Guppedantha Manasu: గిల్టీగా ఫీల్ అవుతున్న రిషి.. ఇంట్లో వసుధార అధికారం చల్లదంటున్న దేవయాని!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. భర్త ప్రోత్సాహంతో కాలేజీ ఎండిగా మారిన ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో తండ్రి కోసం బాధపడుతున్న రిషి దగ్గరికి వెళ్లి అతనికి ధైర్యం చెప్తుంది వసుధార. నేను తప్పు చేయలేదు కదా వసుధార అంటాడు రిషి. ఏ విషయంలో సార్ అంటుంది వసుధార. డాడ్ ని అక్కడ నుంచి తీసుకువచ్చేసాను. డాడ్ కి పెదనాన్న అంటే ప్రాణం వాళ్ళిద్దరూ ఇప్పటివరకు ఎప్పుడు విడిచిపెట్టి ఉన్నది లేదు. అలాంటిది డాడీని ఇ క్కడికి తీసుకువచ్చి తప్పు చేయలేదు కదా, ఎందుకో గిల్టీగా ఉంది అంటాడు.
లేదు సార్ మీరు చేసింది మహేంద్ర సర్ మంచి కోసమే కదా ఒక్కొక్కసారి జరిగే దూరాలు బంధాల్ని మరింత దగ్గర చేస్తాయి. అయినా మనం ఏమి శాశ్వతంగా విడిపోలేదు కదా. మహేంద్ర సార్ కి బాగైన తర్వాత అక్కడికి వెళ్లి పోదాం అంటుంది వసుధార. కచ్చితంగా వెళ్తాం కదా అంటాడు రిషి. అవును సార్ తప్పకుండా వెళ్దాం అంటుంది వసుధార. మరుసటి రోజు పొద్దున్నే కాఫీ పెడుతూ ఉంటుంది వసుధార. ఏం చేస్తున్నావు అంటాడు రిషి కాఫీ పెడుతున్నాను అంటుంది వసుధార.
నన్ను హెల్ప్ చేయమంటావా అని అడుగుతాడు రిషి. నేనేమైనా పెద్దపెద్ద వంటలు చేస్తున్నానా,కాఫీ ఏ పెడుతున్నాను హెల్ప్ ఏమి వద్దు అంటుంది వసుధార. సరే అయితే నా హెల్ప్ ఏమి అక్కర్లేదు కదా నేను వెళ్లిపోయేదా అంటాడు రిషి. మీరు హెల్ప్ చేయకపోయినా నా పక్కన ఉంటే కంటికి రెప్ప ఉన్నంత ధైర్యంగా ఉంటుంది. నాకు ఏ ఎండి పదవులు అక్కర్లేదు మీరు పక్కన ఉంటే చాలు అంటు భర్తకి కాఫీ ఇస్తుంది వసుధార. వసుధార తాగకపోతే రిషి తన సాసర్లో కాపీ వేసి వసుధారకి ఇస్తాడు.
ఇద్దరూ కాఫీ తాగుతూ మన ఇంట్లో ఇద్దరం కలిసి కాఫీ తాగుతుంటే ఎంత బాగుంది, ఇది మనం ఎన్నాళ్ళ నుంచో కంటున్న కల అనుకుంటారు ఇద్దరు. ఒకరి మనసులో మాట ఒకరు చెప్పుకుంటారు. మన ఈ ఆనందం వెనుక జగతి మేడం త్యాగం ఉంది అంటుంది వసుధార. ఆ తర్వాత కాలేజీ గురించి మాట్లాడుకుంటారు ఇద్దరు. అప్పుడే కాలేజీకి వెళ్ళను అంటుంది వసుధార. అలా అనకు బాధ బాదే, బాధ్యత బాధ్యతే అంటాడు రిషి.
మీరు రారా అంటుంది వసుధార. ఈరోజుకు మాత్రమే వస్తాను అంటాడు రిషి. సీన్ కట్ చేస్తే కాలేజీకి వచ్చిన దేవయాని, శైలేంద్ర ఎందుకు రమ్మన్నావు అని రిషిని అడుగుతారు. వసుధార ఎండిగా ఈ సీట్లో కూర్చోవడానికి అందరూ సంతకాలు పెట్టేశారు, ఇంక మీ ఇద్దరే పెట్టవలసి ఉంది అని చెప్పటంతో మనసులో తిట్టుకుంటూనే ఇద్దరు సంతకం పెట్టేస్తారు. ఆ తర్వాత ఎండి పదవిని అంగీకరిస్తూ నువ్వు కూడా సంతకం పెట్టు అని వసుధారకి ఫైల్ ఇస్తాడు రిషి.
ఇప్పటికి ఇప్పుడు నేనేమీ చేయలేను కానీ ఆ సంతకం పెట్టకుండా వసుధార తల మీద ఫ్యాన్ పడిపోయినా బాగున్ను అనుకుంటాడు శైలేంద్ర. కాలేజీ లోకి తను వచ్చినప్పుడు అడ్మిషన్ కూడా ఇవ్వను అన్న మీరు ఇప్పుడు నన్ను ఎండిని చేస్తున్నారు అంటుంది వసుధార. బహుశా ఈ రోజు ఇలా కాలేజీ ఎండి అవ్వటం కోసమే అలా జరిగి ఉంటుంది అంటాడు రిషి. అప్పుడు వసుధార ఫైల్ మీద సంతకం పెట్టేస్తుంది. ఇప్పుడు ఈ కాలేజీ ఎండివి నువ్వు అందరం కలిసి చర్చించుకున్నా, నిర్ణయం నువ్వే తీసుకోవాలి.
పెద్దమ్మ, అన్నయ్య కూడా నీ మాటే వింటారు అంటాడు రిషి. అదంతా కాలేజీలోనే ఇంటికి వస్తే మాత్రం నేను అత్తనే నువ్వు కోడలు వే అంటుంది వసుధార. నీ మాట కాదంటుందా అంటాడు రిషి. తర్వాత తల్లి కొడుకుల ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వసుధారకి కంగ్రాట్స్ చెప్తాడు రిషి. రిషిని ఎండి సీట్లో కూర్చోమంటుంది వసుధార. అలాంటి పిచ్చి పని చేయకు ఈ సీటు ఎప్పటికీ నీదే అంటాడు రిషి. అలా కాదు సార్ ఈ సీటు ఎప్పటికీ మీదే.
కాకపోతే బాధ్యత కోసం నేను ఈ సీట్లో కూర్చుంటున్నాను అంటుంది వసుధార. ఇద్దరూ కలిసి దీవించమని జగతికి దండం పెట్టుకుంటారు. ఆ తర్వాత నీకు పెండింగ్ ఫైల్స్ చాలా ఉంటాయి చూసుకో అని చెప్పి రిషి బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.