- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషి కోసం మొండి చేస్తున్న వసు.. రిషిలో మార్పు వచ్చిందని భయపడుతున్న దేవయాని?
Guppedantha Manasu: రిషి కోసం మొండి చేస్తున్న వసు.. రిషిలో మార్పు వచ్చిందని భయపడుతున్న దేవయాని?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమౌతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళుతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

వసుధార (Vasudhara) రిషి (Rishi) మనసులో ఉన్న మాటలు బయట పెట్టడానికి మొండిగా ప్రవర్తిస్తుంది. ఎలాగైనా రిషి మాటలు బయట పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అప్పటి లాగా లేరని మొత్తం మారిపోయారు సార్ అంటూ కోపంతో మాట్లాడుతుంది.
ఇద్దరూ ఒకరికొకరు తమ తమ గతాల గురించి తెలుపుతూ ఒకప్పుడు ఎలా చూసుకున్నారో అని అనుకుంటూ బాగా వాదనలు చేసుకుంటారు. ఇక వసు (Vasu) గట్టిగా అడిగేసరికి రిషి (Rishi) కూడా గట్టిగా సమాధానం ఇస్తాడు.
శిరీష్ (Sireesh) ను పెళ్లి చేసుకుంటున్నావని ఎంగేజ్మెంట్ చేసుకున్నావని, పెళ్లి కోసం సెలవు కూడా అడిగావని కానీ శిరిష్ తో పెళ్లి విషయం మాత్రం చెప్పలేదు అంటే అందుకే నీపై కోపం ఉందని అంటాడు రిషి (Rishi).
ఇక రిషి మాటలు విన్న వసు (Vasu) షాక్ అవుతూ శిరీష్ ఓ అమ్మాయిని ప్రేమించాడని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మహేంద్రవర్మ సార్ కు చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని చెబుతుంది. శిరీష్ (Sireesh) తో నాకు పెళ్లి అని మీతో ఎవరు అన్నారు సార్ అంటూ కళ్లు తిరిగి పడిపోతుంది.
వెంటనే రిషి (Rishi) తనను కారులో తీసుకొని జగతి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడానికి బయలుదేరుతాడు. ఇంట్లో జగతి (Jagathi), మహేంద్ర వర్మ (Mahendra) వసు కోసం భయపడుతూ ఎదురుచూస్తుంటారు. అంతలోనే రిషి వసును తీసుకుని రావడంతో టెన్షన్ పడతారు.
వసును (Vasu) బెడ్ పైన పడుకోబెట్టి జగతి మేడమ్ ను చూసుకోమంటాడు. ఇక రిషి (Rishi) వసు అన్న మాటలను తలుచుకొని ఆలోచనలో పడుతుంటాడు. జగతి వచ్చి ఏం జరిగిందని ప్రశ్నించగా వర్షంలో తడిసింది అంటూ జాగ్రత్తగా చూసుకోమని అంటాడు.
మహేంద్ర వర్మ (Mahendra) అడిగినా కూడా రిషి కోపంతో మాట్లాడి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇక మహేంద్రవర్మ అసలు వీరి మధ్య ఏం జరిగిందో అని టెన్షన్ పడుతుంటాడు. మరోవైపు దేవయాని (Devayani) రిషి, మహేంద్ర వర్మ కనిపించకపోవడంతో ధరణి పై అరుస్తుంది.
అంతలోనే రిషి (Rishi) తడిసిన బట్టలతో ఇంట్లోకి రావటంతో దేవయాని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఇక రిషి దేవయాని (Devayani) మాటలు పట్టించుకొని.. పట్టించుకోకుండా మాట్లాడటంతో రిషి లో మార్పు వచ్చిందని అనుకుంటుంది.
రిషి (Rishi) తన రూమ్ లోకి వెళ్లి వసు మాటలను తలచుకుంటాడు. ఇక తను అద్దం వైపు చూస్తూ ఉండగా వసు వచ్చి తనతో మాట్లాడుతుందని ఊహించుకుంటాడు. ఇక ధరణి (Dharani), దేవయాని రావటంతో దేవయానిపై కాస్త విసుక్కుంటాడు.
వసుకు సృహ రావటంతో జగతి (Jagathi), మహేంద్ర వర్మ తనను ఏం జరిగింది అని ప్రశ్నిస్తారు. ఏదైనా గొడవ ఉంటే రేపు మాట్లాడుకుందామని అంటాడు. కానీ వసు (Vasu) రిషిని ఇప్పుడే కలుస్తాను అంటూ బాగా మొండికేస్తుంది.