- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషిని కలవద్దంటూ మహేంద్రకు షాకిచ్చిన చక్రపాణి.. ప్రాణాపాయ స్థితిలో వసుధార?
Guppedantha Manasu: రిషిని కలవద్దంటూ మహేంద్రకు షాకిచ్చిన చక్రపాణి.. ప్రాణాపాయ స్థితిలో వసుధార?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి కనిపించకుండా పోయిన కొడుకు క్షేమంగా ఉన్నాడని తెలుసుకొని ఆనందపడుతున్న ఒక తండ్రి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో చక్రపాణిని పిలుస్తాడు మహేంద్ర. ఎవరో అనుకొని చూసిన చక్రపాణి మహేంద్ర ని చూసి షాక్ అవుతాడు. ఆనందంతో బాగున్నారా అంటూ పలకరిస్తాడు. మీ కూతురు తన గురువు చేసిన పనికి కన్న కొడుకుని పోగొట్టుకొని ఇలా ఉన్నాను అంటాడు మహేంద్ర. వసుధార కాలేజీకి వెళ్ళాను తను ఊరు వెళ్లిందని చెప్పింది మరి మీరు ఇక్కడ ఉన్నారేంటి.
రిషి ఎక్కడ ఉన్నాడో తనకి తెలిసే ఉంటుంది అడుగుదామని వచ్చాను అంటాడు మహేంద్ర. మీకు అన్ని విషయాలు చెప్తాను దయచేసి మా ఇంటికి రండి అని పిలుస్తాడు చక్రపాణి. లేదండి నా కారు పాడైంది మెకానిక్ కి ఫోన్ చేశాను అని చెప్తాడు మహేంద్ర. ఇంతలో మెకానిక్ వచ్చి కారుని చెక్ చేసి బాగు చేయటానికి టైం పడుతుంది అని చెప్తాడు. ఎలాగో టైం పడుతుంది కదా మా ఇల్లు పక్కనే రండి వెళ్దాము.
మీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి అని చక్రపాణి రిక్వెస్ట్ చేయడంతో అతనితో పాటు బయలుదేరుతాడు మహేంద్ర. మరోవైపు క్లాస్ చెప్తూ ఉంటాడు రిషి. విండోలోంచి తననే చూస్తూ ఉన్న వసుధార కనిపిస్తుంది అతనికి. క్లాస్ చెప్పటానికి డిస్టర్బ్ అవుతాడు. విండో డోర్ క్లోజ్ చేసేద్దామని వెళ్తాడు కానీ అర్థం చేసుకున్న వసుధార అక్కడినుంచి వెళ్ళిపోతుంది. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని తెలుసు కానీ మీరు క్లాస్ చెప్తూ ఉండగా చూడాలన్న నా ఆశ తీరింది.
కాని అది మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసింది అని మనసులోని గిల్టీగా ఫీల్ అవుతుంది వసుధార. మరోవైపు చక్రపాణి ఇంటికి వచ్చిన మహేంద్ర రిషి ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు వసుధారని అడిగితే తనకి తెలియదని చెప్తుంది. నా కొడుకు కోసం నేను పిచ్చివాడిలాగా రోడ్ల మీద పడి తిరుగుతున్నాను మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అని బ్రతిమాలుతాడు. అన్ని చెప్తాను కానీ కాస్త ముందు కాఫీ తాగండి అని మహేంద్ర చెప్తున్నా వినకుండా కాపీ తీసుకురావడానికి వెళ్తాడు చక్రపాణి.
అప్పుడే సుమిత్ర ఫోటోకి దండ వేసి ఉండడం చూసి షాక్ అవుతాడు మహేంద్ర. కాఫీ తీసుకువచ్చిన చక్రపాణితో ఏం జరిగింది ఎప్పుడు జరిగింది అని అడిగితే. తను చనిపోయింది, మీరు మీ కొడుకుని పోగొట్టుకున్న రోజే తను కూడా చనిపోయింది. వసు జరిగిందంతా చెప్పింది అది విని తట్టుకోలేక సుమిత్ర గుండె ఆగిపోయింది అని బాధపడతాడు చక్రపాణి. ఇంతమంది బాధపడుతున్న కూడా వాళ్ళు ఎందుకు నిజం చెప్పడం లేదు అర్థం కావటం లేదు అంటాడు మహేంద్ర.
వాళ్లు అలా చేస్తున్నారంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటాడు చక్రపాణి. ఏం అర్థం చేసుకోవడం అండి నా కొడుకు బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు చివరికి తనని చూడకుండానే చనిపోతానేమో అని భయంగా ఉంది అంటాడు మహేంద్ర. ఆ మాటలకి బాధపడ్డ ఛత్రపతి మీ అబ్బాయి క్షేమంగానే ఉన్నాడు అని చెప్తాడు. అంటే తను ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా అని ఆనందంగా అడుగుతాడు మహేంద్ర.
వసు పనిచేస్తున్న కాలేజీలోనే లెక్చరర్ గా పనిచేస్తున్నాడు అంటాడు చక్రపాణి. మరి వసు నాకెందుకు చెప్పలేదు అంటాడు మహేంద్ర. నేనే చెప్పొద్దన్నాను మీ అందరికీ తెలిస్తే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆయనలో కోపం ఏమాత్రం తగ్గలేదు. నన్ను కూడా మరి ఎప్పుడు కలవద్దు అంటూ గట్టిగా చెప్పారు అంటాడు చక్రపాణి. నిజం చెప్పినందుకు మీకు రుణపడి ఉంటాను ఇప్పుడే రిషి ని చూస్తాను అంటూ బయలుదేరబోతాడు మహేంద్ర.
వద్దు.. తనకి మిమ్మల్ని కలవడం ఇష్టం ఉందో లేదో తీరా మీరు వెళ్లిన తర్వాత నీతో మాట్లాడకపోయినా ఆవేశంలో ఒక మాట అన్నా మళ్లీ మీరు ఇబ్బంది పడతారు ఇప్పుడు మీరు కలవక పోవడమే మంచిది అంటాడు చక్రపాణి. మీరు చెప్పింది నిజమే దూరం నుంచి నా కొడుకుని చూస్తాను అంటూ ఆనందంగా అక్కడి నుంచి బయలుదేరుతాడు మహేంద్ర. సీన్ కట్ చేస్తే కాలేజీ అయిపోయాక తననే ఫాలో అవుతున్న వసుని చూసి డిస్టబెన్స్ ఫీల్ అవుతాడు రిషి.
తను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను బయలుదేరుతాను అనుకొని కారు దగ్గర వెయిట్ చేస్తాడు. ఇంతలో కాలేజీ పిల్లలు లెక్చరర్స్ కంగారుగా పరిగట్టడంతో ఏం జరిగింది అని అడుగుతాడు రిషి. వసుధార మేడంకి యాక్సిడెంట్ అయిందట అనటంతో తను కూడా కంగారుగా పరిగెడతాడు. అంబులెన్స్ వచ్చేసరికి లేట్ అవుతుంది నా కారులో తీసుకువెళ్దాం అని తన కారులో వసుని హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు రిషి.
ఆ తర్వాత కాలేజీకి మహేంద్ర వస్తాడు. పాండ్యన్ ని పిలిచి రిషి సార్ ఎక్కడా అని అడుగుతాడు. ఇప్పుడే వెళ్లిపోయారు అని చెప్తాడు పాండ్యన్. అతని దగ్గర రిషి నెంబర్ తీసుకుని ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అంటూ చాలా యాంగ్జైటీ గా ఫీల్ అవుతాడు మహేంద్ర. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.