- Home
- Entertainment
- Rashmi Gautam: ఆరెంజ్ డ్రెస్‌లో మతిపోగొడుతున్న యాంకర్ రష్మి.. ఇక అనసూయ రేసు నుంచి తప్పుకోవాల్సిందే
Rashmi Gautam: ఆరెంజ్ డ్రెస్‌లో మతిపోగొడుతున్న యాంకర్ రష్మి.. ఇక అనసూయ రేసు నుంచి తప్పుకోవాల్సిందే
యాంకర్ రష్మి గౌతమ్ తాజాగా ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఆమె తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆరెంజ్ డ్రెస్‌లో అదిరిపోయే పోజులతో కట్టిపడేస్తుంది రష్మి గౌతమ్.

యాంకర్ రష్మి గ్లామర్ ట్రీట్
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఒకప్పుడు గ్లామర్ ట్రీట్‌తో నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేసేది. కానీ ఇటీవల కాలంలో ఆ స్థాయిలో మెరవడం లేదు. అడపాదడపా మాత్రమే ఆమె ఇలా గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఈ విషయంలో చాలా తగ్గించిందని చెప్పొచ్చు. ఫోటోలు పంచుకున్నప్పుడు మాత్రం అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది. అభిమానులకు కావాల్సిన విందు ఇస్తుంది.
ఆరెంజ్ డ్రెస్‌లో హోయలు పోతున్న రష్మి గౌతమ్
తాజాగా ఆరెంజ్ డ్రెస్‌లో మెరిసింది రష్మి గౌతమ్. ఆరెంజ్ గాగ్రా చోలీ డ్రెస్‌లో ఆమె హోయలు పోయింది. తన లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ అదిరిపోయే పోస్ట్ పెట్టింది. `నేను వచ్చినందుకు మీరు సంతోషిస్తున్నారా? సిగ్గుపడుతూనే అన్ని విధాలా ప్రకాశిస్తూ` అని తన ఫోటోలను గురించి వెల్లడించింది. ఆరెంజ్ లవ్ ఎమోజీలను పంచుకుంది రష్మి.
రష్మి ఫోటోలకు నెటిజన్లు ఫిదా
రష్మి గౌతమ్ ఈ నయా లుక్‌ని చూసి అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆరెంజ్ డ్రెస్‌లో అదిరిపోయావు అక్కా అంటున్నారు. సుడిగాలి సుధీర్ అదృష్టవంతుడంటున్నారు. ఆరెంజ్ ఏంజెల్ అని, రోజు రోజుకి అందం పెరిగిపోతుందని చెబుతున్నారు. కొందరు ఇకనైనా మ్యారేజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎంత కాలం బ్యాచ్‌లర్‌గా ఉండిపోతావని కామెంట్లు పెడుతున్నారు.
రష్మి దెబ్బకి అనసూయ రేసు నుంచి ఔట్
ఇదిలా ఉంటే కొందరు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. యాంకర్ రష్మి వచ్చింది, ఇక అనసూయ పక్కకు వెళ్లిపోవాల్సిందే అని, రేస్ నుంచి తప్పుకోవాల్సిందే అంటున్నారు. అయితే యాంకర్‌గా రష్మి బిజీగానే ఉంది. అనసూయ యాంకరింగ్ వదిలేసి రెండేళ్లు దాటింది. కాకపోతే సోషల్ మీడియాలో ఇటీవల అనసూయ బిజీగా ఉంటుంది. గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు రష్మి కూడా తన పిక్స్ ని షేర్ చేయడంతో రష్మి ముందు అనసూయ నిలవలేదనే ఉద్దేశ్యంతో వారు కామెంట్లు పెడుతున్నారు.
నటిగా కెరీర్‌ని ప్రారంభించిన రష్మి గౌతమ్
యాంకర్ రష్మి ముందు నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కానీ సక్సెస్ కాలేకపోయింది. సినిమాలు, సీరియల్స్ చేసింది. ఆమెకి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత `జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్ అయ్యింది. దీంతో ఆమె స్టార్ అయిపోయింది. ఇది విశేషమైన గుర్తింపుని, క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టింది.
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలతో రష్మి బిజీ
ఇక తాజాగా యాంకర్ రష్మి గౌతమ్.. జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా చేస్తుంది. దీంతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకర్‌గా చేస్తూ రాణిస్తుంది. 13ఏళ్లుగా ఆమె యాంకర్‌గా రాణిస్తుండటం విశేషం.

