Guppedantha Manasu: వసుకు దండం పెట్టిన రిషీ.. కొడుకు తీరుకు ఆశ్చర్యపోయిన మహేంద్ర!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

వసు (Vasu) ను కారులో తీసుకువచ్చిన రిషి జగతి ఇంటి ముందల డ్రాప్ చేసి వెళ్తాడు. ఇక అది చూసిన మహేంద్ర మా పుత్రరత్నం ఏంటి ఈ రోజు కోపంగా ఉన్నాడు అని అంటాడు. కొంచెం దూరం వెళ్ళినా రిషి మళ్లీ వెనుకకు వచ్చి హాయ్ డాడ్ గుడ్ నైట్ అని వెటకారంగా చెబుతాడు. దాంతో మహేంద్ర (Mahendra) ఆశ్చర్యపోతాడు.
ఆ తర్వాత రిషి (Rishi) మన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇంతగా డెవలప్ అవ్వడానికి కారణం మినిస్టర్ గారు అని ఫనింద్ర భూపతి (Phnindra Bhupathi) కి చెబుతాడు. అంతేకాకుండా ఆ మినిస్టర్ గారికి సన్మానం చేయాలి. దీని గురించి మినిస్టర్ గారిని ఇన్వైట్ చేయడానికి మనం వెళ్ళాలి అని అంటాడు.
ఆ తర్వాత కాలేజీలో రిషి (Vasu) వసు దగ్గరకు వచ్చి నువ్వు కూడా మినిస్టర్ గారి దగ్గరకు వస్తున్నావు అని అంటాడు. ఇక రిషి, వసులు ఇద్దరూ కారులో కలిసి మినిస్టర్ దగ్గరకు బయలుదేరుతారు. మరో వైపు నుంచి మహేంద్ర (Mahendra) దంపతులు కూడా వస్తారు. ఇక అందరు కలిసి మినిస్టర్ మీటింగ్ ఫినిష్ చేసుకుని వస్తారు.
ఆ తర్వాత రిషి (Rishi) నేను మినిస్టర్ గారి దగ్గర ఫోన్ మర్చిపోయాను అని వెనక్కి తిరిగి వెళ్లి ఫోన్ తెచ్చుకుంటాడు. దానికి వసు (Vasu) కొంత అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత రిషి ముంత కింద పప్పు దగ్గరికి వెళ్లి రెండు బాగా మసాలాలు వేసి కలుపు అని అంటాడు.
ఇక వసు (Vasu) మిమ్మల్ని ఇలా చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు ఉంది సార్ అని అంటుంది. దాంతో రిషి (Rishi) ఆరు నెలలు సహవాసం చేస్తే వీరు వారవుతారు అని ఊరికే లేదు అంటాడు. దాంతో వసు నిజమేనా సార్ అని అంటుంది.
ఆ తర్వాత వసు (Vasu) వాళ్ళు తినే ముంత కింద పప్పు గురించి స్టోరీ మొదలుపెడుతుంది. దాంతో రిషి (Rishi) ఇప్పుడు దీని గురించి క్లాస్ ఇవ్వకు ప్లీజ్ అని దండం పెడతాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.