గర్ల్‌ ఫ్రెండ్‌ మెడకు చుట్టుకుంటున్న సుశాంత్ కేసు.. అసలు ఎవరీ రియా?

First Published 1, Sep 2020, 2:17 PM

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా బాలీవుడ్ మాఫియా కారణంగా సుశాంత్ మరణించి ఉంటాడని భావించినా తరువాత రియా చక్రవర్తి మీదే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో అభిమానులు అసలు ఈ రియా ఎవరో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారు.

రియా వెండితెరకు పరిచయం అయ్యింది తెలుగు సినిమాతోనే. ఓ టీవీ ఛానల్‌లో హోస్ట్‌గా పనిచేస్తున్న రియా 2012లో తూనీగ తూనీగ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత మేరే డాడీకి మారుతి సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తరువాత సోనాలి కేబుల్‌, దోబారా..  సీయువర్ ఎవిల్‌, హాఫ్ గర్ల్‌ ఫ్రెండ్‌, బ్యాంక్‌ చోర్, జలేబీ లాంటి సినిమాల్లో నటించింది. అయితే కెరీర్‌లో ఎక్కువగా ఫ్లాప్‌లే ఉండటంతో అమ్మడికి రావాల్సినంత గుర్తింపు రాలేదు.

2013లో బాలీవుడ్‌లో చేసిన తొలి సినిమా మేరే డాడీకి మారుతి సినిమాలోనే సుశాంత్‌తో కలిసి నటించింది. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న వీరు 2019లో ప్రేమికులయ్యారు. ఇద్దరు కలిసి పారిస్‌, ఇటలీ, స్విట్జర్‌ల్యాండ్‌, యూరప్‌ లాంటి దేశాలకు వెళ్లారు. సుశాంత్‌ మృతికి కొద్ది రోజుల ముందుకు వరుకు రియా సుశాంత్ ఇంట్లోనే ఉండేది.

సుశాంత్ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో మరణించాడు. అయితే పోలీసులు ప్రాధమికంగా సుశాంత్‌ది ఆత్మహత్య అని నిర్థారించినా ఇప్పుడు ఆయన్ను హత్య చేసి ఉంటారన్న అనుమానలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ముంబై పోలీసులు, పాట్నా పోలీసులు, ఈడీ విచారణ  జరుపుతుండగా తాజాగా సీబీఐ కూడా తన విచారణ మొదలు పెట్టింది.

రియా సుశాంత్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టిందని, తన అకౌంట్‌లోని డబ్బులను తన సొంతానికి ఖర్చు చేసుకునేదని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పాట్నా పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌లో సుశాంత్ అకౌంట్‌ నుంచి 15 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా వారు ఫిర్యాదు చేశారు. అంతేకాదు రియా సుశాంత్‌కు మాధక ద్రవ్యాలు కూడా ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.

అయితే రియా మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, సీబీఐ మీద తనకు పూర్తి విశ్వాసం ఉందని నిజం ఖచ్చితంగా బయటకు వస్తుందని చెపుతోంది. అంతేకాదు తాను డ్రగ్స్ వాడలేదని, సుశాంత్ వాడుతుంటే వద్దని వారించే దాన్నని కూడా చెప్పింది రియా చక్రవర్తి.

loader