Guppedantha Manasu: జగతికి గుడ్ న్యూస్ చెప్పిన రిషి.. సంతోషంలో వసు, మహేంద్ర!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ తల్లి కొడుకు కోసం ఆరాట పడే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

జగతి మహేంద్ర (Mahendra) ను ఎలాగైనా నువ్వు కాలేజీకి వెళ్లాలి అని ఆర్డర్ వేస్తుంది. మహేంద్ర కూడా సరే నేను వెళ్తాను అని అంటాడు. మరుసటి రోజు జగతి తప్ప కుటుంబ సభ్యులంతా కాలేజీ లో మీటింగ్ అరెంజ్ చేస్తారు. దాంట్లో రిషి (Rishi) మీడియా మిత్రులకు కావలసిన అన్ని సమాధానాలు చెప్తాను అని అంటాడు.
ఇక రిషి (Rishi) కాలేజీ ఎం డి గా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ను రద్దు చేస్తున్నాను అని అందరి ముందు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. దాంతో అందరూ ఒక్కసారిగా స్టన్ అవుతారు. దేవయాని (Devayani) మాత్రం కుళ్ళు తో ఎంతో ఆనంద పడుతుంది.
అదే క్రమంలో రిషి (Rishi) మిషన్ ఎడ్యుకేషన్ అనే ఒక పెంకుటిల్లు కొందరికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ దాని స్థానంలో ఒక పెద్ద మేడ కట్టి అందరికీ ఉపయోగ పడేలా చేయడం నా ఆలోచన అని అంటాడు. అంతేకాకుండా ప్రభుత్వం ఇకపై ఈ ప్రాజెక్ట్ ను నిర్వహిస్తుంది అని అంటాడు. దాంతో వసు (Vasu) తో సహా అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు.
అంతేకాకుండా కాలేజీ తరుపున కాలేజ్ డైరెక్టర్ గా మహేంద్ర భూషణ్ (Mahendra Bhushan) గారు వ్యవహరిస్తారు అని రిషి అంటాడు. దాంతో మహేంద్ర ఒకసారిగా స్టన్ అవ్వగా మిగతావాళ్లు అందరూ క్లాప్స్ కొడతారు. ఇక రెండో డైరెక్టర్ గా ఒకరిని ఆలోచించాను అని రిషి సస్పెన్స్ లో పెట్టి జగతి (Jagathi) మేడం అంటాడు.
ఇక రెండో డైరెక్టర్ గా రిషి (Rishi) జగతి ను ఎంచుకున్నందుకు అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు. కానీ దేవయాని (Devayani) మాత్రం ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. అంతేకాకుండా రిషి కి నానా రకాల మాటలు నూరి పోస్తుంది.
ఇక వసు రిషి (Rishi) ను ఆనందంగా ఈరోజు మీరు నాతో పాటు రావాల్సిందే అని ఒక దగ్గరికి తీసుకుని వెళుతుంది. అక్కడ ఇద్దరు ఆనందంగా రంగులు పూసుకుంటారు. ఇక అనుకోకుండా రిషి కౌగిళ్ళ లోకి వసు (Vasu) వస్తుంది. రిషి కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ వసుకు రంగు పూస్తాడు.