- Home
- Entertainment
- Guppedantha Manasu: దేవయానికి చుక్కలు చూపించిన జగతి.. నా నిర్ణయమే ఫైనల్ అంటూ షాకిచ్చిన రిషి!
Guppedantha Manasu: దేవయానికి చుక్కలు చూపించిన జగతి.. నా నిర్ణయమే ఫైనల్ అంటూ షాకిచ్చిన రిషి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

రిషి, వసు (Vasu) లు మినిస్టర్ గారి దగ్గరికి కార్లో వెళ్తూ ఫన్నీగా గొడవ పడుతూ ఉంటారు. మరోవైపు దేవయాని వసు గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక గౌతమ్ (Goutham) వసు కాలేజ్ టాపర్ అంతేకాకుండా యూత్ ఐకాన్ అని మెచ్చుకుంటాడు. దానితో దేవయాని కుళ్ళు కుంటుంది.
ఇక రిషి (Rishi) మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లిన తర్వాత మినిస్టర్ గారు మీ అమ్మానాన్న చాలా మంచివారు. ఇక అంతే కాకుండా చాలా గొప్పవారు అని అంటాడు. మీ అమ్మానాన్న ఆశీస్సులు మనకు ఉండాలి అని చెప్పాడంతో రిషి మనసులో చాలా బాధను వ్యక్తం చేస్తాడు. ఇక రిషి ఫీల్ అవుతున్న విషయం వసు (Vasu) గ్రహిస్తుంది.
ఆ తర్వాత మినిస్టర్ (Minister) నువ్వు ఈ నిర్ణయాన్ని బాగా ఆలోచించి తీసుకుంటావని నేను అనుకుంటున్నాను అని అంటాడు. దాంతో రిషి (Rishi) బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్న అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోతాడు. దాంతో మినిస్టర్ ఒక్కసారిగా స్టన్ అవుతాడు.
మరోవైపు దేవయాని (Devayani) జగతి ఇంటికి వెళ్లి అక్కడ మహేంద్రను (Mahendra) చూసి మొత్తానికి సొంత కుంపటి కల నెరవేరింది గదా అని మహేంద్రతో అంటుంది. అంతేకాకుండా ఇద్దరూ ఒకటయ్యారు అని దెప్పిపొడుస్తుంది. ఇక ఈ విషయం తెలిస్తే ఫ్లవర్ బొకే కూడా తెచ్చే దాన్ని కదా అని అంటుంది దేవయాని.
ఆ తర్వాత దేవయాని (Devayani).. అయినా మీ గొడవ నాకెందుకులే.. మా అబ్బాయి గురించి వచ్చాను అని అంటుంది. దాంతో జగతి ఒకసారి గా స్టన్ అవుతుంది. దాంతో జగతి (Jagathi) రిషి మీద మీకున్న ఉద్దేశ్యమేమిటో.. ఆ ప్రేమే ఏమిటో అంటూ విరుచుకు పడుతుంది. దాంతో దేవయాని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆ తర్వాత కాలేజ్ స్టాప్ రిషి (Rishi) దగ్గరకువచ్చి సార్ మీరు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చేసారంట కదా అని అడుగుతారు. దాంతో రిషి కాలేజీ ఎండి గా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయమే ఫైనల్ అని నేను అనుకుంటున్నాను అని అంటాడు. ఆ తర్వాత రిషి నోటీస్ బోర్డ్ ఏర్పాటు చేయగా నోటీస్ బోర్డులో ఎవరో కంప్లైంట్ ఇస్తారు.