- Home
- Entertainment
- Guppedantha Manasu: మహేంద్ర, జగతి కోసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వనున్న రిషీ.. వసుధార పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందా?
Guppedantha Manasu: మహేంద్ర, జగతి కోసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వనున్న రిషీ.. వసుధార పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందా?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. మహేంద్ర జగతి వెళ్లిపోవడంతో డాడ్ కు నా మీద కోపం ఎందుకు.. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఫీల్ అవుతాడు. మీరు అలా ఫీల్ అవ్వకండి వాళ్ళు మన దగ్గరకు వస్తారు అని దైర్యం చెబుతుంది. ఎయిర్ పోర్ట్ లో ఉండి ఉంటారు వెళదాం పదండి అంటే నువ్వు కూడా అది నమ్ముతున్నావా? మనల్ని పక్కదారి పట్టించేందుకు అలా చెప్పారు. అని రిషి అంటాడు. అవును సార్ మీరు చెబుతుంటే నాకు అర్ధం అవుతుందని అంటుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నా పరీక్షల రిజల్ట్స్ వచ్చే టైమ్ కు రావాలి అని వసుధార అంటుంది. సరే పద అని బయల్దేరుతారు.
ఆతర్వాత సీన్ లో గౌతమ్ తో మహేంద్ర ఫోన్ మాట్లాడుతుండగా దేవయాని వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటూ ఫోన్ లాక్కుంటుంది. గౌతమ్ భయపడితే మీ పెద్దనాన్నతో ఇక్కడ జరిగే విషయాలు అన్నీ చెబుతున్నావ్ అంటుంది. అప్పుడే రిషీ వచ్చి మహేంద్ర చేసిన విషయం చెబితే కొందరు ఈ ఇంటికి రావడంతో వారిలో అలాంటి మార్పులు వచ్చాయని వసుధారను చూసి అంటుంది. ఆ మాటలు అనడంతో వసుధార ఇక్కడ అందరి మనసులు బాగున్నాయ్.. మీ నిజస్వరూపమే రిషీ సార్ కు తెలిసేలా చెయ్యాలి అని అనుకుంటుంది.
ఆతర్వాత సీన్ లో రిషి వెళ్లి మహేంద్ర రూమ్ లో కూర్చొని పాత సీన్స్ అన్ని గుర్తుతెచ్చుకుంటాడు. ఆతర్వాత ఆ రూమ్ లోకి గౌతమ్ వస్తే మహేంద్ర అనుకోని హగ్ చేసుకుంటాడు. రేయ్ రిషీ నేను మీ డాడ్ కాదు గౌతమ్ ని అని అంటే.. అవునా అని అంటాడు. రిషీ బాధపడుతుంటే బాధ పడకు వస్తారు అని గౌతమ్ అంటే.. వాళ్ళు రారు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు.. ఏంటి అని గౌతమ్ అడగగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని రిషి అంటాడు. రేయ్ ఎందుకు రా అలాంటి పిచ్చి పనులు ఏం చెయ్యకు అని చెప్తే నువ్వు వేళ్ళు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్న అని అంటాడు.
ఇక మరో సీన్ లో పరీక్షా ఫలితాలు గురించి భయపడుతుంటుంది.. అప్పుడే రిషీ వచ్చి ఆమెకు దైర్యం చెప్తాడు. యూనివర్సిటీ టాపర్ గా ర్యాంక్ కొడుతావ్ అని దైర్యంగా చెబుతాడు.. ఆతర్వాత నువ్వు భయపడ్డం ఏంటి వసుధార... నువ్వు దైర్యవంతురాలివి అంటూ దైర్యం చెబుతాడు. ఆతర్వాత సీన్ లో వసుధార కిచెన్ లో కూరగాయలు తిరుగుతుంటే ధరణి వసుని పొగుడుతుంది. నేను ఏ పని చేసిన ఆ పనిని గౌరవిస్తా అంటుంది. ఆతర్వాత ధరణి కాఫీ కలిపి దేవయానికి తీసుకురాగా నేను ఇస్తా అంటూ తీసుకెళ్తుంది.
అక్కడ దేవయాని వసుధార ఇచ్చిన కాఫీని చూసి నువ్వు తెచ్చావ్ ఏంటి? నా కోడలు ఏమైంది అని అడిగితే నేను మీ కోడలి లాంటిదాన్నే కదా మేడం అని వసుధార షాకిస్తుంది. కోపంగా చూసి ఏంటి నువ్వు ఇంటి పనులు చేస్తున్నావ్? వంట పనులు చేస్తున్నావ్? ఆడకుండానే కాఫీ ఇస్తున్నావ్ అంటూ వెటకారంగా అంటుంది. ఎన్నాళ్ళు తిష్ట వేయాలనుకుంటున్నావ్ ? అసలు నీ ప్లాన్ ఏంటి అని దేవయాని అడిగితే.. ప్లాన్స్ తో జీవితాలు నడవవు అంటూ సమాధానం ఇస్తుంది.. నీకు ఈ మధ్య దైర్యం ఎక్కువైంది అని రిషి అండగా ఉన్నాడని కదా అంటే అవును మేడం భలే కనిపెట్టారు అని అంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.