Guppedantha Manasu: ఊహించని గురుదక్షిణ అడిగిన జగతి.. కోపంతో రెచ్చిపోయిన రిషి?
Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకొని ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తమ్ముడిని ఓడించడం కోసం పిన్నిని పావుగా వాడుకుంటున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో తనమీద నీడ పడేసరికి మెలకువ వచ్చి చూస్తాడు రిషి. ఎదురుగా ఉన్న జగతిని చూసి షాక్ అవుతాడు. ఈ టైంలో ఇలా వచ్చారండి మేడం అని అడుగుతాడు. ఏమీ లేదు నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చాను అంటూ వెళ్ళిపోబోతుంది జగతి. నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం అని అడుగుతాడు రిషి. అలాంటిదేమీ లేదు అంటుంది జగతి.
అయితే మీ ప్రాబ్లం ఏంటి మేడం ఎందుకు ప్రతి దానికి కంగారు పడుతున్నారు నేను తప్పు చేస్తున్నానో ఏమో తెలియదు కానీ నీ మీద కోప్పడుతున్నాను. నాకు ఏమీ కాదు మీరు అనుకున్నట్లే నేను బాగుంటాను. రేపే డి బి ఎస్ టి మెడికల్ కాలేజ్ బాధ్యతలు కూడా తీసుకోబోతున్నాను. రేపటి సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాను ఇన్నాళ్ళకి నా కల నెరవేరబోతుంది అంటూ ఆనందంగా చెప్తాడు రిషి.
సరే అంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది జగతి. నీ ఆనందం ఎంతో సేపు ఉండదు నీ ప్రాణాల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. అది వసుధార చూస్తుంది. ఏమైంది మేడం రిషి సార్ రూమ్ లో చూస్తున్నారు ఏంటి అని అడుగుతుంది. అలాంటి ఏమీ లేదు కానీ ఒకసారి నువ్వు నాతో రా అని చెప్పి తన రూమ్ కి తీసుకు వెళ్తుంది జగతి.
నువ్వు నాకు ఒక గురుదక్షిణ ఇవ్వాలి, ఇస్తావు కదా అని అడుగుతుంది. నా ప్రాణాలు అయితే అడగరు కదా మేడం అయినా పర్వాలేదు ఆనందంగా ఇచ్చేస్తాను అంటుంది వసుధార. నీ ప్రాణాలు రిషివి అవి ఎలా అడుగుతాను అని చెప్పి విషయం చెప్పకుండా వసుధార దగ్గర మాట తీసుకుంటుంది జగతి. మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళటం కోసం రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది జగతి.
అప్పటికే అక్కడ ఫణీంద్ర, శైలేంద్ర ఉంటారు. అంతలోనే రిషి కూడా రావడంతో ఫణీంద్ర కంగ్రాట్స్ చెప్పి రిషి ని మెచ్చుకుంటాడు. కలలు అందరూ కొంటారు కానీ నిజం చేసుకోవడం కొందరికే తెలుస్తుంది ఈరోజు మొట్టమొదటిసారిగా డి బి ఎస్ టి కాలేజ్ బాధ్యతలు తీసుకుంటూ ప్రెస్ మీట్ కి అటెండ్ అవుతున్నావు కంగ్రాట్స్ అంటాడు శైలేంద్ర. సరే కాలేజీకి వెళ్దాం రండి అంటాడు రిషి. మీరు వెళ్ళండి నేను డాడీ వస్తాం అంటాడు శైలేంద్ర.
రిషి వాళ్ళతో పాటు వస్తున్న జగతికి, శైలేంద్ర ఇదే నీకు ఆఖరి అవకాశం గడువు లో మాత్రం ఎలాంటి మార్పు లేదు అని మెసేజ్ పెడతాడు. అది చదివిన జగతి మరింత కంగారుపడుతుంది రిషితో నేను కూడా మీ కార్ లోనే వస్తాను అని చెప్పి వాళ్ళ కారులోనే బయలుదేరుతుంది కారులో కూర్చొని మీ ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి ఒకరికి కోపం వస్తే ఒకటి సర్దుకోండి అంటూ జాగ్రత్తలు చెప్తుంది.
ఎందుకు మేడం కొత్తగా మాట్లాడుతున్నారు అంటారు రిషి, వసు. ఏం లేదు చెప్పాలనిపించింది అందుకే చెప్పాను అంటుంది జగతి. కాలేజీకి వెళ్లిన తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాట్లు చూసుకోమని వసు చెప్పి నేను ఇంజనీర్ తో మాట్లాడి వస్తాను అని సైట్లోకి వెళ్తాడు రిషి. నీ ఆనందాన్ని నేను కాసేపట్లో ఆవిరి చేయబోతున్నాను నీ ప్రాణాలని రక్షించడం కోసం ఏమైనా చేస్తాను అనుకుంటూ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసి అటెండర్ కి చెప్పి రిషి ని క్యాబిన్ కి రమ్మని చెప్తుంది.
ఈలోపు వసు దగ్గరికి వెళ్లి రాత్రి నాకు మాట ఇచ్చావు గుర్తుందా ఇప్పుడు ఆ కోరిక కోరుతున్నాను అంటూ ఆ చెక్ మీద రిషి సైన్ చేసాడు అని మినిస్టర్ గారి ముందు చెప్పాలి అని కోరుతుంది జగతి. ఆ మాటలు విన్న వసుకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మేడం చచ్చినా నేను అలా చేయను. రిషి సర్ ని అప్రతిష్టపాలు చేసే ఏ పని చేయను అంటుంది.
తప్పదు వసు లేదంటే రిషి ప్రాణాలు శైలేంద్ర తీసేస్తాడు అంటూ ఏడుస్తుంది జగతి. తరువాయి భాగంలో మినిస్టర్ తో సార్ బోర్డు మెంబర్స్ అందరి ముందు చెక్ మీద ఎందుకు సైన్ చేశారు అంటూ జగతి రిషి నిలదీస్తుంది. అది చూసిన రిషి షాక్ అవుతాడు. ఈ చెక్కు మనం ఇష్యూ చేసిందేనా అని వసు ని అడుగుతాడు. భయంతో ఆమె ఏమి మాట్లాడకపోతే చెప్పు.. మనం ఇష్యూ చేసిందేనా అంటూ కోపంతో అరుస్తాడు రిషి.