- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుతో నాకు సంబంధం ఏంటి.. మళ్ళీ జగతి, మహేంద్రను బాధ పెట్టిన రిషీ!
Guppedantha Manasu: వసుతో నాకు సంబంధం ఏంటి.. మళ్ళీ జగతి, మహేంద్రను బాధ పెట్టిన రిషీ!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకాదరణ భారీస్థాయిలో పొందింది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక వసు (Vasu) మీరు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంచి జరిగింది సార్ అని రిషి తో అంటుంది. అంతేకాకుండా అందరూ ఒకటయ్యారు అని అంటుంది. ఇక రిషి (Rishi) కానీ నువ్ ఒంటరి అయ్యావు కదా అని అంటాడు.
ఇక అదే క్రమంలో వసు మీకు నా మీద ఎందుకు ఇంత శ్రద్ద సార్ అని అడుగుతుంది. అంతేకాకుండా ఎందుకు సార్ నేను అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అని అడుగుతుంది. ఇక రిషి (Rishi) మరి నామీద నువ్వు ఎందుకు శ్రద్ద చూపుతున్నావ్ అని అడుగుతాడు. దాంతో వసు మీరు జగతి మేడం గారి అబ్బాయి సార్ అందుకే అలా అని చెబుతుంది.
ఇక వీరిద్దరి కన్వర్జేషన్ మొత్తం జగతి (Jagathi) మహేంద్ర చాటుగా వింటూ ఉంటారు. ఇక రిషి (Rishi) నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదు. నీలాంటి అమ్మాయిని ఎవరైనా ఇష్టపడతారు అని అంటాడు. అందుకే నిన్ను నా అసిస్టెంట్ గా సెలెక్ట్ చేసుకున్నాను అని చెబుతాడు.
దాంతో మహేంద్ర (Mahendra) దంపతులు అక్కడ్నుంచి నిరుత్సాహంగా వెళ్ళిపోతారు. ఇక వసు కూడ కొంత విచారం వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత గౌతమ్ (Goutham) వసును నా ఏంజెల్ అని అంటాడు. ఇక రిషి తనని ఏంజెల్ అని ఫీల్ అవ్వకు అని వార్ణింగ్ ఇస్తాడు.
మరోవైపు జగతి (Jagathi) దంపతులు వసు ఉండే రూమ్ కు వెళ్లి తనకు జాగ్రత్తలు చెప్పి అదేక్రమంలో వసు మీద రిషి కి ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెబుతారు. మరోవైపు రిషి (Rishi) వసుకు ఫోన్ చేస్తాడు. ఇక వసు (Vasu) ఫోన్ ఆన్సర్ చేయదు. ఇక రిషి ఈరోజు ఎలాగైనా ఫోన్ లో మాట్లాడాలి అని అంటాడు. అదేక్రమంలో తనతో నాకేంటి బంధం అని అంటాడు.
ఇక తరువాయి భాగంలో రిషి (Rishi) వసుకు ఫోన్ చేసి ఫోన్ ఆన్సర్ చేయనందుకు ఎంత టెన్షన్ పడ్డాడో చెబుతాడు. ఇక అంతే కాకుండా వసు రూమ్ కి వెళ్తాడు. అక్కడ వసు (Vasu) కుడి కాలు పెట్టి లోపలికి రండి సార్ అని అంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.