Guppedantha Manasu: కోపంతో రగిలిపోతున్న దేవయాని.. ఏకంగా జగతి ఇంటికి రావడంతో!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
ఇక జగతి (Jagathi) ధరణితో మహేంద్ర హెల్తి ఫుడ్ గురించి జాగ్రత్తలు చెబుతుంది. ఇక గౌతమ్ వచ్చి ధరణి తో వదినా మీరు మాట్లాడేది డైటీషియనే కదా అంటూ కాసేపు సరదాగా మాట్లాడుతాడు. ఈ పండుగకు ఒక ఫ్రెండ్ ని పిలుస్తున్నాను.. అది నీకు ఓకేనా అని అడుగుతాడు. ఇంతకూ ఆ ఫ్రెండు ఎవరు అని ధరణి అడగటంతో వసుధార (Vasudhara) అని చెబుతాడు గౌతమ్.
వెంటనే ధరణి (Dharani) షాక్ అవుతుంది. వసుధార అంటే అత్తయ్య కి పడదు కదా అని అనటంతో.. ఎందుకు పడదు.. రిషి కి లైన్ వేస్తుందనా అని అంటాడు. వాడి కోపానికి ఏ అమ్మాయి వాడితో మాట్లాడుతుందా అని.. ఇక ఈ పండక్కి ఎలాగైనా వసు తో కలిసి తినడం పక్కా అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇక వసు, రిషి (Rishi) ఒక చోట ఆగుతారు.
రిషి వసుతో తనకు ఒక హెల్ప్ చేయమని ఏదో చెబుతాడు. దానికి వసు నేను చేయలేని సార్ అని చెబుతుంది. దాంతో రిషి (Rishi) బాధపడుతూ నాకు తెలుసు.. నాకు ఎవరు హెల్ప్ చేయరు.. నేను ఒంటరి వాడిని అంటూ గట్టిగా అంటాడు. మరోవైపు ఫణీంద్ర వర్మ ఈ సారి పండగ ఘనంగా చేయాలని అంటాడు. మహేంద్ర వర్మ మాత్రం జగతి (Jagathi) గురించి ఆలోచిస్తాడు.
ఇక వసు రిషి (Rishi) గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జగతి కాఫీ తీసుకుని వస్తుంది. అప్పుడే రిషి లోపలికి రావచ్చా మేడం అని అడుగుతాడు. దాంతో జగతి కంగారు పడుతూ రండి సార్ అని లోపలికి పిలుస్తుంది. వసును కాఫీ తెమ్మని పంపిస్తుంది. కానీ రిషి కాఫీ కోసం రాలేదని.. హెల్ప్ కోసం వచ్చానని అంటాడు. డాడ్ ఈ విషయంలో ఒక హెల్ప్ చేయాలి అనే జగతి (Jagathi) ని అడుగుతాడు.
ఏంటి సార్ అని జగతి (Jagathi) అడగటంతో.. మా డాడ్ సంతోషం కోసం మీరు మా ఇంటికి రావాలి అంటూ అడుగుతాడు. దాంతో జగతి తెగ సంతోష పడుతుంది. ఇక తరువాయి భాగంలో.. దేవయాని జగతి వాళ్లను చూసి కోపంగా రగిలిపోతుంది. ఇక మహేంద్ర దగ్గరికి వెళ్లి రిషి (Rishi) జగతి మేడం తో తనకు పెద్ద సర్ప్రైజ్ చేస్తాడు.