- Home
- Entertainment
- Guppedantha Manasu: వసు, సాక్షి మధ్య పోటీ పెట్టనున్న రిషీ.. ఈగో మాస్టర్ ప్లానే ప్లాను!
Guppedantha Manasu: వసు, సాక్షి మధ్య పోటీ పెట్టనున్న రిషీ.. ఈగో మాస్టర్ ప్లానే ప్లాను!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా మంచి ప్రేమ కథతో కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 22 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో పుష్పకీ ఫోన్ రావడంతో మాట్లాడానికి బయటకు వెళుతుంది. అప్పుడు రిషి(rishi), వసు కీ గులాబీ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆల్ ది బెస్ట్ చదువుల పండుగ సక్సెస్ కావాలి అని వసుకు మెసేజ్ చేస్తాడు. మరొకవైపు జగతి, మహేంద్ర ఇద్దరు వసు(vasu), రిషి ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వారిద్దరి ప్రేమ విషయం గురించి మాట్లాడుతూ ఇప్పుడు దగ్గర అవుతారో అని అనుకుంటూ ఉంటారు.
మరొకవైపు సాక్షి,దేవయాని(devayani)కి ఫోన్ చేసి చదువుల పండుగ ప్రాజెక్టులో రిషికి అసిస్టెంట్ గా ఉంటాను. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేలోపు రిషి మనసులో స్థానం సంపాదిస్తాను మీరు నాకు హెల్ప్ చేయండి ఆంటీ అని దేవయానిని అడుగుతూ ఉంటుంది. మరొకవైపు వసు కూర్చుని చదువుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి గౌతమ్(gautham) వస్తాడు. అప్పుడు వారిద్దరూ మాట్లాడుతూ ఉండగా అక్కడికి రిషి వస్తాడు.
అప్పుడు వారిద్దరికీ క్లాస్ పీకీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసు(vasu) రిషి రూమ్ కి వెళ్తుంది. అప్పుడు వసు బాడ్జెట్స్ ఎలా ఉన్నాయి సార్ అని అడుగుతుంది. అప్పుడు రిషి, వసు ఆ బాడ్జెట్స్ గురించి ఇద్దరు ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వసు ఆ బాడ్జెట్ ని రిషి (rishi)కోటు కీ పెడుతూ ఉండగా అప్పుడు వారిద్దరూ ప్రేమగా ఒకరి పైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు.
ఇంతలోనే సాక్షి(sakshi)అక్కడికీ వచ్చి అది చూసి రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు రిషి,తన కోట్ తీసి వసు ని వేసుకోమని చెప్తాడు. అది చూసి సాక్షి రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు చదువుల పండుగ గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు రిషి ఇతను అసిస్టెంట్ గా తీసుకోవడానికి వసు,సాక్షి లకు పరీక్ష పెడతాడు. అప్పుడు రిషి(rishi)మాట్లాడుతూ నేను వారి ఇద్దరిని సింపుల్ గా మూడు ప్రశ్నలు అడుగుతాను.
వారిద్దరు చెప్పే సమాధానాలు మీకు ఎలా ఉన్నాయో చెబితే దాన్ని బట్టి నేను అసిస్టెంట్ గా ఎవరిని తీసుకోవాలి అని నిర్ణయిస్తాను అంటారు. అప్పుడు రిషి (rishi) మొదటి ప్రశ్న అడుగుతూ జీవితం ఏంటి అని అడగగా వసు(vasu),సాక్షిని అడగగా మొదటి ప్రశ్నకు సాక్షికి ఎక్కువ మార్కులు వస్తాయి. ఒక రెండవ ప్రశ్న అడగగా సాక్షి సమాధానం చెప్పడంతో అక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.