MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: సాక్షి కిడ్నాప్ గురించి తెలుసుకున్న రిషీ.. వసుధారను ఇంటి నుంచి పంపే ప్రయత్నంలో దేవయాని?

Guppedantha Manasu: సాక్షి కిడ్నాప్ గురించి తెలుసుకున్న రిషీ.. వసుధారను ఇంటి నుంచి పంపే ప్రయత్నంలో దేవయాని?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 22వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం... 

4 Min read
Author : Navya G
Published : Sep 23 2022, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి, పెన్ డ్రైవ్ తీసుకుని వసు చివరి పరీక్ష రోజు ఏమైందో చూస్తాడు అక్కడ వీడియో అంతా చూసిన తర్వాత సాక్షి ఇదంతా చేసిందా అని కోప్పడతాడు.వసుధార, ఈ విషయం నా దగ్గర ఎందుకు దాల్చింది అని అనుకుంటాడు రిషి. అదే సమయంలో వసూ ధరణి పక్కన కూర్చొని ధరణి కి పళ్ళు తినిపిస్తూ ఉంటుంది. సారీ మేడం నా కోసం మీరు వచ్చి ఇలా జరిగింది అని వసు అనగా, లేదు వసు ఇప్పుడు నీ చేత ఇలా చేయించుకోవడం నాకు ఇబ్బందిగా ఉన్నది ఈ కాళ్ళు నొప్పికి తగ్గుతుందో ఏంటో ఇప్పుడు అప్పుడే దగ్గర లేదు అని ధరణి అంటుంది.
 

28

అదే సమయంలో కింద జగతి, మహేంద్ర, దేవయాని ముగ్గురు కూర్చుంటారు. అప్పుడు దేవయాని మహేంద్ర తో, ధరణికి ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు కదా, మరి ఇంట్లో సేవలు ఎవరికి చేస్తారు అని అనగా మహీంద్రా నేను నర్స్ కి ఫోన్ చేస్తాను తను చూసుకుంటుంది వదిన అని అంటాడు.అప్పుడు జగతి, వద్దు మహేంద్ర నేనున్నాను కదా అని అనగా దేవయాని, ఉదయం లేచిన వెంటనే కాలేజీకి వెళ్ళిపోతావు దాని తర్వాత  ధరణి గురించి, వంట గురించి, అంతా నేను చేయలేను అని అనగా వసు ఉంది కదా అని జగతి అంటుంది. 
 

38

వసుధర ఎందుకు ఇక్కడే ఉన్నది,ఒప్పుకుంటే జీవితకాలం ఇక్కడే ఉండిపోతుంది పంపించేయండి,అలాగే నర్స్ నీ కూడా పిలవండి అని అనగా మహీంద్ర, ఒక మాట రిషి ని అడిగి చెప్తాను అని అంటాడు.అప్పుడు దేవయాని, నా సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా నాకు లేదా అని అరిచి ఈ మధ్యన ఇంట్లో విలువ తగ్గిపోతుంది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. ఆ తర్వాత సీన్లో రిషి, వసుకి ఫోన్ చేస్తున్న ఫోన్ అవ్వదు. రెస్టారెంట్ కి ఫోన్ చేస్తే రెస్టారెంట్ కి రాలేదు అని వాళ్ళు చెప్తారు. ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంటిలో తాళం వేసి ఉంటుంది.
 

48

అప్పుడు మళ్ళీ తిరిగి వసుధారకి ఫోన్ చేసేసరికి ఫోన్ ఎత్తుతుంది వసు.ఎక్కడున్నావని అడగగా, ఇంట్లో ఉన్నాను సార్ అని అంటుంది వసు. నేను మీ ఇంటి ఎదురుగా ఉన్నాను అని రిషి అంటాడు.అప్పుడు వసు, నేను మీ ఇంట్లో ఉన్నాను సార్ అసలు ఏమైందంటే అని చెప్పే లోగ రిషి ఫోన్ కట్ చేసి ఇంటికి బయలుదేరుతాడు. జగతి,మహీంద్రలు వాళ్ళ గదిలో ఉంటున్నప్పుడు జగతి కాలేజ్ పని చేస్తూ ఉంటుంది.అప్పుడు మహీంద్ర ఇన్ని సమస్యల్లో కూడా నువ్వు కాలేజ్ పని చేస్తున్నావు చాలా గ్రేట్ అని జగతిని పొగడగా,అలా ఏం లేదు మహేంద్ర ధరణి నీ వసు చూసుకుంటుంది కదా అని అంటుంది.
 

58

అప్పుడు మహేంద్ర,వసు రాత్రికి ఇక్కడే ఉంటుందా అని అడగగా రిషి వస్తే గాని మనం ఏ విషయము చెప్పలేము అని జగతి అంటుంది. మనమే ఇలా ఉన్నామంటే దేవయాని అక్క ఏం ఆలోచిస్తూ ఉంటారో అని మహేంద్ర అంటాడు. అదే సమయంలో దేవయాని, ధరణి పడుకోవడం ఏంటి, వసుధార ఇంటికి తీసుకురావడం ఏంటి, ఇక్కడే ఉండిపోవడం ఏంటి,అసలు ఇది కావాలని జరిగిందా లేకపోతే అనుకోకుండానే జరిగిందా రిషి వచ్చిన వెంటనే ఎలాగైనా  దాన్ని పంపించేయాలి అని అనుకుంటుంది.అదే సమయంలో రిషి అక్కడికి వస్తాడు.దేవయాని రిషిని ఆపి వసుధారని పంపించే ప్రయత్నం చేయాలనుకుంటుంది. అదే సమయంలో వసూ కూడా అక్కడే ఉంటుంది.నాలుగు మాటలు చెప్పి దీన్ని ఇంటికి పంపించేద్దాం అనుకుంటే ఇక్కడే ఉన్నాదేంటి అని దేవయాని అనుకుంటుంది. అప్పుడు దేవయాని ధరణి పడిపోయింది అని చెప్పగా వసు జరిగిన విషయం చెప్తుంది. 

68

అప్పుడు దేవయాని,ఇప్పటికే వసుధార ఇక్కడ ఉండి అలసిపోయింది గౌతమ్ ని ఇంటికి పంపించేయమని చెప్పాలా అని అనగా,వద్దు పెద్దమ్మ రాత్రికి ఇక్కడే ఉంటది లేండి అని రిషి అంటాడు. దేవయాని ఆశ్చర్యపోతుంది. పాపం తనకి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా  ఇంట్లో మనం అందరం ఉన్నాము కదా అని చెప్పిగా రిషిz తన బాధ్యత కూడా ఉంటాది కదా చేయనివ్వండి పెద్దమ్మ అని అంటాడు.వసుధారని కూడా ఒక మాట్లాడవచ్చు కదా దానికి ఇబ్బంది ఏమో అని అనగా వసుధారా కూడా నేను ఉంటాను మేడం నాకేం అభ్యంతరం లేదు అని అంటుంది. తర్వాత ఇద్దరూ ధరణి చూడడానికి వెళ్తారు.అప్పుడు ధరణి పడుకుంటుంది ఏమైంది అని అనగా మా ఇంటికి వచ్చారు సార్ ఆ సమయంలో యాక్సిడెంట్ జరిగింది అని వసల్ చెప్తుంది. నీకోసం వచ్చిన వాళ్ళకి ఏదో ప్రమాదం అవుతూనే ఉంటుంది అని అంటాడు రిషి. దానికి వసు బాధపడుతుంది.అదే సమయంలో ధరణి లెగుస్తుంది ఎలా ఉంది వదిన అని రిషి అనగా, బానే ఉంది రిషి అని ధరణి అంటుంది.

78

 ఆ తర్వాత సీన్లో దేవాయాని కిచెన్ లో ఉండగా మీరెందుకు పెద్దమ్మ ఇక్కడున్నారు ఎవరూ లేరా అని అనగా, ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు రిషి నేనే కదా ఇంటి బాధ్యత చూసుకోవాలి అని దేవయాని అంటుంది. అప్పుడు కావాలనేదే  పనం నీ తన కాళ్ళ మీద పడినట్టు నటించి అబ్బా నొప్పి అని అరుస్తుంది దేవయాని  అయ్యో పెద్దమ్మ మీరు ఎందుకు కష్టపడడం అని వసుధార చేత దేవయానికి, తనకి ఇద్దరికీ కాపీ పెట్టమని చెప్తాడు రిషి. ఆ తర్వాత సీన్లో వసుధార ఇంకా రాలేదు ఏంటి అని ఆలోచిస్తాడు. అదే సమయంలో వసు అక్కడికి వస్తుంది. ఏంటి సార్ నా గురించి ఆలోచిస్తున్నారా అని అనగా నీ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను.కాఫీ ఎలాగా  తెస్తవు కదా!అయినా పూర్తి కాఫీ తెచ్చావా లేకపోతే సగం సగం తెచ్చావా అని అంటాడు రిషి. సగం తేడం ఏంటి సార్ అని వసు అనగా, ఈ మధ్య నాకు అన్నీ సగం సగమే చెప్తున్నావ్ కదా పూర్తిగా ఏ విషయం చెప్తున్నావని అని అంటాడు. అప్పుడు వసు, మనసులో దేని గురించి మాట్లాడుతున్నారు సర్ అని అనుకుంటుంది. అయినా మీరు ఇందాక ధరణి మేడమ్ గదిలో నాతో అలా మాట్లాడడం నాకు నచ్చలేదు సర్,నేను ఫీల్ అయ్యాను అని అంటుంది. 

88

అప్పుడు రిషి, నేను సరదాకి ఏం చెప్పలేదు నిజంగానే చెప్పాను అని అనగా ఏమైనా అడగాలనుకుంటున్నారా సార్ అడగండి.ఇలా అర్థం కాని ప్రశ్నలు వేయొద్దు అని అనగా, నేను నీకు మూడు రోజులు గడిపించాను కదా ముందు దానికి సమాధానం చెప్పు తర్వాత నేను నిన్ను ప్రశ్న అడుగుతాను అని అంటాడు రిషి.వసు వెళ్ళిపోయిన తర్వాత, నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచావు అని అనుకుంటాడు రిషి.తర్వాత రిషి కోపంగా దేవయాని దగ్గరికి వస్తాడు. అప్పటికే దేవయాని, రిషి ఎందుకు వసుధార నీ పంపించలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. రిషి కోపంగా లోపలికి రావచ్చా పెద్దమ్మ అని అంటాడు. రిషి ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు అని దేవయాని లోపలికి రమ్మంటుంది.ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు పెద్దమ్మ అని కోపంతో అంటాడు రిషి. మళ్లీ ఏమైనా ప్రాబ్లం అయిందా రిషి అని దేవయాని అనగా, సాక్షి గురించి తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది పెద్దమ్మ అని అరుస్తాడు రిషి.దేవయాని ఆశ్చర్య పోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Recommended image2
Balakrishna: చిరంజీవి నటించిన ఆ సినిమా అంటే బాలకృష్ణకు ప్రాణం.. ఇంతకీ ఆ మూవీ ఏదంటే.?
Recommended image3
Prabhas: ప్రభాస్ ఆ డిజాస్టర్ సినిమా వదులుకుని కెరీర్‌ కాపాడుకున్నాడు.. ఎన్టీఆర్ అడ్డంగా దొరికిపోయాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved