోజ్ చేయబోతాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.