Guppedantha Manasu: వసుధారకు ధైర్యం చెప్పిన రిషి.. ధరణిపై మండిపడిన దేవయాని..?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 3 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్లో వసుధార, పుష్ప తో ఫోన్ మాట్లాడుతూ జీవితంలో అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను అమ్మ నాన్న అందరినీ వదిలేసాను. చదువుతూ ఉద్యోగాలు చేసి కష్టపడ్డాను. చివరి ఎగ్జామ్ అయితే రాసేదాకా కష్టపడ్డాను అంటూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన రిషి ఆ మాటలు వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి ఏంటి అని అనగా రిజల్ట్ వస్తున్నాయి కదా సార్ అందుకు టెన్షన్ గా ఉంది అనడంతో రిషి నవ్వుతాడు.
డి బి ఎస్ టి కాలేజ్ యూత్ ఐకాన్ అయిన నువ్వు ఇలా భయపడుతున్నావా అని అంటాడు రిషి. ఇప్పుడు వసుధర టెన్షన్ పడుతూ ఉండగా రిషి తన చేతులు పట్టుకొని ఏం కాదు వసుధార నువ్వు సాధిస్తావు అని వసుధార వైపు ప్రేమగా అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు వసుధర సర్ మీ మాటలు వింటే నాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్ అని అంటుంది. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు ఒక చెరువు దగ్గరికి వెళ్తారు.
అప్పుడు రిషి ఏంటి వసుధర ఇంత రాత్రిపూట ఇక్కడికి తీసుకొచ్చావు అని అడగగా ఈ రాత్రివేళ నగరమంతా నిద్రపోతున్న సమయంలో ఈ నీటిలో మనం ఈ కాగితపు పడవలు వేస్తే ఎంత బాగుంటుందో కదా సార్ అని అనడంతో వెంటనే రిషి కొత్తగా ఉంది అని అంటాడు. ఆ తర్వాత వసుధార కాగితపు నీటి పడవల గురించి కొన్ని విషయాలు చెబుతూ ఉంటుంది. అలా వారిద్దరూ కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వస్తారా రిషి ఇద్దరు ఆ కాగితపు పడవల మీద వాళ్ళ మనసులో అనుకున్నది రాసి ఆ పడవలను నీటిలో వదలడానికి వెళ్తారు.
తరువాత వాటిని చూసి సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత నీటిలో నుంచి బయటకు వెళ్లిన వసుధార రిషిలో ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ప్రేమగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు దేవయాని కిందికి వచ్చి ధరణి అని పిలుస్తుంది. రిషి ఎక్కడికెళ్లాడు కనిపించడం లేదు అనడంతో బయటికి వెళ్లాడు అని అంటుంది ధరణి. దాంతో ఇద్దరూ కలిసి వెళ్లారా అని ధరణి పై మండిపడుతూ ఉంటుంది దేవయాని. అప్పుడు ధరణి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఏదో ఒకటి మాట్లాడుతారని అలా మౌనంగా ఉండకు అని అరుస్తుంది.
అందరినీ నేను మాటలతో ఇబ్బంది పెడితే నువ్వు మాత్రం నీ సైలెంట్ తో నాకు టార్చర్ చూపిస్తావు దాన్ని అని అంటుంది దేవయాని. అప్పుడు ధరణి కావాలనే దేవయాని దగ్గర ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతు ఉంటుంది. దాంతో దేవయాని ధరణి ప్రవర్తనతో విసుక్కుంటూ ఉంటుంది. ఆ తర్వాత దేవయాని ఈ వసుధార రిషిల ప్రేమ కథ రోజుకి ఎక్కువ అవుతుంది ఏదో వినకూడని వార్త వింటాను అనిపిస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
మరొకవైపు వసుధార రిషి ఇద్దరు కారులో తిరుగుతూ ప్రేమగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో రిషి ఒకచోట కారు ఆపి ఏంటి నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావు అని అనడంతో అదేం లేదు సార్ నీలాంటి జెంటిల్మెన్ ఒక్కరే ఉంటారు అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా అని అనడంతో అప్పుడు రిషి కొంపదీసి ఈ జెంటిల్మెన్ అందరికీ పంచుతావా ఏంటి అంటూ కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రేమగా మాట్లాడుతుంటారు.