- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుధారకు డ్రైవర్‌గా మారిన సాక్షి.. రిషీకి సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన వసు!
Guppedantha Manasu: వసుధారకు డ్రైవర్‌గా మారిన సాక్షి.. రిషీకి సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన వసు!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో రిషీ, వసును చూసి దేవయాని(devayani) కోపంతో రిషి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చి ఈ టైంలో ఎందుకు వచ్చావు అని అడగగా వెంటనే రిషి కాలేజ్ పని మీద వచ్చింది అంటూ వసు సపోర్ట్ గా మాట్లాడుతాడు. అప్పుడు వసు కూడా దేవయానికి తగిన విధంగా కౌంటర్ ఇస్తుంది. ఇక అక్కడి నుంచి వెళ్లే సమయంలో సాక్షి అక్కడికి వస్తుంది. ఏంటి రిషీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా ఉన్న విషయం చెప్తాడు.
వసుధారను నేను డ్రాప్ చేస్తానులే అంటే దేవయాని తిట్టుకుంటుంది. దీని తెలివి తెల్లారినట్టే ఉంది అని మనసులో అనుకుంటుంది. ఇక సాక్షి మాటలకూ షాక్ అయిన రిషి అలా చూస్తూ ఉండిపోతాడు.. ఇక సాక్షి, వసుధార ఇద్దరు ఒకే కారులో బయల్దేరుతారు. వసుధారకు డ్రైవర్ గా ఉండి డ్రాప్ చెయ్యడానికి తీసుకెళ్తుంది. ఇక కారులో వెళ్తూ నిన్ను రిషిని వెళ్లకుండా చేశాను చూడు అని అంటుంది. నేను ఉండగా మిమ్మల్ని కలవనివ్వను అని సాక్షి అంటుంది.
అప్పుడు వసుధార మాట్లాడుతూ నేను వర్షాన్ని, రిషి సార్ భూమి.. ఎప్పటికైనా వర్షం భూమి మీద పడాల్సిందే అని అంటుంది. నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయ్యిందని సాక్షి వసుధారను అంటుంది. ఇక తర్వాత సీన్ లో చదువుల పండుగ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. అక్కడ రిషి, వసుధార యాక్టీవ్ గా స్టార్ట్ చేస్తారు. ఇది మీ విజయమే సార్ అని వసుధార మనసులో అనుకుంటుంది. ఇక అక్కడకు సాక్షి ఎంట్రీ ఇచ్చి సీన్ చేస్తుంది.
ఆ సీన్స్ అన్ని రిషి తిప్పికొడుతాడు. ఇక కోపంతో రగిలిపోతూ ఈవెంట్ చూస్తుంది. రిషి థాంక్స్ స్పీచ్ అయిపోగానే జగతి స్పీచ్ స్టార్ట్ చేస్తుంది. ఇక అందరూ చూస్తుండగానే రిషీ బ్యాచ్ ని వసుధార సరి చేస్తుంది. అక్కడే ఉన్న సాక్షి చూసి రగిలిపోతుంటే మహేంద్ర, జగతి మూసి మూసి నవ్వులు నవ్వుతుంటారు. ఆతర్వాత ఒక బ్యాచ్ తీసుకొచ్చి రిషి మహేంద్రకు పెడుతాడు. అది చుసిన జగతి ఆనందపడుతుంది.
అప్పుడు జగతి చదువుల పండుగ గురించి గొప్పగా స్పీచ్ ఇస్తుంది. డీబీఎస్టీ కాలేజ్ చదువుల పండుగ ప్రారంభం చెయ్యడం వల్ల ఎంతో గొప్ప జరుగుతుందని.. చదువు చెప్పడం వల్ల ఎంతో మంచిదని చెప్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా వేసిన అడుగులు సక్సెస్ అయ్యాయి.. ఇప్పుడు చదువుల పండుగ రూపంలో మళ్లీ మనముందుకు వచ్చింది. అన్ని కాలేజ్ లలో ఈ పండుగ ప్రారంభం అయ్యిందని చెప్తుంది.
అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అని జగతి స్పీచ్ పూర్తిచేస్తుంది. అప్పుడే వసుధార అక్కడ నుంచి వెళ్తుంది. అది చుసిన రిషి ఏంటి వసుధార ఇప్పుడు వెళ్తుంది అని అనుకుంటాడు. ఇక రిషి రూమ్ లోకి వెళ్లి వసుధార తనతో తానే మాట్లాడుకుంటుంది. సర్ప్రైజ్ ఇవ్వబోతున్న అని అంటుంది. అప్పుడే రిషి ఎంట్రీ ఇస్తాడు.. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.