- Home
- Entertainment
- Krishna Mukunda Murari: ముకుంద కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రేవతి.. మురారికి పనిష్మెంట్ ఇచ్చిన కృష్ణ!
Krishna Mukunda Murari: ముకుంద కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రేవతి.. మురారికి పనిష్మెంట్ ఇచ్చిన కృష్ణ!
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నప్పటికీ కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్న ఒక జంట కథ ఈ సీరియల్. ఇక 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో పంతులుగారు కృష్ణ దంపతులచే అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేయిస్తూ ఉంటారు. కృష్ణ, మురారి కూడా మనస్ఫూర్తిగా ప్రమాణాలు చేస్తారు. అది చూసిన ముకుంద ఇది హోమం లాగా అనిపించడం లేదు అగ్నిసాక్షిగా వాళ్ళిద్దరికీ మళ్లీ పెళ్లి జరుగుతున్నట్లుగా ఉంది అని మనసులో అనుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ కంగారు పడతారు.
మురారి పీటల మీద నుంచి లేవబోతాడు. మురారిని లేవద్దని హెచ్చరిస్తుంది రేవతి. పొద్దుటి నుంచి ఉపవాసం ఉంది కదా అందుకే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది నేను చూసుకుంటాను అని చెప్పి ప్రసాద్ సాయంతో ముకుంద రూమ్ కి తీసుకువెళ్లి తనని అక్కడ పడుకోబెడుతుంది రేవతి. రెస్ట్ తీసుకో హోమం పూర్తయ్యాక మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్లబోతు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ హోమం ఆగదు.
వాళ్ళ బంధం విడిపోదు అని స్ట్రాంగ్ గా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రేవతి. ఆ మాటలకి షాక్ అవుతుంది ముకుంద. అయినా మంచం మీద ఉండలేక హోమాన్ని దూరం నుంచి చూస్తుంది. నా ఆశలు కలలు అన్నీ ఆ హోమంలో సజీవ దహనం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది అని కన్నీరు పెట్టుకుంటుంది. ఆ తర్వాత గదిలో ఉన్న మురారి ప్రమాణం చేసేటప్పుడు కృష్ణ మొహంలో వెలుగు చూశాను అంటే తన మనసులో నేను ఉన్నట్లేనా ఎలా తెలుసుకోవడం అనుకుంటాడు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన కృష్ణ కూడా అలాగే అనుకుంటుంది. ఇద్దరు వారి వారి అభిప్రాయాలు కనుక్కుందామని ఇద్దరూ ఒకేసారి ఒకరిని ఒకరు పిలుచుకుంటారు. ఏంటి ఏసిపి సర్ నన్ను ఎందుకో పిలిచారు అంటుంది కృష్ణ. లేడీస్ ఫస్ట్ కదా నువ్వే చెప్పు అంటాడు మురారి. అదంతా ఒకప్పుడు సర్ ఇప్పుడు అందరూ సమానమే మీరే చెప్పండి అంటుంది కృష్ణ.
అడుగుదాము అని నోటి వరకు వస్తుంది కానీ అడిగితే తను నో చెప్తే నేను భరించలేను అని మనసులో అనుకొని ఈ ఒక్కసారి నా మాట విను నువ్వే చెప్పు అంటాడు మురారి. ఎందుకు అంత నిద్ర పడుతున్నారు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అనడం ఆయన వినాలనుకుంటున్నారా.. చచ్చినా అలా చెప్పను అని మనసులో అనుకొని బయటకు మాత్రం ముకుంద గురించి అడుగుదామని అని మాట మార్చేస్తుంది కృష్ణ.
అత్తయ్య చేసిన పాయసం మీరు తినలేదు కదా తీసుకొని వస్తాను ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది కృష్ణ. ఈ బంధాన్ని ఎలాగైనా శాశ్వతం చేస్తాను అనుకుంటాడు మురారి. మరోవైపు మురారిని తలుచుకొని బాధపడుతుంది ముకుంద. అంత మనస్ఫూర్తిగా ఎలా ప్రమాణం చేయగలిగావు మురారి మన ప్రేమని మరిచిపోయావా.. ఇచ్చిన మాటకి కట్టుబడి ఆ అమాయకురాలి ప్రేమకి బందీ అయిపోయావా అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.
నువ్వు నన్ను మర్చిపోయినా..నేను నిన్ను మర్చిపోలేను, నిన్ను వదులుకోలేను. నన్ను మర్చిపోయి కృష్ణని ఎలా భార్యగా అంగీకరిస్తావో నేనూ చూస్తాను అని కసిగా అనుకుంటుంది ముకుంద. మరోవైపు తెల్లవారి లేస్తూనే పోట్లాటకి దిగుతారు కృష్ణ దంపతులు. నేను ముందు ఫ్రెష్ అవుతాను నాకు అర్జెంట్ పని ఉంది మురారి అంటే నాకు అర్జెంట్ ఆపరేషన్ ఉంది నేను వెళ్ళాలి అంటూ కృష్ణ ఇద్దరూ పోట్లాడుకుంటారు.
సరే అయితే నువ్వు ముందు ఫ్రెష్ అవ్వు. నువ్వు రెడీ అయ్యేసరికి ఎలాగూ చాలా టైం పడుతుంది ఆ టైంలో నేను ఫ్రెష్ అయిపోతాను అంటాడు మురారి. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా ఇంత టైం వేస్ట్ చేశారు అని సరదాగా మండిపడుతూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది కృష్ణ. బాత్రూం నుంచే భర్తకి తన ఫైల్ లో చేయవలసిన పని చెప్పి చేయిస్తుంది. చెప్పింది పని అంతా చేసిన మురారి ఈ పని అంతా నాతో ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు.
నా టైం వేస్ట్ చేసినందుకు మీకు పనిష్మెంట్ అంటుంది కృష్ణ. కృష్ణ బయటికి వచ్చిన తర్వాత మురారి ఫ్రెష్ అప్ అవటానికి వెళ్తాడు. వాష్ రూమ్ నుంచే షూస్ పాలిష్ చేసి పెట్టు డ్రెస్ ఐరన్ చేసి పెట్టు అని చెప్తాడు. ఏంటి రివెంజా అని అడుగుతుంది కృష్ణ. అలాంటిదేమీ లేదు కోపరేషన్ అని నవ్వుతాడు మురారి. తరువాయి భాగంలో టైం అయిపోవటంతో బయట బ్రేక్ ఫాస్ట్ చేద్దామనుకొని బైక్ మీద బయలుదేరుతారు కృష్ణ దంపతులు. అది చూసిన ముకుంద మీరు బయట ఎలా బ్రేక్ ఫాస్ట్ చేస్తారో నేను చూస్తాను అని అనుకుంటుంది.