- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుధారపై కేకలు వేసిన రిషీ.. జగతి, మహేంద్రను ముప్పుతిప్పాలు పెడుతున్న శైలేంద్ర!
Guppedantha Manasu: వసుధారపై కేకలు వేసిన రిషీ.. జగతి, మహేంద్రను ముప్పుతిప్పాలు పెడుతున్న శైలేంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. అధికారం దక్కించుకోవడం కోసం తండ్రిని బుట్టలో వేస్తున్న ఒక కొడుకు కధ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో డబ్బు తీసుకొని తండ్రి దగ్గరికి వస్తాడు శైలేంద్ర. కొడుకుని చూసి గర్వపడతాడు ఫణీంద్ర. నువ్వు ఈరోజు మన ఇంటి గౌరవాన్ని కాపాడావు ఇంత ప్రయోజకుడు వి అవుతావు అనుకోలేదు అని కొడుకుని పొగుడుతాడు. నేను మీ కోసం ఏమైనా చేస్తాను డాడీ, మీరు ఆనందంగా ఉండటమే నాకు కావాలి. కావాలంటే మమ్మీ ని అడగండి అంటాడు శైలేంద్ర. అవునండి వాడికి అవగాహన లేక ఫారెన్ నుంచి వచ్చిన కొత్తలో లేనిపోని సలహాలు ఇచ్చాడు కానీ ఇప్పుడు తనని తాను మార్చుకున్నాడు అంటుంది దేవయాని.
తల్లి కొడుకులి lద్దరినీ జగతి దంపతులు మనసులోనే తిట్టుకుంటారు. అయినా ఈ విషయం గురించి డాడీకి చెప్పకుండా తప్పు చేశారు ఇదే దాచారా ఇంకేమైనా దాచారా. ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి లేదంటే తర్వాత తెలిస్తే డాడ్ బాధపడతారు అంటూ పిన్ని, బాబాయ్ లని ఇరికించేస్తాడు శైలేంద్ర. అవును మహేంద్ర ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి లేదంటే బయట వాళ్ల ద్వారా తెలిస్తే నేను బాధపడతాను. అప్పుడు మీ మీద కోప్పడవచ్చు కూడా అంటాడు ఫణీంద్ర.
అలాంటిదేమీ లేదు అని ఫణీంద్ర తో చెప్పి శైలేంద్ర వైపు తిరిగి నువ్వు బ్యాంకుకు వెళ్లావు కదా, జరిగిందంతా నీకు కూడా తెలుసు కదా మరి నువ్వు ఎందుకు అన్నయ్యతో చెప్పలేదు అని నిలదీస్తాడు మహేంద్ర. వెళ్లడం వరకే తెలుసు కానీ అకౌంట్ సీజ్ చేసినట్లు తెలియదు అని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు శైలేంద్ర. మరోవైపు ఏంజెల్ వసుధారకి ఫోన్ చేసి రిషి డ్రా చేసిన కళ్ళని పంపిస్తుంది. రిషి మనసులో ఎవరో ఉన్నారు వసుధార, అతను గతంలో ఎవరినో ప్రేమించి ఉంటాడు అందుకే ఇప్పుడు పెళ్లి అంటే అవాయిడ్ చేస్తున్నాడు.
అందుకే ఆ కళ్ళు ఎవరివో కనుక్కో అంటుంది ఏంజెల్. ముందు నావల్ల కుదరదు అంటుంది వసుధార. కానీ ఏంజెల్ ఎమోషనల్ గా రిక్వెస్ట్ చేయడంతో సరే అంటూ ఫోన్ పెట్టేస్తుంది. అవే కళ్ళని రిషికి పంపించి దీని గురించి ఏంజెల్ అడుగుతుంది ఏమని చెప్పమంటారు అని అడుగుతుంది. ఇవి తను ఎప్పుడు చూసింది అని మనసులో అనుకొని దీని గురించి మనం డైరెక్ట్ గా మాట్లాడాలి అంటాడు రిషి. ఆ తర్వాత ఇద్దరు బయట కలుసుకొని ఇదే విషయంలో మాట్లాడుకుంటారు.
తను ఏం అడిగినా చేసేస్తారా నావల్ల కాదు అని చెప్పొచ్చు కదా. తను హెల్ప్ అడిగినట్లుగా కాదు మీరే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నట్లుగా ఉంది అని వసుధార మీద కేకలు వేస్తాడు రిషి. మీరు అజాగ్రత్తగా ఉండి నా మీద కేకలు వేస్తారేంటి.. మీరు ఎప్పుడూ ఇంతే అసలు నిజం తెలుసుకోవాలని చూడరు. మనసుపెట్టి ఆలోచించండి అన్నీ మీకే అర్థమవుతాయి అంటుంది వసుధార. మీరు మళ్ళీ గతంలోకి వెళ్తున్నట్లుగా ఉన్నారు అయినా నాకేమీ తెలుసుకోవాలని లేదు.
నాకు తెలియవలసిన విషయాలు అవే తెలుస్తాయి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. మీ సొంత వాళ్లే మీకు అన్యాయం చేయాలని చూస్తున్నారు తెలిస్తే మీరు ఎక్కడ బాధపడతారు అని మేము చెప్పటం లేదు.నిజం తెలిసిన రోజు మీరు ఏమైపోతారో అని భయంగా ఉంది అనుకుంటుంది వసుధార. ఆ తరువాత ఏంజెల్ వసుధారకి ఫోన్ చేసి కళ్ళ గురించి అడిగావా అని అడుగుతుంది. సార్ ఏమి చెప్పడం లేదు అంటుంది వసుధార. నేను అతనిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం విశ్వానికి చెప్పాలనుకుంటున్నాను.
కానీ రిషి ఏ విషయం తేల్చడం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏంజెల్. ఈ మాటలు విన్న విశ్వనాథం వసుధారకి ఏంజెల్ మనసులో ఎవరున్నారో తెలుసన్నమాట అనుకుంటాడు. నేనే ఎలాగైనా ఏంజెల్ కి సాయం చేయాలి అనుకుంటాడు. మరోవైపు జరిగిందంతా అన్నయ్యకి చెప్పాలి లేదంటే శైలేంద్ర అన్నయ్యకి చెప్పేసి మనల్ని మరింత దూరం చేస్తాడు అంటాడు మహేంద్ర. అలాగే శైలేంద్ర చేసిన కుట్రలు, కుతంత్రాలు కూడా చెబుదాం పద అంటుంది జగతి. నువ్వు వద్దులే నేను వెళ్లి చెప్తాను అని చెప్పే అక్కడినుంచి బయలుదేరుతాడు మహేంద్ర.
మహేంద్ర తమ గది వైపే రావడం గమనించిన దేవయాని ఇప్పుడు మా ఆయనని కూల్ చేయడానికి వస్తున్నాడేమో అనుకుంటుంది. తనే గదిలోంచి బయటికి వచ్చి ఇటువైపు వస్తున్నావేంటి మహేంద్ర మీ అన్నయ్యతో ఏమైనా మాట్లాడాలా అంటుంది. అవును అంటాడు మహేంద్ర. నువ్వేదో సీరియస్ విషయం మాట్లాడడానికి వచ్చినట్లుగా అర్థమవుతుంది కానీ ఆయన ఇప్పుడు పడుకున్నారు. డిస్టర్బ్ చేస్తే బాగోదు రేపు పొద్దున్న మాట్లాడుతువుగానివిలే అని చెప్పి మహేంద్ర ని అక్కడ నుంచి పంపించేస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.