ఓటమిని ఒప్పుకోని వసు.. అందరి ముందు ఆ మాటతో షాక్ ఇచ్చిన రిషి?
బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కథ నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళుతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

కాలేజీలో ఎగ్జామ్స్ కి ముందు పిల్లల్లో భయాందోళనలు తొలగించడానికి రిషి (Rishi) ఆటల పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి రౌండ్లో పుష్ప, జగతి (Jagathi) ఆడగా అందులో రిషి జగతికి ఎంకరేజ్ చేయడంతో సంతోషంగా ఫీల్ అవుతూ గెలుస్తుంది.
అలా మొత్తానికి కొన్ని రౌండ్ లు పూర్తయ్యాక రిషి, వసు (Vasu) మధ్య చివరి రౌండ్ పోటీ జరుగుతుంది. వసు కూడా రిషితో (rishi) పోటీకి సిద్దమే అని అంటుంది. దాంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు. జగతి, మహేంద్ర వర్మ కూడా తన ధైర్యం చూసి షాక్ అవుతారు.
ఇక మహేంద్ర వర్మ (Mahendra) కూడా రిషి గొప్పదనాన్ని, బలాన్ని గురించి వివరిస్తాడు. మొత్తానికి రిషి, వసు పోటి సీటులో కూర్చోగా రిషి (Rishi) వసు తో మాట్లాడుతాడు. పోటీకి ఎలా దిగావు అన్నట్లు అంత ధైర్యం ఎక్కడిది అన్నట్లు ప్రశ్నిస్తాడు.
వసు (Vasu) కూడా తను ఓడిపోతానని తెలిసిన కూడా ఆటలో గెలుపు కోసం ప్రయత్నం చేయడానికి ముందుకు వచ్చాను అన్నట్లు తెలుపుతుంది. వసు మాటలకు రిషి (Rishi) కాస్త ఓవర్గా రియాక్ట్ అవుతున్నట్లు ఉంటాడు. తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి తన చెయ్యి పట్టుకుంటాడు.
రిషి (Rishi) చేయి తగలగానే వసు ఏదోలా ఫీల్ అవుతుంది. మహేంద్రవర్మ వీరి మధ్య పోటీ కోసం ఏం జరుగుతుందో అన్నట్లు ఎదురు చూస్తుంటాడు. ఇక రిషి వసు చెయ్యి పట్టుకొని ఆడుతుండగా వెంటనే వసు రింగ్ చూసి శిరీష్ (Sireesh), వసు ల ఎంగేజ్మెంట్ సీన్ గుర్తుచేసుకొని కోపంతో ఆట మధ్యలో లేస్తాడు.
అందరూ చూసి షాక్ అవ్వగా వసు ఏమైంది సార్ అని ప్రశ్నిస్తుంది. రిషి (Rishi) కోపంతో రగిలిపోతూ ఎలాగైనా నువ్వు నాతో ఓడిపోతావు అంటూ తనపై మండిపడుతాడు. కావాలంటే తన స్థానంలోకి మరో అమ్మాయిని తీసుకోమని చెప్పి తనతో పోటీపడమంటాడు.
మొత్తానికి వసు (Vasu) రిషి స్థానంలో మరో అమ్మాయిని తీసుకొని పోటీ పడుతుంది. మొత్తానికి గెలిచే సమయంలో మహేంద్రవర్మ అరవడంతో రిషిని చూసి ఓడిపోతుంది వసు. వెంటనే తన ఓటమిని ఒప్పుకోకపోయేసరికి రిషి (Rishi) తనపై అందరి ముందు గట్టిగా అరుస్తాడు.
ఇక రిషి మాటలకు అందరూ షాక్ అవ్వగా వసు చాలా బాధపడుతుంది. మహేంద్ర, జగతి (Jagathi) కూడా బాధపడతారు. ఇంట్లో వసు జగతి తన బాధ చెప్పుకొని బాధపడుతుంది. మరోవైపు మహేంద్ర తో రిషి వసు పొగరు గురించి మాట్లాడతాడు. తరువాయి భాగం లో వసు మిషన్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా రాజీనామా చెయ్యాలని అనుకొని షాక్ ఇవ్వాలని చూడగా తిరిగి సస్పెండ్ తో వసుకే (Vasu) షాక్ ఇచ్చాడు రిషి.