- Home
- Entertainment
- Guppedantha Manasu: సాక్షి ఇంట్లో వంట చేసిన వసుధార.. పూలదండ టాపిక్ మళ్ళీ తీసుకోచ్చిన రిషీ?
Guppedantha Manasu: సాక్షి ఇంట్లో వంట చేసిన వసుధార.. పూలదండ టాపిక్ మళ్ళీ తీసుకోచ్చిన రిషీ?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా మంచి ప్రేమ కథతో కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 20 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి(rishi),వసు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో జగతి,మహేంద్రలు అక్కడికి రావడంతో వెంటనే రిషి టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతాడు. ఆ తర్వాత మహేంద్ర కామెడీగా నీమీద అలిగాను జగతి నాకు ఇంతవరకు నువ్వు ఏమి కొనివ్వలేదు అనడంతో వెంటనే జగతి(jagathi) నువ్వే నాకు ఇవ్వాల్సింది పోయి నన్ను అడుగుతున్నావా గొప్పవాడివి మహేంద్ర అని అంటుంది.
మరొకవైపు రిషి క్లాసులో వసు(vasu) వేసిన బొమ్మ వైపు అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బొమ్మ వసు చేస్తున్నట్టుగా ఊహించుకుంటాడు. ఆ తర్వాత ఆ బొమ్మని ఫోటో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత రిషి వెళ్తూ ఉండగా ఇంతలో సాక్షి(sakshi)ఎదురుపడుతుంది. అప్పుడు నీతో మాట్లాడాలి అని మాట్లాడుతూ నేను నిన్ను కోరుకున్నాను కానీ దక్కడం లేదు కనీసం ఫ్రెండ్ గా అయినా ఉండలేను అని మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విని వసు షాక్ అవుతుంది.
ఆ తర్వాత రిషిని సాక్షి భోజనానికి పిలవగా సరే అని అంటాడు రిషి. ఆ మాటకు వసు(vasu) ఆశ్చర్య పోతుంది. మరొకవైపు రిషి వస్తాడు అని అద్దం ముందు తెగముస్తాబు అవుతూ ఉంటుంది సాక్షి. ఆ తర్వాత సాక్షి,దేవయానికి ఫోన్ చేసి చెప్పడంతో దేవయాని సాక్షికి ఆల్ ది బెస్ట్ చెబుతుంది. ఆ తర్వాత రిషి సాక్షి ఇంటికి రావడంతో సాక్షి ఆనంద పడుతూ ఉంటుంది. అప్పుడు లోపలికి ఇన్వైట్ చేయగా రిషి వెల్కమ్ నాకు ఒక్కనికే కాదు సాక్షి అని అనడంతో ఇంతలోనే అక్కడికి గౌతమ్, జగతి,మహేంద్ర(Mahendra)రావడంతో సాక్షి షాక్ అవుతుంది.
అప్పుడు వారందరూ ఒక్కటై సాక్షి ని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో నేను ఎలా మిస్ అవుతాను సార్ అంటూ వసు (vasu)ఇవ్వడంతో సాక్షి మరింత షాక్ అవుతుంది. అప్పుడు గౌతమ్ హోటల్లో చేయనట్టుగా మెనూ చదవడంతో సాక్షి షాక్ అవుతుంది. అప్పుడు సాక్షి నేను కేవలం ఇద్దరికీ ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాను. ఆ విషయం తెలిస్తే ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు గౌతమ్(gautham)కావాలనే సాక్షిని ఆటపట్టించడం కోసం ఫుడ్ ఐటమ్ గురించి గొప్పగా పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాడు.
అప్పుడు వసు కూడా ఈరోజు మనకు ఇంటర్నేషనల్ లెవెల్ లో మెనూ ఉంటుంది అనడంతో సాక్షి(sakshi)షాక్ అవుతుంది. అప్పుడు సాక్షి టెన్షన్ పడుతూ ఉండగా రిషి ఎందుకు అని అడగడంతో అప్పుడు గౌతమ్ మాటలకు అందరూ నవ్వుతూ ఉంటారు. ఇంతలోనే ఫుడ్ డెలివరీ అతను రావడంతో గౌతమ్ వెళ్లి ఆ ఫుడ్ ని తీసుకుని వస్తాడు. అప్పుడు సాక్షి అందరిముందు అడ్డంగా బుక్ అవుతుంది. అప్పుడు గౌతమ్(gautham)ఈ ఫుడ్ నాకు సరిపోతుంది మీకు ఎలాగా అని గౌతమ్ అనగా సాక్షి గౌతమ్ ని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది.
అప్పుడు వసు వెళ్ళి నేను హెల్ప్ చేస్తాను అని అనగా అప్పుడు సాక్షి ఇంట్లో ఏం లేవు అనడంతో నేను కిచెన్ లోకి వెళ్లి ఏదో ఒకటి చేసుకుని వస్తాను అని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత మహేంద్ర (Mahendra)వాళ్ళు అడిగే ప్రశ్నలకు సాక్షి సమాధానం చెప్పలేకపోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో వసుధర రిషిని సాక్షి విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అని అడగగా ఏమి లేదు అని అనడంతో వెంటనే వసు ఎందుకు మీరు సాక్షి చెప్పిన ప్రతి మాటకి ఒకే చెబుతున్నారు అని అంటుంది. అప్పుడు నా సంగతి పక్కన పెట్టు నువ్వు నా మెడలో ఎందుకు దండ వేశావు.అప్పుడు వసు, రిషి(rishi)కీ తన మనసులో మాట చెప్పడానికి టెన్షన్ పడుతూ ఉంటుంది.