- Home
- Entertainment
- Guppedantha Manasu: మహేంద్ర, జగతి బంధం గురించి ప్రశ్నించిన గౌతమ్.. కోపంతో రగిలిపోతున్న రిషీ!
Guppedantha Manasu: మహేంద్ర, జగతి బంధం గురించి ప్రశ్నించిన గౌతమ్.. కోపంతో రగిలిపోతున్న రిషీ!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గౌతమ్ (Goutham) ఒక దగ్గర కూర్చుని అంకుల్, ఆంటీ అంత క్లోజ్ గా ఉండడానికి కారణమేమిటి? అని ఆలోచిస్తూ ఉంటాడు.

అదే క్రమంలో రిషి (Rishi) , వసులు ఒక దగ్గర ఉండి మాట్లాడుకుంటూ ఉండగా వసు చేతిలో ఉన్న ఫ్లవర్ ను చూసి గౌతమ్ షాక్ అవుతాడు. ఇక గౌతమ్ అక్కడికి వెళ్లి మహేంద్ర, జగతిలు క్లోజ్ గా ఉంటున్న విధానం గురించి కొన్ని ప్రశ్నలు గౌతమ్ (Goutham) అడగగా దానికి రిషి అసహనం వ్యక్తం చేసి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఆ తర్వాత రిషి (Rishi) , వసును ఒకచోట కలిసి గౌతమ్ అన్న మాటలు గురించి గుర్తు చేసి మీ మేడమ్ కి నువ్వైనా చెప్పొచ్చుగా అంటూ విరుచుకు పడతాడు. దాంతో వసు విషయంలో మా మేడం గారికి బాధ లేదా అంటూ.. తనదైన శైలిలో ఎదురు వాదం వేసుకుంటూ జగతి (Jagathi) కి సపోర్ట్ గా మాట్లాడుతుంది.
ఇదే క్రమంలో జగతి (Jagathi) ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో రిషి కి వివరిస్తుంది. ఇక ఆ తర్వాత వసు మీకున్న కారణాలతో మీరు దూరం అవ్వచ్చు. మీరు కాదు అని అనుకున్నంత మాత్రాన వారి బంధం దూరం అవ్వదు కదా సార్ అని వసు (Vasu) అంటుంది.
అదే క్రమంలో వసు (Vasu) వాళ్ళ బంధం గురించి మనం మాట్లాడుకోవడం ఏమిటి సార్ అది వాళ్ల పర్సనల్ అని చెబుతుంది. ఆ తర్వాత వసు, జగతి (Jagathi) కి ఫోన్ చేసి నేను ప్రాజెక్టు పని మీద రిషి సార్ తో వెళుతున్నాను అని చెబుతుంది. ఇక వీరిద్దరూ ఒక కొండ గట్టు దగ్గరికి వెళ్లి ఫన్నీ గా చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు.
మరోవైపు జగతి, వసు పుస్తకాలు సర్దుతూ ఉండగా గౌతమ్ అక్కడికి వెళ్లి ఈ పుస్తకాలను నేను లోపల పెడతాను అని వెళ్లి అక్కడ వసు గ్యాలరీ ను చూసి డౌట్ పడుతూ ఉంటాడు. మరోవైపు రిషి కంటిలో నలక పడగా వసు కంటిలో ఊదడానికి ప్రయత్నిస్తుంటే రిషి, వసు పై చెయ్యి వేస్తాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.