Guppedantha Manasu: రిషి మాటలకు షాకైన దేవయాని.. చక్రపాణితో ఎమోషనల్ గా మాట్లాడిన వసు?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 31 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని నీకు మీ నాన్నకు టికెట్స్ బుక్ చేస్తాను ఎక్కడికైనా వెళ్లిపోండి. లేదా ఇద్దరికి కలిపి ఏసీ కార్ బుక్ చేస్తానో కనిపించకుండా వెళ్లిపోండి అంటూ వసుధారకు చెక్ బుక్ ఇస్తుంది. మేడం ఆ చెక్ ని చించి విసిరి కొడితే కానీ మీరు బయటికి వెళ్లరా అంటుంది వసుధార. నేను మీకంటే మొండి దాన్ని మీకంటే గట్టిగా అరవగలను. పెద్దవాళ్లు అని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను వెళ్లిపోండి అని అనడంతో వెంటనే దేవయాని వెళ్లిపో వెళ్ళిపో అంటున్నావు ఇది గౌతమ్ ఫ్లాట్ రిషి కి సంబంధించిందే కదా అనడంతో ఇంతలో చక్రపాణి అక్కడికి వచ్చి మేడం ఇది రిషి సార్ ఇచ్చింది కదా అని అంటాడు.
వసుధార మీకు భయం లేదనుకున్నాను సిగ్గు లేకుండా ఈ ఫ్లాట్లో ఉంటున్నారా అనడంతో మేడం అని గట్టిగా అరుస్తుంది వసుధార. మేడం ఇది అఫీషియల్ గా వచ్చినప్పుడు ఎవరిదైతే నాకేంటి మీరు మీ భాషను మార్చుకోండి అనడంతో బెదిరిస్తున్నావా అనగా నేను బెదిరిస్తే ఆ కథ మీరేగా ఉంటుంది అని అంటుంది వసుధార. మొదట్లోనే తుంచేయాల్సింది అనడంతో బంధాలను దూరం చేసే వారికి బంధాలను తుంచే వారికి బంధం విలువ గురించి ఏం తెలుస్తుంది లేండి అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అనడంతో ఇక్కడే ఉంటే ఇంకా చాలా మాట్లాడుతాను వెళ్ళిపోండి నిన్ను వెళ్లగొడతాను అని అంటుంది. దేవయాని నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండగా ఎంతలో చక్రపాణి రండి రిషి సార్ అని అంటాడు.
దాంతో దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది. పెద్దమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటాడు రిషి. అప్పుడు అసలు విషయం చెప్పబోతుండగా ఆగు వసుధార నన్ను చెప్పనివ్వు అంటూ వసు ఇక్కడ ఉండడం ఏంటి ఇది గౌతమ్ ఫ్లాట్ కదా అదంతా అవన్నీ మీకెందుకు పెద్దమ్మ అని అనడంతో దేవయాని షాక్ అవుతుంది. అప్పుడు దేవయాని మాట్లాడానికి ప్రయత్నించగా పెద్దమ్మ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలియదు కానీ ఇదంతా ప్రేమ వల్ల వచ్చిన సమస్య అనడంతో వసుధార ఆశ్చర్య పోతుంది. అప్పుడు జరిగినదానికి వసు వాళ్లకు క్షమాపణలు చెప్పి దేవయాని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇప్పుడు వసుధార రిషి సార్ కు నా మీద ప్రేమ ఉంటే వెనక్కి తిరిగి చూడాలి అని అనుకుంటుండగా అప్పుడు రిషి వెనక్కి తిరిగి చూడడంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు మహేంద్ర దంపతులు ఎదురుచూస్తూ ఉండగా ఇంతలో దేవయాని,రిషి అక్కడికి వస్తారు. రిషిని చూసి జగతి మహేంద్ర సంతోష పడతారు. అప్పుడు దేవయాని కావాలనే తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు రిషి ఎలా వచ్చారని అనుకుంటున్నారా మీకు అసలు పేగు బంధమే తెలియదు కదా అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది దేవయాని. అప్పుడు మహేంద్ర ఎందుకు వదిన ఇలా మాట్లాడుతున్నారు అనగా అయ్యో నేనేమన్నాను మహేంద్ర అంటూ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది దేవయాని.
రిషి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మీరు ఇంకొకసారి వసుధర ఫ్లాట్ కి వెళ్ళకండి పెద్దమ్మ వసుధారని కలవద్దు అనడంతో ఇంత జరిగిన తర్వాత నువ్వు ఎందుకు వసుధార కి ఫ్లాట్ ఇచ్చావు అనగా వెంటనే జగతి ఎందుకు పదేపదే వసుధార టాపిక్ తీసి రిషిని బాధ పెడుతున్నారు అనడంతో అప్పుడు దేవయాని ఏదేదో మాట్లాడుతూ ఉండగా పెద్దమ్మ అవన్నీ మాట్లాడే ఓపిక నాకు లేదు మీకు మళ్ళీ చెప్తున్నాను వసుధార ఏమీ అనకండి తను ఉండడం వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు రిషి. అప్పుడు జగతీ మహేంద్ర ఇద్దరూ దేవయానికి థాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
మరొకవైపు వసుధార,రిషి తో గడిపిన క్షణాలు నెమలి ఈకలు గోలీలను చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి వాచ్ చూసి మనమంతా కలిసి మాట్లాడుకునే రోజు ఆనందంగా ఉండే రోజు ఎప్పుడు వస్తుంది ఈ పొగరుని మళ్ళీ ఎప్పుడు పొగరు అని పిలుస్తారు సార్ అనుకుంటూ తాళిబొట్టు చూసుకుంటూ ఉంటుంది వసుధార. ఇంతలోనే అక్కడికి చక్రపాణి వస్తాడు. బాధపడుతున్నావా అమ్మ అనడంతో ఎదురుచూస్తున్నాను నాన్న అంటుంది. రిషి సార్ మాటలు విన్నావు కదమ్మా ఆ మాటలు కొండంత ప్రేమ కనిపించింది. ఆరోజు నువ్వు మన ఇంట్లో రిషి సార్ గురించి చెప్పినప్పుడు నేను విని ఉంటే ఈరోజు ఇంత జరిగేది కాదమ్మా అని అంటాడు.
మీరు అలా మాట్లాడకండి నాన్న ప్రేమను ఎవరు గెలిపించాల్సిన అవసరం లేదు ప్రేమ తనని తాను గెలిపించుకుంటుంది అని అంటుంది. రిషి సార్ నేను ఎప్పటికీ వేరు కాదు అనడంతో నిజం చెప్పొచ్చు కదా అమ్మ అనగా నిజాన్ని రిషి సార్ తెలుసుకోవాలి నాన్న అంటుంది. మరొకవైపు రిషి ఇంట్లో పేపర్లపై రిషిధార అని రాసి ధార మీద రాంగ్ మార్క్ వేసి ఉంటాడు. అప్పుడు వసుధారతో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. నా జీవితంలోకి వచ్చి నా మనసుని నా ఆనందాన్ని అన్నింటిని రంగులమయం చేశావు అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వసు మెడలో తాళి గుర్తు తెచ్చుకొని వసుధార ఇప్పుడు వేరొకరి భార్య నేను అలా ఆలోచించకూడదు అనుకుంటూ ఉంటాడు.