MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • MSG: మన శంకరవరప్రసాద్‌ గారు మూవీకి చిరు, వెంకీ, నయన్ లకు ఊహించని రెమ్యూనరేషన్‌, హీరో కంటే దర్శకుడికే ఎక్కువ

MSG: మన శంకరవరప్రసాద్‌ గారు మూవీకి చిరు, వెంకీ, నయన్ లకు ఊహించని రెమ్యూనరేషన్‌, హీరో కంటే దర్శకుడికే ఎక్కువ

మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీ కోసం చిరంజీవి, వెంకటేష్‌, నయనతార, దర్శకుడు అనిల్‌ రావిపూడి ఎంత పారితోషికం తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. హీరో కంటే దర్శకుడికే ఎక్కువ అని తెలుస్తోంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 09 2026, 10:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంక్రాంతి కానుకగా `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీ రిలీజ్‌
Image Credit : X/@GoldBoxEnt

సంక్రాంతి కానుకగా `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీ రిలీజ్‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీలో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్‌ కాబోతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. హీరో వెంకటేష్‌ కీలక పాత్రలో కాసేపు మెరవబోతున్నారు. చిరు కూతురు సుస్మిత, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫ్యామిలీని టార్గెట్‌ చేసిన అనిల్‌
Image Credit : Asianet News

ఫ్యామిలీని టార్గెట్‌ చేసిన అనిల్‌

సంక్రాంతి పండుగని టార్గెట్‌గా చేసుకుని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించారు అనిల్‌. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వైఫ్‌ విషయంలో హీరో ఇబ్బందులు పడటం, పైకి పులిలా ఉన్నా, ఇంట్లో పిల్లిలా ఉండటం ఇందులో చూడొచ్చు. ఈ విషయాల్లో అనిల్‌ తన మార్క్ ని గట్టిగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండగంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా వినోదం కావాలి. కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్లు, సెంటిమెంట్లు, భార్యాభర్తల గొడవలు, యాక్షన్‌, రొమాన్స్, మంచి పాటలు ఉంటే సినిమా కచ్చితంగా హిట్టే. దీన్నే దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ఈ మూవీని తీర్చిదిద్దినట్టు సమాచారం.

35
చిరంజీవికి అత్యధిక పారితోషికం
Image Credit : X/@GoldBoxEnt

చిరంజీవికి అత్యధిక పారితోషికం

 ఈ మూవీ కోసం ఆర్టిస్ట్ లు ఎంత పారితోషికం తీసుకున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మెయిన్‌ కాస్టింగ్‌కి సంబంధించిన సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ కోసం మెగాస్టార్‌ చిరంజీవికి భారీగా పారితోషికం ఇస్తున్నారట. ఏకంగా రూ.70కోట్లు చెల్లిస్తున్నట్టు సమాచారం. గతంతో పోల్చితే చిరు ఈ మూవీకే తన కెరీర్‌లోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారని సమాచారం.

45
వెంకీ కంటే దర్శకుడికే ఎక్కువ పారితోషికం ?
Image Credit : X/@GoldBoxEnt

వెంకీ కంటే దర్శకుడికే ఎక్కువ పారితోషికం ?

 దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఏకంగా రూ.25కోట్లు ఇస్తున్నారట. సాధారణంగా ఆయన కలెక్షన్లలో షేర్‌ అడుగుతుంటారు. మరి ఈ విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా? అనేది చూడాలి. ఇక విక్టరీ వెంకటేష్‌ కీలక పాత్రలో ఎక్స్ టెండెడ్‌ కోమియో రోల్‌ చేస్తున్నారు. ఆయన పాత్ర ఓ అరగంట సేపు ఉంటుందట. ఆ సమయంలో మూవీ వేరే లెవల్‌లో ఉంటుందట. దీంతో ఇందులో నటించినందుకుగానూ వెంకటేష్‌ కి రూ.9కోట్లు ఇస్తున్నట్టు టాక్‌. అంటే ఇందులో వెంకీ కంటే దర్శకుడు అనిల్‌కే ఎక్కువ పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.

55
నయనతార పారితోషికం వివరాలు
Image Credit : X/@GoldBoxEnt

నయనతార పారితోషికం వివరాలు

హీరోయిన్‌గా నటిస్తున్న నయనతారకి కూడా గట్టిగానే రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారు. ఆమెకి ఏకంగా రూ.5కోట్లు ఇస్తున్నట్టు సమాచారం. ఇక భీమ్స్ కి సుమారు రెండు కోట్ల వరకు పారితోషికంగా అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా పారితోషికాలే భారీగానే ఉన్నాయి. ఈ మూవీకి రెండు వందల కోట్ల బడ్జెట్‌ అయినట్టు సమాచారం. ఈ మూవీకి రూ.210కోట్ల బిజినెస్‌ అయ్యిందని సమాచారం. సెన్సార్‌ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీ ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
దగ్గుబాటి వెంకటేష్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Paradise Day 2 Collections: జోరు తగ్గినా నాని ర్యాంపేజ్‌.. రెండో రోజు ప్యారడైజ్‌ కలెక్షన్లు ఎంతంటే?
Recommended image2
Chiranjeevi: 'బాస్ తొక్కేశాడు' చిరంజీవి వరకు వెళ్లిందా..చేతికి మట్టంటకుండా సోషల్ మీడియాని కుదిపేసిన బాస్
Recommended image3
Savitri: జెమినీ గణేశన్ ఉండగానే సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్, అన్నపూర్ణమ్మ చూసి ఏమన్నారంటే?
Related Stories
Recommended image1
Raasi: అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు, రాశికి ఇచ్చిపడేసిన అనసూయ.. నా పేరు వాడితేనే వాళ్లకి పాపులారిటీ
Recommended image2
The Raja Saab Collections: `ది రాజాసాబ్‌` మొదటి రోజు బాక్సాఫీసు అంచనా.. ప్రభాస్‌ టాప్‌ 5 ఓపెనింగ్ మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved