- Home
- Entertainment
- Guppedantha Manasu: శైలేంద్ర పన్నాగానికి బలైన జగతి.. చేతులు జోడించి క్షమాపణ వేడుకున్న వసు!
Guppedantha Manasu: శైలేంద్ర పన్నాగానికి బలైన జగతి.. చేతులు జోడించి క్షమాపణ వేడుకున్న వసు!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. బావగారి కొడుకు విష వలయం నుంచి కన్న కొడుకుని ఎలా రక్షించాలో అర్థంకాక సతమతమవుతున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రిషి, వసు ఇద్దరి చేత దగ్గరుండి దండలు మార్పిస్తాడు శైలేంద్ర. ప్రోగ్రాం ఇక్కడితో అయిపోలేదు ఇంకా ఉంది అంటూ తల్లిని జ్యూస్ తీసుకు రమ్మంటాడు. దేవయాని జ్యూస్ తీసుకురావడానికి వెళ్తుంది. జగతి చెప్పడంతో ధరణి ఆమెని ఫాలో అవుతుంది. దేవయాని జ్యూస్ లో ఏదో కలపటం చూసి ఏం చేస్తున్నారు అని కంగారుగా అడుగుతుంది.
అదంతా నీకెందుకు ఎవరితోనైనా చెప్పావంటే ఊరుకునేది లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ధరణిని అక్కడ నుంచి పంపించేస్తుంది దేవయాని. కంగారుపడిన ధరణి విషయాన్ని జగతికి చెప్తుంది. జగతి భయంతో కంగారు పడిపోతుంది. విషం కలిపిన జ్యూస్ రిషి తాగి చనిపోయినట్లుగా బ్రమ పడుతుంది. భయంతో గట్టిగా కేక పెడుతుంది.
ఏం జరిగింది అంటూ అందరూ కంగారు పడతారు. మహేంద్ర సర్ది చెప్పడంతో కొంచెం కూల్ అవుతుంది జగతి. శైలేంద్ర, వసుకి జ్యూస్ ఇచ్చి రిషికి తాగించమని చెప్తాడు. వసు, రిషికి జ్యూస్ తాగించబోతే జగతి గబగబా వేదిక మీదకి వచ్చి ఆ గ్లాస్ లాక్కొని ఈ జ్యూస్ తాగొద్దు అంటూ కంగారుగా చెప్తుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకు తాగొద్దు ఏమైంది అంటాడు రిషి.
ఏమీ లేదు తాగద్దు అన్నాను అంటే తాగొద్దు అంతే అంటుంది జగతి. అదే ఎందుకు తాగకూడదు అంటూ గట్టిగా నిలదీస్తాడు శైలేంద్ర. ఇందులో విషం ఉంది అంటుంది జగతి. ఆ మాటలకి అందరూ అవాక్కవుతారు. అందులో విషం ఎవరు కలుపుతారు తెమ్మన్నది నేను తెచ్చింది మా మమ్మీ అంటే మేమే అందులో విషం కలిపామనా మీ ఉద్దేశం అంటూ ఆ జ్యూస్ ని శైలేంద్ర తాగేస్తాడు.
అతనికి ఏమి అవ్వదు. జగతి, ధరణి అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఎంగేజ్మెంట్ కి వచ్చిన అందర్నీ భోజనానికి పంపించి ఇప్పుడు చెప్పండి పిన్ని మీ సమస్య ఏమిటో అసలు మీకు అందులో విషం కలిపినట్లు అనుమానం ఎందుకు వచ్చింది అయినా మేము రిషికి విషం పెడతామని ఎలా అనుకున్నారు. వాడు నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువ.
వాడు సంతోషంగా ఉండాలని నేనే కదా ఎంగేజ్మెంట్ ప్రపోజల్ తెచ్చింది అంటూ ఫ్రెష్టేట్ అవుతాడు శైలేంద్ర. ఏదో జరిగే ఉంటుంది లేకపోతే మేడం అలా అనరు అంటుంది వసు. నేను విషం కలపడం ఏంటి నువ్వు లేనప్పుడు నేనే కదా వాడిని పెంచి పెద్ద చేశాను అంటూ బాధపడుతుంది దేవయాని. ఏమీ అనుకోవద్దు అని సర్ది చెప్తాడు మహేంద్ర. అలా కాదు మహేంద్ర తన మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి అంటుంది దేవయాని.
అలా కాదు అసలు నేను ఈ ఇంట్లో ఉండడం పిన్నికి ఇష్టం లేదేమో నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటాడు శైలేంద్ర. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడమేంటి అంటూ సైలేంద్రని మందలిస్తాడు రిషి. మీ పద్ధతి ఏమీ బాగోలేదు మేడం ఎవరిని పడితే వాళ్ళని అనుమానిస్తారా అయినా అన్నయ్య వచ్చిన దగ్గరనుంచి నాతో ఎంత ఎఫెక్షన్ గా ఉన్నాడో.
మీరే చూశారు కదా అయినా పెద్దమ్మ నాకు విషం ఇవ్వటం ఏంటి ఒకవేళ ఇచ్చినా నేను ప్రశాంతంగా ఆ విషాన్ని తీసుకుంటాను. ఆవిడ కోసం నా ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధమే అంటాడు రిషి. మేడం పొరపాటు పడ్డారు అలా అనటం ఆవిడ తప్పే అందుకు నేను క్షమాపణ కోరుతాను అంటుంది వసు. ఆవిడ తప్పు చేస్తే నువ్వు ఎందుకు క్షమాపణ అడగాలి అంటాడు రిషి.చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి సార్ అని రిషికి చెప్పి చేతులు జోడించి అటు శైలేంద్రకి ఇటు దేవయానికి క్షమాపణలు చెప్పుకుంటుంది వసు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.