MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishna Mukunda Murari: నిజం చెప్పి షాకిచ్చిన అలేఖ్య.. కృష్ణని నిలదీసిన రేవతి?

Krishna Mukunda Murari: నిజం చెప్పి షాకిచ్చిన అలేఖ్య.. కృష్ణని నిలదీసిన రేవతి?

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. కొడుకు కోడలు కాపురం సంతోషంగా సాగాలని తపన పడుతున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Jun 09 2023, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎపిసోడ్ ప్రారంభంలో కాఫీ కలుపుతున్న రేవతి కొడుకు గురించి ఆలోచిస్తూ ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చేసేవాడు కాదు ఆ ముకుందతో ప్రేమలో పడ్డ దగ్గర నుంచి అన్ని విషయాలు దాటడం నేర్చుకున్నాడు. అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి నా దగ్గరే దాస్తాడా అని అనుకుంటుంది. ఇంతలోనే కృష్ణ వచ్చి అత్తగారికి గుడ్ మార్నింగ్ చెప్తుంది.

28

రేవతి కూడా గుడ్ మార్నింగ్ చెప్తుంది. సడన్ గా అత్తగారితో లేచిపోదామా అని అడుగుతుంది కృష్ణ. రాత్రి తాగింది దిగలేదా కోడలు పిల్ల అని నవ్వుతుంది  రేవతి. రాత్రి నేను తాగానా ఏం తాగాను అంటూ అమాయకంగా అడుగుతుంది కృష్ణ. ఆపిల్ జ్యూస్ తాగి ముద్దుగా బజ్జున్నావు ఇప్పుడే లెగిస్తున్నట్లుగా ఉన్నావు అని ముద్దుగా చెప్తుంది రేవతి. మా మంచి అత్తయ్య అంటూ ముద్దు పెట్టుకుంటుంది కృష్ణ.

38

మంచి కొడుకుని కన్నారంటూ తనని ముద్దు పెట్టుకున్న విషయం గుర్తొచ్చి ఆరోజు ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది రేవతి. ఏం లేదు ఊరికే అంటుంది కృష్ణ. చెప్పకపోతే పనిష్మెంట్ ఇస్తాను అంటుంది రేవతి. ఏం పనిష్మెంట్ ఇస్తారు అంటుంది కృష్ణ. నేనేమి ఇస్తాను మీ ఇద్దరూ జీవితాంతం హ్యాపీగా ఉండాలని చూసేదానిని అంటుంది రేవతి. అత్తగారి మంచితనానికి సంతోషిస్తుంది కృష్ణ. కృష్ణ కాఫీ తీసుకు వెళ్ళేటప్పటికి గదిలో మురారి ఉండడు.
 

48

ఎక్కడికి వెళ్లారని కాసేపు ఆలోచిస్తుంది తర్వాత ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచాఫ్ రావడంతో చెప్పకుండానే ఆఫీస్ కి వెళ్ళిపోయారు అనుకొని కాఫీ తీసుకొని కిందికి వస్తుంది. అప్పటికే కాఫీ తాగుతున్న రేవతి ఏమైంది అడుగు కాఫీ తాగలేదా అని అడుగుతుంది. అయినా లేరు ఎక్కడికి వెళ్లారో తెలియదు అంటుంది కృష్ణ. అదేంటి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం అయినా ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని అంటుంది రేవతి.

58

మురారి, ముకుంద కలిసి బయటికి వెళ్లారు నేను చూశాను అని చెప్తుంది అలేఖ్య. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ ముకుందే వీడిని బలవంతం పెట్టి తీసుకొని వెళ్ళి ఉంటుంది అని ముకుందని తిట్టుకుంటుంది రేవతి. ఆదర్శ విషయం ఏదైనా తెలిసి ఉంటుంది అందుకే వెళ్లి ఉంటారు అని మాట మార్చేస్తుంది రేవతి. ఒకవేళ తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చి ఉంటారు అని అంటుంది అలేఖ్య. పోలీసు వాళ్లకి సీక్రెట్ ఇన్ ఫార్మర్స్ ఉంటారు మా నాన్నగారు కూడా ఇలాంటి టాస్కులు చాలా చేశారు అంటుంది కృష్ణ.

68

నీలాంటి భార్య దొరకడం చాలా అదృష్టం మొగుడ్ని ప్రతి దానికి అనుమానించకూడదు ఇలా అర్థం చేసుకోవాలి అంటాడు మధు. మొగుడ్ని కోపంగా చూస్తుంది  అలేఖ్య. ఆ తరువాత తన కాన్సెప్ట్ చెప్పడం కోసం తన ఫ్రెండ్ ని పిలుస్తాడు మధుకర్. చూడ్డానికి తింగరోడి లాగా ఉంటావు కానీ కాన్సెప్ట్ చాలా బాగుంది. నేను మాత్రం పదివేలు తీసుకుంటాను అంటాడు ఆ ఫ్రెండ్. 100000 ఏం కర్మ 20,000 ఇస్తాను కానీ ముందు వ్యూస్ రానీ అంటాడు మధు.

78

అలాగే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెండ్. పర్వాలేదు మీకు కూడా బుర్ర ఉంది ఆ డబ్బులు ఇవ్వు ఇప్పుడే ఇచ్చేస్తావేమో అనుకున్నాను అంటుంది అలేఖ్య. అలేఖ్యని  కోపంగా చూస్తాడు మధుకర్. చూసింది చాల్లే అన్నట్టు చూస్తుంది అలేఖ్య. మరోవైపు మురారికి ఫోన్ చేస్తూనే ఉంటుంది కృష్ణ. స్విచ్ ఆఫ్ రావడంతో ఎక్కడికి వెళ్లారు వెళ్లేటప్పుడు చెప్పేసి వెళ్లొచ్చు కదా అని మనసులో అనుకుంటుంది.

88

అయినా ఆయన చెప్పకుండా వెళ్తే ఏదో నేరం చేసినట్లుగా నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను అంటే కృష్ణగా కాకుండా ఆయన భార్య గా ఫీల్ అవుతున్నానా.. నాకు అంత అదృష్టం ఉందా అని మనసులో అనుకుంటుంది కృష్ణ. ఇంతలోనే తన తండ్రి తనని పిలవటంతో వెళ్లి అతన్ని హత్తుకుంటుంది కృష్ణ. తరువాయి భాగంలో నీది మురారిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని నాకు ఎందుకు చెప్పలేదని కృష్ణని నిలదీస్తుంది రేవతి. ఆ మాటలకి కృష్ణతో పాటు అలేఖ్య దంపతులు కూడా షాక్ అవుతారు.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్‌ దేవరకొండ, రష్మిక మెహెందీ ఈవెంట్‌.. రాయల్‌ లుక్‌లో కొత్త జంట
Recommended image2
Divi Vadthya: అలాంటి వాడు దొరకడం లేదట.. దివి ఆవేదన
Recommended image3
Alekhya Reddy: తారకరత్నతో లవ్‌ స్టోరీ, మొదటిసారి ఓపెన్‌ అయిన అలేఖ్యరెడ్డి.. నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టడంపై ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved