Guppedantha Manasu: సహనాన్ని కోల్పోయిన రిషి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన వసుధార!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ప్రేమికురాలిని దూరం పెడుతూనే ఆమె ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఒక ప్రేమికుని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో బస్తీ వాళ్లు వసుధారతో గొడవకి దిగుతారు. అప్పుడే రిషి వచ్చి ఇక్కడ కి ఎందుకు వచ్చారు వీళ్ళతో ఎందుకు గొడవ పడుతున్నారు అసలు మీకు బుద్ధుందా అని వసుధారని మందలిస్తాడు. అలా బుద్ధి చెప్పండి అంటుంది బస్తీ ఆవిడ. ఎవరికి బుద్ధి చెప్పాలి మీ పిల్లల్ని చదువుకోమంటున్నందుకు ఆవిడకి బుద్ధి చెప్పాలా అని అడుగుతాడు రిషి.
మీరు కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారేంటి సార్ అని అడుగుతుంది ఆవిడ. ఆవిడ ఏమన్నారు.. మీ పిల్లల్ని చదువుకోమని కదా చెప్పారు. మీ పిల్లల్ని చదివిస్తే వాళ్లు మీకు లాగా కష్టపడే అవసరం ఉండదు. మీ పిల్లల కోసమే కదా ఆవిడ అలా అన్నారు అంటాడు రిషి. మా పిల్లలు బాగోగులు మాకు తెలుసు అంటాడు తాగుబోతు అతను. తాగి సరిగ్గా నుంచోలేకపోతున్నావు నువ్వు పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నావా.. మీ పిల్లలు చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుపడుతుంది.
చదువుకున్న వాళ్ళకి ఇచ్చే గౌరవం వేరేగా ఉంటుంది అని నచ్చచెప్తాడు రిషి. అప్పుడు పక్కనున్న వ్యక్తి వచ్చి తప్పుగా అనుకోకండి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయారు అందుకే మిమ్మల్ని నమ్మలేకపోతున్నాను వాడి మాటలు వదిలేయండి మా పిల్లల్ని బాగా చదివిస్తాము అంటాడు. రిషి తన విసిటింగ్ కార్డ్ ఇచ్చి మీ పిల్లల్ని చదివించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి అని చెప్పి వసుధార వాళ్లని తీసుకొని వెళ్ళిపోతాడు.
కార్ లో ఉన్న వసుధార తనతో పాటు వచ్చినందుకు ఏంజెల్ ని రిషి మందలిస్తున్నట్లుగా బ్రమ పడుతుంది. బస్తీలో జరిగిన విషయం విశ్వనాథం గారికి చెప్పొద్దు అని ఏంజెల్ కి చెప్తాడు రిషి. ఆ తర్వాత కాలేజీ లో లెక్చరర్స్ ముందు వసుధార చేసింది తప్పు అని వసుధార ని మందలిస్తాడు రిషి. నేనేమీ తప్పు చేయలేదు అక్కడ కాలేజీ పేరు బయటికి రానివ్వలేదు అని ప్రిన్సిపాల్ కి సంజాయిషీ ఇచ్చుకుంటుంది వసుధార. మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు పాండియన్ వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లినప్పుడు వాళ్ళ పేర్లు కన్నా ముందు కాలేజీ పేరు వచ్చింది.
అయినా మిషన్ ఎడ్యుకేషన్ గురించి ముందు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి అప్పుడు చదువు గురించి ఒప్పించాలి అంతేగాని వాళ్లకి ఏమీ తెలియకుండా వాళ్లతో మాట్లాడితే ఇలాగే ఉంటుంది అంటూ ఆవేశంతో రెచ్చిపోతాడు రిషి. అక్కడ నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు కావాలంటే ఏంజెల్ అక్కడే ఉంది అడగండి అంతేగాని పర్సనల్ విషయాలని దృష్టిలో పెట్టుకొని నన్ను తప్పుగా మాట్లాడకండి అంటూ వసుధార కూడా చాలా కోపంగా మాట్లాడుతుంది.
షట్ అప్ వసుధార అంటూ ఆవేశంతో రెచ్చిపోతాడు రిషి. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీరిద్దరూ అసలు సరిగ్గా మాట్లాడే కోరు అలాంటిది ఆవిడ మీద అలా ఫైర్ అయిపోయారు ఏంటి అంటాడు ఒక లెక్చరర్. వాళ్ళిద్దరికీ ఏదో గతం ఉంది అని లెక్చరర్ చెవిలో చెప్తాడు అటెండర్. కోపంతో రిషి, వసుధార ఇద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తుఫాను వెలిసినట్లుగా అయింది ఇద్దరు మాట్లాడేది కాలేజీ మంచి గురించే ఇద్దరినీ తప్పు పట్టలేము అంటాడు ప్రిన్సిపల్.
ఆ తరువాత ఇంట్లో కూర్చున్న రిషి వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఏంజెల్ వచ్చి కాలేజీలో ఏదో గొడవ చేసావంట కదా ఎందుకు అలా చేసావు. నేను జరిగిందంతా విశ్వనాథం కి చెప్పేసాను. ఆయన కూడా వసుధర చేసింది మంచి పని అన్నారు అంటుంది ఏంజెల్. తను చేసింది మంచి పని అని నాకు తెలుసు కానీ ఒంటరిగా హ్యాండిల్ చేయడం ఎందుకు అంటాడు రిషి. అది సరే కానీ వసుధార ఇంకా రాలేదు ఆ బస్తీ వాళ్లు మంచి చెడు తెలియని వాళ్ళు.
వసుధారని ఏమైనా చేసి ఉంటారంటావా.. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అని కంగారు పడుతుంది ఏంజెల్. అలాంటిదేమీ జరగదులే అని బయటికి అంటాడు కానీ మనసులో కంగారు పడతాడు రిషి. అయితే వసుధార తన ఇంటికి వెళ్ళిపోతుంది. రిషి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు వసుధార ఎందుకు ఫోన్ చేశారు అంటూ మెసేజ్ పెడుతుంది. ఎక్కడ ఉన్నారు అని మెసేజ్ పెడతాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.