- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషి గురించి బాధపడుతున్న జగతి, మహీంద్రలు! జగతి మనసు బాధపెట్టిన రిషి!
Guppedantha Manasu: రిషి గురించి బాధపడుతున్న జగతి, మహీంద్రలు! జగతి మనసు బాధపెట్టిన రిషి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 11వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..జగతి వసుధారతో, నా జీవితంలో ఉన్న తోలుబొమ్మలాటలోనే నేను ఓడిపోయాను, నేను అక్కడికి వెళ్లి ఏం జడ్జ్ గా ఉంటాను అని అడగగా, వసు, మీరు ముందు జ్యూస్ తాగండి మేడం అని జూస్ ఇస్తుంది. ఇంతలో పక్కనే ఉన్న రిషి ని వసు గమనిస్తుంది. మహేంద్ర కూడా రిషిని గమనిస్తాడు. అప్పుడు వసు, నేను ఇప్పుడే వస్తాను మేడం అని చెప్పి బయటకు వస్తుంది. అప్పుడు రిషి వసుతో,మేడం ఎలా ఉన్నారు వసు అని అడగగా, అలాగే ఉన్నారు సార్ అని వసు అంటుంది.జాగ్రత్తగా చూసుకో వసుధార అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.వసు లోపలికి వచ్చిన తర్వాత మహీంద్ర చిన్న పని ఉన్నది ఇప్పుడే వస్తాను అని చెప్పి రిషి దగ్గరికి వెళ్లి, మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా కూడా మాట్లాడొచ్చు. గోడ చాటున చూడడం అవసరం లేదు అని అనగా,మేడమ్ కి ఎలాగున్నది డాడ్ అని రిషి అడుగుతాడు. డాక్టర్లు ఇది మందుల వల్ల తగ్గే జబ్బు కాదని,మనసు వల్ల తగ్గేదే అని చెప్తున్నారు. దీనికి మందు ఎక్కడ ఉండదు అని కూడా చెప్తున్నారు అని అంటాడు. దానికి రిషి,మందు ఉండకపోవడమేంటి డాడ్ కావాలంటే పక్క దేశం వెళ్లిన మనం మెడిసిన్ తెప్పిద్దాం చెప్పండి అని అనగా, అది నువ్వు పిలిచే ఒక పిలుపులో ఉంటాది రిషి.
జగతి బాధపడేది కేవలం దాని కోసమే. తన ఆనందానికి కూడా నువ్వే కారణం అవుతావు అని చెప్తాడు. అప్పుడు రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో ధరణి వంట గదిలో ఉండగా వసు వచ్చి,మేడమ్ మీ కాళ్ళు నొప్పి ఎలా ఉన్నది అని అడగగా, తగ్గింది వసుధార.నువ్వు అందరికోసం ఆలోచిస్తావు కదా అని అడుగుతుంది.దానికి వసు అందరికోసం ఆలోచించడంలో ఆనందం ఉంటుంది మేడం అని అంటుంది. ఇంతలో దేవయాని అక్కడికి వస్తుంది. వచ్చి ధరణి, జగతికి ఎలా ఉన్నాదో చూసి రా అని అనగా నేను ఇందాకే చూసి వచ్చాను అత్తయ్య గారు బానే ఉన్నది అని ధరణి అంటుంది. ఇందాక కాదు ఇప్పుడు చెప్తున్నాను కదా వెళ్లి ఎలాగున్నది, పరిస్థితి ఏంటి అంతా చూసి నాకు వచ్చి చెప్పు అని అనగా ధరణి మనసులో, అంత కావాలంటే మీరే వెళ్లి చూసుకోవచ్చు కదా అని తిట్టుకుంటుంది. అప్పుడు వసుధార కూడా ధరణి వెనకాతలు వెళ్తున్నప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావ్ వసుధార,రా నీతో మాట్లాడాలి అని చెప్తుంది దేవయాని. ఏం మాట్లాడాలి మేడం అని వసు అనగా, మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావు అని దేవయాని అడుగుతుంది. నేను రాను అని మీకు ఎప్పుడు చెప్పాను మేడం అని వసుధార అంటుంది. దానికి దేవయాని, అంత జరిగినా కూడా మీకు ఇంకా ఎందుకు ఇక్కడికి రావాలనిపిస్తుంది అని అడుగుతుంది.
దానికి వసు, ఏం జరిగింది మేడం? ఓహో మీరు ఇంకా ఆ గురుదక్షిణ ఒప్పందం దగ్గరే ఉండిపోయారా అది మమ్మల్ని వేరు చేస్తాది అని మీరు అనుకుంటున్నారా అది జరగదు మేడం అయినా దాని వల్లే మా ఇద్దరి మధ్య ఒక మంచి ఒప్పందం వచ్చింది అని చెప్తుంది వసుధార. దానికి దేవయాని, ఏ ఒప్పందం కుదిరింది అని అడగగా, ఒప్పందం కుదిరింది అన్నాను గాని ఏంటో చెప్తాను అనలేదు కదా మేడం అని వసు అంటుంది. అప్పుడు దేవయాని వసుని కోప్పడదాం అనేసరికి రిషి అక్కడికి వస్తాడు. నీ పని తర్వాత చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవయాని.పెద్దమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అని అనగా, ఏమి లేదు రిషి తర్వాత నేను వస్తాను అని వెళ్తూ వెళ్తూ, నీకు బాగా పొగరు ఎక్కువైంది వసుధార అని మనసులో వసు ని తిట్టి వెళ్ళిపోతుంది దేవయాని. అప్పుడు వసు, సర్ కాఫీ కావాలా అని రిషి ని అడగగా, నాకు చిన్న పని ఉన్నది వసుధార గౌతమ్ ని దింపేయమను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో జగతి మహేంద్ర లు గదిలో కూర్చొని ఉండగా, జగతి మహేంద్రతో, నాకోసమే రిషి, వసుని ఇంటికి తీసుకువచ్చాడు.
నాకు చాలా ఆనందంగా ఉన్నది అయినా రిషికి కోపం తగ్గిందా? వసూ తో బానే మాట్లాడుతున్నాడా? అని అడగగా మహేంద్ర, నువ్వు ఎక్కువ ఆశపడుతున్నావు అని జగతితో అంటాడు. దానికి జగతి, మనిషి ఆశాజీవి మహేంద్ర నేను అప్పుడప్పుడు రిషి వసుదారలు నాతో ఆనందంగా మాట్లాడుతున్నట్టు, మనందరం కలిసి ఉన్నట్టు అనిపిస్తుంది. బయట ఇది ఎలాగో నిజం అవ్వదు కనీసం నా ఊహల్లోనైనా ఈ అబద్ధాన్ని నిజం చేసుకొని ఆనందంగా ఉండనీ మహేంద్ర అని జగతి అంటుంది.దానికి మహేంద్ర, ఆనందమని నువ్వు అంటున్నావు విషాదం అని నేను అంటున్నాను అని అనగా, విషాదాన్ని కూడా ఆనందంగా తీసుకోవడమే కదా అసలైన విషాదం అని జగతి అంటుంది.ఆ తర్వాత సీన్లో గౌతమ్, వసుని ఇంటికి దింపడానికి బయలుదేరుతూ ఉండగా దారిలో వసు మౌనంగా ఉంటుంది. ఏమైంది? దేని గురించి ఆలోచిస్తున్నావు అని గౌతమ్ అడగగా,ఏం లేదు సార్ రిషి సార్ గురించి ఆలోచిస్తున్నాను. నన్ను పికప్ చేసుకున్నారు కానీ మీ చేత డ్రాప్ చేపిస్తున్నారు అని అనగా, నువ్వు రిషి గురించి ఎక్కువ ఆలోచించడం మానే వసుధార.వాడు బానే ఉంటాడు వాడి గురించి ఆలోచిస్తూ మన బుర్రలు పాడైపోతూ ఉంటాయి. ఇప్పుడు కూడా వాడు ఎక్కడో ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు అని అంటాడు. మరోవైపు రిషి తన కారులో కూర్చొని, నేను నిన్ను దింపలేదు అని బాధపడొద్దు వసుధార.
నాకు నిన్ను ఇంటికి తీసుకురావడం ఎంత ఆనందంగా ఉంటాదో, తిరిగి ఇంటి నుంచి పంపేయడం అంతే విషాదంగా ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతుంటే ఏదో తెలియని వేలతి, నా మనసు ఇంతే, నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అనుకుంటాడు. ఆరోజు రాత్రి వసూ తోలుబొమ్మలు తయారు చేస్తూ,మిమ్మల్ని రిషి సార్ దగ్గరకు తీసుకొని వెళ్తాను అక్కడ జాగ్రత్తగా ఉండండి అని అంటుంది.మరోవైపు రిషి, నన్ను ఎందుకు డ్రాప్ చేయలేదు సార్ అని అడుగుతావు అనుకున్నాను ఏం ఫోన్ చేయలేదు ఏంటి వసుధారా అని అనుకుని, నేనే మెసేజ్ చేద్దాము అని చెప్పి ఏం చేస్తున్నావ్ వసుధార నన్ను ఏమైనా అడగాలా అని అంటాడు.దానికి వసు, ఆ మెసేజ్ చదివి రిషి సార్ మెసేజ్ చేశారు అనుకోని, రేపు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను సర్ జగతి మేడం చూడడానికి మీరు ఒప్పుకుంటే వస్తాను అని అంటుంది.ఇదేనా నువ్వు అడగాలనుకుంటున్నది అని రిషి మనసులో అనుకొని, నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా నిన్ను ఎవరు అడ్డుకోరు. రేపు నిన్ను వచ్చి పికప్ చేసుకుంటాను అని అనగా వసు, వద్దు సార్ మీరు పికప్ చేయొద్దు డ్రాప్ కూడా చేయొద్దు నేనే వస్తాను అని అనగా, అడిగావా అనుకున్నాను ఇంకా ఈ మాట రాలేదేంటి అని రిషి మనసులో అనుకుంటాడు.
అప్పుడు రిషి వసుకి వీడియో కాల్ చేయగా వసు, రిషి సార్ వీడియో కాల్ చేస్తున్నారు అని మొదట ఆనందపడినా, ఈరోజు ఎందుకో రిషి సార్ తో మాట్లాడడానికి భయంగా ఉంది అని ఊరుకుంటుంది. అప్పుడు రిషి, నువ్వు ఎత్తకపోతే ఇంటికి వస్తాను అని అనగా, ఒద్దు సార్ రేపు నేను మీ ఇంటికి వస్తాను అని రిషికి మెసేజ్ పెడుతుంది.సరే అని రిషి అంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం జగతి పడుకొని ఉండగా రిషి కాఫీ తెస్తాడు. కాఫీ వాసన పిలిచిన జగతి, మహీంద్రా కాఫీ వాసనలు వస్తున్నాయి తెచ్చేవా అని కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ రిషి ఉంటాడు. నువ్వెందుకు రిషి, ఇక్కడికి వచ్చావు అని అడగగా,ఎలా ఉన్నది మేడం బానే ఉందా? డాడ్ చెప్పారు మీకు ఈ జబ్బు మందులతో పోదు అని.
మీరు బాధపడుతూ పక్క వాళ్ళని కూడా బాధపడుతున్నారు. మీ వల్ల మా డాడ్ ఆనందాన్ని కోల్పోతున్నారు. ఎందుకు మేడం ఇలా అందరినీ బాధ పెట్టుకుని ఉంటున్నారు. దీనివల్ల మా డాడ్ చాలా ప్రభావితం అవుతున్నారు, బాధపడుతున్నారు. ఒక పిలుపు కోసం బంధాన్ని బలి పెట్టాలని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. ఒక పిలుపు మీకు బంధం అవ్వచ్చు కానీ అదే బంధం నా చిన్ననాటి జీవితాన్ని విషాదం చేసింది. నా బాల్యాన్ని నాకు దూరం చేసింది ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు అనుకున్నట్టు పిలిస్తే నా బాల్యాన్ని తిరిగి నాకు తెచ్చి ఇవ్వగలరా? లేదు కదా మరి ఇది కూడా అంతే నేను ఈ మాటను మీకు చెప్పడానికే వచ్చాను.
మీరు ఆశపడడంలో తప్పులేదు కానీ ఆకాశం నేలకు దిగాలి అన్న కోరిక అత్యాశ అవుతుంది. కొన్ని తీరని కోరికలు మేడం ఆశపడు కూడదు. నేను మాట్లాడే మాటలు కఠినంగా ఉండొచ్చు కానీ అందులో ఏ ఒక్కటి అబద్ధం కాదు. మీ మనసును నొప్పిస్తే క్షమించండి, తల్లి ఆదరణ లేకుండా పెరిగిన వాడిని కదా, మీరు లేనప్పుడు డాడ్ ఒక్కలే ఉన్నారు, మీరు వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నారు. దయచేసి డాడీ ఆనందాన్ని మీరు దూరం చేయొద్దు అని అక్కడినుంచి వెళ్దామని చూడగా, మహేంద్ర అప్పటికే ఆ మాటలని వింటూ ఉంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!