MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishna Mukunda Murari: చిన్నత్తకి షాకిచ్చిన ముకుంద.. రేవతి ప్రవర్తనకు షాక్ లో కుటుంబం?

Krishna Mukunda Murari: చిన్నత్తకి షాకిచ్చిన ముకుంద.. రేవతి ప్రవర్తనకు షాక్ లో కుటుంబం?

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంది. కొడుకు కోడలు కాపురం సవ్యంగా లేదని తెలుసుకొని తల్లడిల్లుతున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Jun 05 2023, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

 ఎపిసోడ్ ప్రారంభంలో కూరలు తరుగుకుంటూ ముకుంద ప్రవర్తనని తలుచుకుంటూ బాధపడుతుంది రేవతి. ఈ పిల్ల ప్రవర్తన మార్చకపోతే ప్రేమ నుంచి ఉన్మాదంలోకి వెళ్లే లాగా ఉంది. అక్కయ్య వచ్చేలోపే ఈ సమస్యని పరిష్కరించాలి లేదంటే సమస్య నా చెయ్యి దాటిపోతుంది అనుకుంటుంది రేవతి. మరోవైపు కోపంగా ఉన్న మురారిని ఆటపట్టిస్తూ ఉంటుంది కృష్ణ.

29

కానీ డ్రైవింగ్ లో ఉన్న మురారి కృష్ణ మీద కోప్పడతాడు. మీరు ఎప్పుడు నా మీద ఇంతలా కోప్పడలేదు ఏమైంది అంటుంది కృష్ణ. ఏమీ లేదు అని మాట తప్పించేస్తాడు మురారి. మనసు బాగోలేనప్పుడు పిల్లలతో కలిసి సమయం గడిపే ప్రశాంతంగా ఉంటుంది అందుకే లెఫ్ట్ తీసుకొని తిన్నగా అటువైపు వెళ్ళండి అంటుంది కృష్ణ. ఎందుకు అక్కడ ఏముంది అంటాడు మురారి. తీసుకొని వెళ్ళండి మీకే తెలుస్తుంది అంటుంది కృష్ణ.

39

కృష్ణ చెప్పిన వైపు టర్న్ తీసుకుంటాడు మురారి. మరోవైపు పుస్తకం మీద ఐ లవ్ యు అని రాసి పేపర్లు నింపేస్తూ ఉంటుంది ముకుంద. అప్పుడే టీ తీసుకొని వచ్చినా రేవతి ముకుందా అని పిలవడంతో షాక్ అయ్యి పుస్తకం మూసేస్తుంది ముకుంద. అందులో ఏముంది అంటూ బలవంతంగా ముకుంద దగ్గర పుస్తకం లాక్కొని చూస్తుంది రేవతి.

49

ఏంటి ఈ చండాలం అంటూ పేపర్స్ ని చింపేసి మురారి కి సంబంధించిన ఏ గుర్తు ఉండకూడదు ఈ గదిలో ఉండకూడదు అంటూ హెచ్చరిస్తుంది. నా గుండెల్లో ఉన్నాడు ఏం చేస్తారు అంటుంది ముకుంద. వాళ్లు చిలకా గోరింకల్లాగా ఉన్నారు వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టొద్దు అంటుంది రేవతి. వాళ్ల గురించి మీకు తెలియదు అంటుంది ముకుంద. నాకు తెలియనిది నీకేం తెలుసు నిజం చెప్పు అని అడుగుతుంది రేవతి. 

59

వాళ్లది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పి జరిగిందంతా చెప్తుంది ముకుంద. ఒకసారి గా షాక్ అవుతుంది రేవతి. ఇదంతా నీకు ఎలా తెలుసు అంటూ నిలదీస్తుంది. మురారి చెప్పాడు అనటంతో మరింత షాక్ అవుతుంది. అయితే వాళ్లు చూపిస్తున్నదంతా నటన అంటూ ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఒక అనాధాశ్రమానికి వస్తారు కృష్ణ వాళ్ళు. కాలేజీకి వెళ్లిన కృష్ణ ని పిల్లలందరూ ప్రేమగా పలకరిస్తారు.

69

అంతలోనే నవ్వుతూ కారు దిగిన మురారిని చూసి అన్నయ్య అంటూ  ప్రేమగా పలకరిస్తారు. వీళ్ళందరూ మీకు ఎలా తెలుసు అంటుంది కృష్ణ. అదేంటక్క ఈ ఆశ్రమం నడుపుతున్నది ఈయనే కదా అంటాడు ఒక బాబు. అవునా నిజంగా మీరు దేవుడు అంటూ చేతులెత్తి దండం పెడుతుంది కృష్ణ. వీళ్ళు నీకు ఎలా తెలుసు అంటాడు మురారి. ప్రతి వీకెండ్ ఇక్కడ వాలంటీర్ గా హెల్త్ చెకప్ చేస్తూ ఉంటాను అంటుంది కృష్ణ.

79

మీరు నిజంగా దేవత అంటూ చేతులెత్తి దండం పెడతాడు మురారి. అందరూ హాయిగా నవ్వుకుంటారు. కాసేపటి తర్వాత ఇక బయలుదేరుదాం అంటుంది కృష్ణ. కాసేపు ఆడుకున్నాక వెళ్లొచ్చు కదా అని పిల్లలు బలవంత పెట్టడంతో వాళ్లతో పాటు ఆడుకోవడానికి డిసైడ్ అవుతారు కృష్ణ దంపతులు. మరోవైపు దేవుడికి దండం పెట్టుకుంటుంది రేవతి నేను తల్లిగా అత్తగా ఫెయిల్ అయ్యాను.

89

 నా కొడుకు కాపురం సరిగ్గా లేదని ముకుంద చెప్పే వరకు నాకు తెలియలేదు అంటూ దేవుడి దగ్గర బాధపడుతుంది. ఇంతలో ప్రసాద్ వచ్చి పెద్ద వదిన ఫోన్ చేసింది అంటాడు. ఎందుకు వచ్చేస్తుందా అని కంగారుగా అడుగుతుంది రేవతి. నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు అని అడుగుతాడు ప్రసాద్. ఏమీ లేదు తన రూమ్ క్లీన్ చేయించలేదు అందుకే అంటుంది రేవతి. పెద్ద వదిన  రావటం లేదు వదినా.. నువ్వు ఒక్కదానివే పనులు చేసుకోలేదని సుమని తోడు వెళ్ళమని చెప్పింది అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రసాద్. రిలాక్స్ ఫీల్ అవుతుంది రేవతి.

99

సీన్ కట్ చేస్తే పిల్లలతో ఆడుకుంటున్న మురారిని చూసి గర్వపడుతుంది కృష్ణ. ఈయన నా భర్త అని గర్వంగా చెప్పుకోలేకపోతున్నాను నా అంత దురదృష్టవంతురాలు మరొకరు లేదు అని బాధపడుతుంది. తరువాయి భాగంలో అందరూ భోజనాలు చేస్తూ ఉండగా సార్ ఈరోజు ఎందుకో మూడీగా ఉన్నారు అని అంటుంది కృష్ణ. అంతా నీ వల్లే మీరు కలిసి కాపురం చేయడం లేదు నాకు అర్జెంటుగా మనవడు మనవరాలు కావాలి అని ఉన్మాదిలాగా అరుస్తుంది రేవతి. ఆమె ప్రవర్తనకి అందరూ షాక్ అవుతారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved