- Home
- Entertainment
- Guppedantha Manasu: విశ్వనాథం ఇంట్లోంచి వెళ్లిపోయిన రిషి.. భర్తను ఇంటికి రప్పించే ప్రయత్నంలో దేవయాని?
Guppedantha Manasu: విశ్వనాథం ఇంట్లోంచి వెళ్లిపోయిన రిషి.. భర్తను ఇంటికి రప్పించే ప్రయత్నంలో దేవయాని?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తనని మోసం చేసిన ప్రియురాలు కళ్ళ ముందు ఉంటే భరించలేకపోతున్న ఒక ప్రియుని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో తన రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఎందుకు పదేపదే వసుధార గుర్తొస్తుంది. నన్ను ఇంకా గతం వెంటాడుతుందా.. అయినా ఇక్కడ నేను ఉన్నానని తెలిసి కూడా తను ఎందుకు ఇక్కడికి వచ్చింది. మళ్లీ రిషిధార బంధం కలుస్తుందని ఆశిస్తుందా అలా ఎప్పటికీ జరగదు. అయినా నాకే ఎందుకు ఈ కలవరపాటు తన చేతలు తన మాటలు అన్ని నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి.
అవన్నీ నేను ఇక్కడ ఉండటం వల్లే కదా అనుకుని ఆవేశంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు రిషి. కొంత దూరం వెళ్ళిన తర్వాత నేనెందుకు వెళ్లాలి తప్పు చేసింది నేను కాదు కదా.. ఎవరు ఎక్కడ ఉంటే నాకేంటి నేను ఒక సాదాసీదా లెక్చరర్ని మాత్రమే నాకు ఎలాంటి గతం లేదు. నేను తనని క్షమిస్తాననుకుంటుందేమో అది ఎప్పటికీ జరగదు మా డాడ్ వచ్చిన సరే క్షమించేది లేదు.
అయినా ఎవరి కోసమో నేను ఎందుకు విశ్వనాథం గారు వాళ్ళని బాధ పెట్టాలి అనుకొని తిరిగి ఇంటికి బయలుదేరుతాడు రిషి. మరోవైపు నేను ఎక్కడ ఉన్నందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు అని అర్థమైంది అని మనసులో అనుకుంటూ రిషి ని చూడటం కోసం అతని గదికి వెళుతుంది వసుధార. అతను అక్కడ లేకపోవడంతో రిషి కి కాల్ చేస్తుంది. కావాలని ఫోన్ కట్ చేస్తాడు రిషి.
ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే మళ్ళీ చేసిన కూడా ఇంక నా ఫోన్ లిఫ్ట్ చేయరు అనుకుంటుంది వసుధార. అదే సమయంలో కిందన ఏంజెల్ వాళ్ళు రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా రాలేదు ఏంటి విశ్వం అని ఏంజెల్ అంటుంది. ఒకసారి రిషికి కాల్ చేయు అని విశ్వం చెప్పటంతో రిషికి కాల్ చేస్తుంది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి. ఎక్కడికి వెళ్ళిపోయావు ఎందుకు ఈ టైం వరకు రాలేదు.
ఏమైనా డిస్టబెన్స్ ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది ఏంజెల్. అలాంటిదేమీ లేదు వచ్చేస్తున్నాను నిద్ర పట్టక ఇలా వచ్చాను అంటాడు రిషి. సరే త్వరగా రా నేను విశ్వం నీకోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్తుంది ఏంజెల్. మీరు ఎందుకు వెయిట్ చేయడం నేను వచ్చేస్తాను మీరు పడుకోండి అని చెప్పడంతో ఫోన్ పెట్టేస్తుంది ఏంజెల్. ఈ మాటలు విన్న వసుధార నా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ నా ప్రశ్నకు సమాధానం దొరికింది అదే చాలు అనుకుంటుంది.
ఏంజెల్ పడుకోవటానికి వెళ్ళిపోతుంది. విశ్వనాథం ఒక్కడే హాల్లో కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార మీరు వెళ్లి పడుకోండి ఇప్పటికే ఆలస్యమైంది నాకు ఎలాగో నిద్ర పట్టడం లేదు నేను సార్ కోసం వెయిట్ చేస్తాను అనడంతో విశ్వం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలోనే అక్కడికి రిషి రావటంతో నేను ఇక్కడ ఉండడం మీకు ఇబ్బందిగా ఉంది కదా అని అడుగుతుంది వసుధార.
నాకెందుకు ఇబ్బంది అంటూ వసుధార బాధపడేలాగా మాట్లాడి అక్కడినుంచి వెళ్ళిపోతాడు రిషి. మీరు నా మీద కోప్పడినా నిజం తెలుసుకున్న రోజు మీరే మమ్మల్ని అర్థం చేసుకుంటారు ఆరోజు తప్పకుండా మళ్లీ మనం రిషిధార అవుతాము అని మనసులో అనుకుంటుంది వసుధార. మరోవైపు కొడుకు దగ్గరికి వచ్చిన దేవయాని మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు అంటే వాళ్లతో పట్టే వర్క్లో హెల్ప్ చేయడానికి ఉండిపోయి ఉంటారు.
అలా అయితే మనం అనుకున్న పని సాధించలేము ఎలా అయినా మీ నాన్న దగ్గర సింపతి సంపాదించి మీ నాన్నతో పాటు మహేంద్ర వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురా అని చెప్పి కొడుకుని పంపిస్తుంది. సీన్ కట్ చేస్తే బ్యాగ్ తో రెడీ అయిన వసుధారని చూసి ఎక్కడికి ప్రయాణం అని అడుగుతుంది ఏంజెల్. ఇప్పుడు కొంచెం బానే ఉంది.. ఈరోజు నుంచి కాలేజీకి వెళ్తాను అట్నుంచి అటే మా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది వసుధార. బాగుంది అని నువ్వు అనుకుంటే సరిపోదు అంటుంది ఏంజెల్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.