హైలెట్ స్టోరీ.. తనకు తెలియకుండానే వసుతో ప్రేమలో పడ్డ రిషి?
బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కథతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ మొదటి రేటింగ్ తో బాగా దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

రిషి (Rishi) ఒంటరిగా కూర్చొని వసు గురించి ఆలోచిస్తాడు. తనను వసు పిలిచినట్లుగా అనిపించటంతో అక్కడ ఇక్కడ చూస్తుంటాడు. గతంలో తనతో మాట్లాడిన మాటలను తలచుకుంటాడు. అంతేకాకుండా గర్ల్ ఫ్రెండ్ సాక్షి ని (Sakshi) కూడా గుర్తు చేసుకుంటు ఆలోచనలో పడతాడు.
అప్పుడే ధరణి (Dharani) అక్కడినుంచి వెళ్తూ రిషిని చూసి రిషి దగ్గరకు వస్తుంది. ఇక ధరణి రిషిని (Rishi) ఏమైందని అడగటంతో తనకు నమ్మకం మీద నమ్మకం పోయిందని నమ్మకం గురించి మాట్లాడుతాడు. కొందరు తమ జీవితంలోకి ప్రయాణం చేసే వాళ్ళులా వస్తారని అప్పుడు సాక్షి ఇప్పుడు వసు అనేసరికి మాట మాట్లాడటం ఆపుతాడు.
వెంటనే ధరణి ఇప్పుడు ఎవరని అడిగేసరికి రిషి (Rishi) ఏం సమాధానం చెప్పలేక పోతాడు. ధరణి తన మనసులో మహేంద్ర వర్మ మాట్లాడిన మాటలు తలుచుకొని రిషి ఇప్పటికి కూడా వసు (Vasu) గురించి బయట పెట్టడం లేదని అనుకుంటాడు.
మరోవైపు జగతి (Jagathi) ఇంటిని వసు పువ్వులతో అలంకరిస్తుంది. అది చూసి జగతి మురిసిపోతుంది. ఎంగేజ్మెంట్ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే శిరీష్ కారులో వస్తాడు. తనతో పాటు తాను ఎంగేజ్మెంట్ చేసుకునే అమూల్య (Amulya) అనే అమ్మాయిని తీసుకొని వచ్చి జగతి వాళ్లకు పరిచయం చేస్తాడు.
ఇక వసు తన పరిచయాన్ని ఆ అమ్మాయితో పెంచుకుంటూ ఉండగా ఇక శిరీష్ (Sireesh) సరదాగా తనకు కౌంటర్ ఇస్తాడు. ఇక ఇంట్లోకి వెళ్లగా జగతి వాళ్లకు స్వీటు ఇస్తుంది. వాళ్ళతో కాసేపు మాట్లాడి పెద్దలను కాదనుకొని చేసుకుంటున్న అమూల్య ధైర్యాన్ని మెచ్చుకుంటుంది.
మహేంద్రవర్మ (Mahendra Varma) రెడీ అవుతుండగా ధరణి వచ్చి రిషి గురించి చెబుతుంది. ఇక మహేంద్రవర్మ ఆలోచనల్లో పడి రిషి దగ్గరికి వెళ్తాడు. రిషి వసు మాటలను తలుచుకుంటూ తన బట్టలను సర్దుకుంటాడు. అక్కడికి మహేంద్రవర్మ వచ్చి రిషి (Rishi) ని ఎక్కడికి వెళ్తున్నావు అని ఎంగేజ్ మెంట్ కు రావా అని అడుగుతాడు.
రిషికి కోపం రావటం తో మీరంతా ఉన్నాక నేను ఎందుకు రావాలి అని బదులిస్తాడు. నిర్ణయం మార్చుకోవా అని మహేంద్ర వర్మ ( Mahendra Varma) అనటంతో మార్చుకోను అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు రిషి. మహేంద్ర వర్మ సైలెంట్ గా ఉండిపోతాడు. జగతి ఇంట్లో శిరీష్ (Sireesh) ను రెడీ చేస్తాడు మహేంద్రవర్మ.
ఇక వసు (Vasu) అమూల్య ను కూడా రెడీ చేస్తుంది. అమూల్య వసును కూడా రెడీ అవమని ఉండటంతో నేను ఎందుకు రెడీ అవ్వాలి అని అంటుంది. అప్పుడే జగతి వచ్చి వసును చీర కట్టుకోమని చెప్పేసరికి వసు కాస్త షాక్ అయినట్లు అనిపిస్తుంది. తరువాయి భాగం లో రిషి జగతి (Jagathi) ఇంటికి వచ్చినట్లు కనిపిస్తాడు. మొత్తానికి రిషి వసు ప్రేమలో పడినట్లు తెలుస్తుంది.