MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • నా కూతురు చిన్న పిల్ల... మీరు రాసే వార్తలు చదివితే తట్టుకోగలదా? స్టార్ హీరో ఎమోషనల్

నా కూతురు చిన్న పిల్ల... మీరు రాసే వార్తలు చదివితే తట్టుకోగలదా? స్టార్ హీరో ఎమోషనల్

బాలీవుడ్ స్టార్ అభిషేక్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై తాజాగా అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ముఖ్యంగా తన కూతురు విషయంలో ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 12 2025, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అభిషేక్  ఐశ్వర్య
Image Credit : Getty

అభిషేక్- ఐశ్వర్య

బాలీవుడ్ జంట ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ లు కలిసి ఉండటం లేదని, విడిపోయారంటూ గత కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బచ్చన్ ఫ్యామిలీ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కుటుంబం కావడంతో, వీరి వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో, సోషల్ మీడియాలో చాలా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా.. అభిషేక్, ఐశ్వర్యలు విడిపోతున్నారంటూ గత కొన్ని నెలలుగా పుకార్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వార్తలపై అటు ఐశ్వర్య కానీ, ఇటు అభిషేక్ కానీ ఏ రోజు స్పందించలేదు.

రీసెంట్ గా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్యతో కలిసి ఒంటరిగా ఎయిర్ పోర్టులో కనిపించింది. కానీ బచ్చన కుటుంబంలోని ఇతర సభ్యులతో కనిపించకపోవడంతో ఈ విడాకుల పుకార్లకు బలం చేకూరింది. అంతేకాకుండా.. అనంత్ అంబానీ వివాహ వేడుకల సమయంలోనూ ఐశ్వర్య, అభిషేక్ లు విడివిడిగా హాజరు కావడంతో వీరు నిజంగానే విడిపోయారని అందరూ భావించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తొలిసారి స్పందించిన అభిషేక్..
Image Credit : Getty

తొలిసారి స్పందించిన అభిషేక్..

ఎన్ని వార్తలు వచ్చినా బచ్చన్ ఫ్యామిలీ మాత్రం ఈ విషయంపై మౌనం పాటిస్తూ వచ్చింది. కానీ తొలిసారి అభిషేక్ బచ్చన్ ఈ విషయాలై స్పందించడం విశేషం. విడాకుల వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూవర్ అడిగిన ప్రశ్నకు అభిషేక్ సమాధానం ఇచ్చాడు. ‘ మీరు ఐశ్వర్యకు విడాకులు ఇస్తున్నారంటూ వస్తున్న వార్తలు మీ కూతురు ఆరాధ్యకు తెలుసా?’ అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రశ్నించగా.. ‘ లేదు... ఇవేమీ నా కూతురికి తెలియదు’ అని ఆయన చెప్పారు.

అంతేకాదు.. అసలు తాను ఐశ్వర్యకు విడాకులు ఇవ్వడం లేదని.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేవలం పుకార్లు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తల కారణంగా తన కూతురు చాలా బాధపడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ నా కూతురు ఆరాధ్య ఇంకా చిన్న పిల్ల. తన దగ్గర కనీసం మొబైల్ కూడా లేదు. కానీ, ఇంట్లో ఎవరో ఒకరి ఫోన్ తీసుకొని గూగుల్ లో వార్తలు చూస్తే..? అలాంటి తప్పుడు వార్తలు ఆమె చదివితే ఆమె మనసులో ఎలాంటి సందేహాలు వస్తాయి? ఒక చిన్న పిల్ల మైండ్ ఎంత ప్రభావితం అవుతుందో ఎవరికీ అర్థం కాదు.’ అంటూ అభిషేక్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.

‘నాకు చిన్నప్పటి నుంచే మీడియా దేశపు మనస్సాక్షి అనే నేర్పించారు. కానీ, ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.. మీరు మాట్లాడేది మరో మనిషి గురించి అని. ఒకరి కొడుకు, తండ్రి, భర్త, భార్య గురించి అని తెలుసుకోవాలి. అందుకే.. కచ్చితంగా బాధ్యతగా ఉండాలి. నా గురించి మాట్లాడండి. కానీ నా కుటుంబం గురించి అబద్ధాలు, సృష్టించిన కథలు, అసత్యాలు మాట్లాడితే మాత్రం సహించను. నేను ప్రతి విషయాన్ని అందరికీ వెళ్లి వివరణ ఇవ్వలేను. నాకు ఎప్పుడు ఏం చెప్పాలి అనిపిస్తే అప్పుడే చెబుతాను. నేను ఎప్పుడూ తప్పు పని చేయలేదు. కాబట్టి వెంటనే వివరణలు ఇవ్వాల్సిన అవసరం నాకు కనిపించదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. ఎవరైనా నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను’ అని అభిషేక్ క్లారిటీ ఇచ్చారు.

33
తండ్రి ప్రేమ...
Image Credit : Getty

తండ్రి ప్రేమ...

ఇంటర్నెట్ లో వచ్చే ప్రతి పుకార్లు... ఒక కుటుంబం, ఒక చిన్నారి మనసును కూడా చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుందని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ప్రముఖులైనా మనుషులే... వారి వ్యక్తిగత జీవితం గురించి అబద్ధాలు వ్యాప్తి చేయడం సరైన పని కాదని ఆయన మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు అభిషేక్ చేసిన కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి. అభిషేక్ కి కూతురి పట్ల ఉన్న ప్రేమ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక.. ఐశ్వర్య, అభిషేక్ విడిపోవడం లేదని తెలిసి... వారి మ్యూచువల్ అభిమానులు సంతోషిస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Related Stories
Recommended image1
Samantha Ring: భర్త రాజ్ బహుమతి...సమంత ఉంగరం ధరెంతో తెలుసా?
Recommended image2
Naga Chaitanya: నా భర్తను అలా పిలవొద్దు.. శోభిత కి కోపం వచ్చేసిందిగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved