- Home
- Entertainment
- Guppedantha Manasu: నేను రిజెక్ట్ అవ్వడానికే పుట్టినట్టు ఉన్నాను.. జగతికి దండం పెట్టిన రిషీ!
Guppedantha Manasu: నేను రిజెక్ట్ అవ్వడానికే పుట్టినట్టు ఉన్నాను.. జగతికి దండం పెట్టిన రిషీ!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత (Guppedantha Manasu) మనసు సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంతుంది. ఇక ఈ రోజు జూన్ 2 ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి (rishi)క్లాస్ చెబుతూ ఉండగా అక్కడికి వసు వెళ్ళి లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడుగుతుంది. అప్పుడు రిషి, వసు పై కోపం స్టూడెంట్స్ కి ఒక లెక్క ఇచ్చి దానిని సాల్వ్ చేయమని చెబుతాడు. ఆ తరువాత అక్కడి నుంచి వసు మౌనంగా వెళ్ళి పోవడంతో అప్పుడు రిషి బాధపడుతూ వెళ్ళి వసు (vasu)కూర్చునే ప్లేస్ లో కూర్చుని ఉండగా వసు వచ్చి మాట్లాడినట్టు ఊహించుకుంటాడు.
మరొకవైపు జగతి జరిగిన విషయం గురించి మహేంద్ర కు వివరించడంతో మహేంద్ర (Mahendra )షాక్ అవుతాడు. అప్పుడు వారిద్దరు కలిసి రిషి,వసు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మహేంద్ర ఇన్ని రోజులు వసు,రిషి కి దగ్గరగా ఉండడానికి కారణం గురుదక్షణ అని అనగానే ఆ మాట జగతికి వినిపించడంతో ఏదో అన్నావ్ అదేంటో చెప్పు అని నిలదీస్తుంది జగతి(jagathi).
అప్పుడు మహేంద్ర(mahendra)మాట్లాడుతూ వసు ని నా వైపు నుంచి రిషిని నీకు గురుదక్షిణగా ఇవ్వమన్నాను అని చెప్పడంతో జగతి షాక్ అవుతుంది. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వారి మాటలను గౌతమ్(gautham) విని షాక్ అవుతాడు. అప్పుడు జగతి, మహేంద్ర, రిషి గురించి ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటారు. మరొకవైపు సాక్షి జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆనందంగా నవ్వుతూ ఉంటుంది.
వసు ని తలచుకుని ఆనందంగా ఉంటుంది. మరొకవైపు రిషి (rishi)క్లాస్ లో రిషి కూర్చొని వసు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు బోర్డు పై వసుదార అని రాస్తాడు. అప్పుడు వసు నాతో రిషి సార్ ఎందుకు మాట్లాడటం లేదు తెలుసుకుంటాను అని వసు (vasu)వెళుతూ ఉండగా ఇంతలో గౌతం వచ్చి నీతో కొంచం మాట్లాడాలి అని రిషి కి రిజెక్ట్ చేసిన విషయం గురించి అడుగుతాడు.
అప్పుడు వసు ని కారణం ఏంటి అని నీలదీస్తాడు. అప్పుడు గౌతమ్(gautham) ఆ బొమ్మ గీసింది, లవ్ లెటర్ రాసింది కూడా రిషి అని చెప్పడంతో వసు షాక్ అవుతుంది. కానీ వసు మాత్రం ఆ విషయాన్ని గురించి మాట్లాడకుండా ఏవేవో మాట్లాడుతూ టాపిక్ అవాయిడ్ చేస్తుంది. కానీ గౌతమ్ మాత్రం నువ్వు అబద్దం చెబుతున్నావు వసు(vasu)నువ్వు రిషి ని ప్రేమిస్తున్నాను అని గట్టిగా అనడంతో అవును సార్ నేను ప్రేమిస్తున్నాను అని అంటుంది వసు.
ఆ మాట వింటాడు రిషి(rishi). అప్పడు వసు అవును సార్ నేను నా లక్ష్యాన్ని ప్రేమిస్తున్నాను సార్ అని అనడంతో రిషి స్టన్ అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో జగతి(jagathi) రిషి తో మాట్లాడాలి అని వెళుతుంది. అప్పుడు రిషి అంతా అయిపోయాక ఏం మాట్లాడుతారు అని అంటుంది. అప్పుడు రిషి మాటలకు జగతి ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు రిషి వసుకి ఫోన్ చేయడంతో వసు హ్యాపీ గా ఫీల్ అవుతుంది.