- Home
- Entertainment
- Guppedantha manasu: అందరి ముందు నిజాన్ని బయట పెట్టేసిన మహేంద్ర.. కోపంతో రగిలిపోయిన రిషి!
Guppedantha manasu: అందరి ముందు నిజాన్ని బయట పెట్టేసిన మహేంద్ర.. కోపంతో రగిలిపోయిన రిషి!
Guppedantha manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు(Guppedantha manasu) ఇక ఈ సీరియల్ లో ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం..

డిబిఎస్టి కాలేజ్ ను చూపించడంతో సీరియల్ ప్రారంభమౌతుంది దేవయాని ఏర్పాటుచేసిన జర్నలిస్ట్ జగతి సంతానం గురించి అడగటంతో జగతి అక్కడి నుంచి వెళ్ళి పోతూ ఉంటుంది మహేంద్ర జగతిని ఆపటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ రిషి మహేంద్ర ను జగతి దగ్గరికి వెళ్లనివ్వకుండా ఆపుతూ ఉంటాడు ఇక జగతి ఏడుస్తూ ఆగకుండా వెళ్లడంతో మహేంద్ర రిషిని తోసేసి జగతిని ఆగు జగతి అని పిలుస్తూ ఉంటాడు.
జగతి మాత్రం మనసులో ఇప్పుడేమీ మాట్లాడకు మహేంద్ర శాంతంగా ఉండు అని అనుకుంటూ వెళుతూ ఉంటుంది. జర్నలిస్ట్ వెళుతున్న జగతిని మీకు మీ సంతానం పెళ్లికి ముందే పుట్టారా.. ఆ సంతానం కుంతీపుత్రుడా అని జగతిని అవమానించేలా మాట్లాడడంతో కోపంతో మహేంద్ర ఆ జర్నలిస్ట్ నోరు ముయించి నేను నీ భర్తగా చెప్తున్నాను ఆగు జగతి అని అనడంతో అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు.
ఇక మహేంద్ర వెళ్లి జగతి చేయి పట్టుకొని వేదిక మీదకు తీసుకువచ్చి ప్రెస్ ముందు, మిగతా అందరి ముందు జగతి నా భార్య పెద్దల సమక్షంలో మేమిద్దరం ఒక్కటయ్యాం అని చెప్తాడు. మహేంద్ర, జగతి నా భార్య అనడంతో రిషి చాలా కోపంగా ఉంటాడు. మహేంద్ర నిజం బయట పెట్టడంతో దేవయాని మనసులో జగతిని అవమానించేలా చేయమంటే ఇప్పుడు ఏకంగా కుటుంబంలోకి ఆహ్వానించేలా చేశాడు అంటూ జర్నలిస్ట్ ని తిట్టుకుంటూ ఉంటుంది.
ఇక మహేంద్ర వారి సంతానం గురించి చెబుతూ మా ఇద్దరికీ సింహంలాంటి కొడుకు ఉన్నాడు వాడే రిషేంద్ర భూషణ్ అని చెప్పడంతో గౌతమ్,వసుధార, దేవయాని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. షార్ట్ ఫిలిం ప్రోగ్రాం చూడటానికి వచ్చిన మినిస్టర్ ఏది జరిగినా మన మంచికే ఇప్పుడు ఇలా మీ బంధం కలవటం చాలా సంతోషంగా ఉంది అంటూ రిషి,మహేంద్ర,జగతిలను పొగుడుతూ ఉంటాడు ఇక రిషి జరిగిన దాన్ని అవమానం లాగా భావించి బాధపడి ఆడిటోరియం నుంచి వెళ్ళిపోతాడు. జగతి రిషిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది.
రిషి కనిపించకపోవడంతో వసుధర రిషిని వెతుకుతూ ఉంటుంది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా కంగారు పడుతూ ఉంటుంది. మరొకవైపు గౌతమ్ మహేంద్ర చెప్పిన నిజాన్ని ఆలోచిస్తూ రిషి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక గౌతమ్, వసుధార దగ్గరకు వచ్చి నీకు ఈ విషయం ముందే తెలుసు కదా అని అడుగుతాడు.
కాని వసుధార ఏం సమాధానం ఇవ్వకుండా రిషి సార్ కనిపించడం లేదు నేను అన్ని వైపులా వెతికాను సార్ అని చెప్పడంతో గౌతమ్ నేను కూడా వెళ్లి వెతుకుతాను నువ్వు వెళ్లి వెతుకు అని చెప్తాడు. ఇక రిషి కోపంతో స్పీడ్ గా కార్ డ్రైవింగ్ చేస్తూ రౌండ్స్ తిప్పుతూ ఉంటాడు జరిగిన దాన్ని అవమానం లాగా తలుచుకుంటూ ఇంకా కోపం తెచ్చుకుంటాడు. ఈ లోపు వసుధర వచ్చి కారుకు అడ్డుగా నిలబడుతుంది. వసుధారని చూసిన రిషి కారు దిగి జరిగిన విషయం గురించి కోపంతో మాట్లాడుతూ ఉంటాడు.
వసుధార జరిగిన విషయాన్ని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ రిషి మాత్రం జగతి ఒక అవకాశవాది, స్వార్థపరులు, జరిగిన దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొంది అంటూ జగతిని తిడుతూ ఉంటాడు.వసుధార రిషి కి జగతి మంచితనం గురించి చెబుతూ ఆవిడ అవకాశవాది, స్వార్ధపరులు అయి ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కాదు సార్ అని చెబుతూ ఉంటుంది. మహేంద్ర జగతిని ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడు ఇక మహేంద్ర ఇంటిలోకి వస్తూ ఉంటే ఆ గడప దాటి లోపలికి రావద్దు అంటుంది జగతి.
రిషి మనసును బాధ పెట్టకూడదు అనే కదా ఇలా ఉంటుంది ఇప్పుడు నువ్వు రిషి మనసును బాధ పెట్టే విధంగా మాట్లాడావు అని మహేంద్ర ను తప్పు పడుతూ ఉంటుంది. ఇక మరొకవైపు రిషి జగతి వైపే తప్పును చూపిస్తూ జగతిని తిడుతూ ఉంటాడు. వసుధార జగతి మేడం ఏ తప్పు చేయలేదు అని చెప్తూ ఉంటుంది. జగతి రిషి గురించి బాధపడుతూ మహేంద్రను కోప్పడుతూ ఉండగా మహేంద్ర కోపంతో ఆపు జగతి అంటాడు. మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాల్సిందే.