Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • చైనా వస్తువుల వాడకంపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఏమంటుందంటే?

చైనా వస్తువుల వాడకంపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఏమంటుందంటే?

ఇండియా పాకిస్తాన్ యుద్దంపై, పాకిస్తాన్ కు చైనాలాంటి దేశాల మద్దతుపై నెటిజన్లు, సెలబ్రిటీలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ స్పందించారు. చైనా వస్తువుల వాడకంపై ఆమె కీలక సూచనలు చేశారు. ఇంతకీ రేణు ఏమన్నారంటే?

Mahesh Jujjuri | Published : May 16 2025, 02:48 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
renu desai

renu desai

సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరుస్తూ వచ్చారు నటి రేణు దేశాయ్. తాజాగా ఆమె మరో కీలకమైన విజ్ఞప్తితో ముందుకొచ్చారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చైనాలో తయారైన ఉత్పత్తుల వాడకాన్ని మానేయాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా పేజ్ లో  పోస్ట్ చేసిన సందేశం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

26
Renu Desai

Renu Desai

రేణు దేశాయ్ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. “మన కుటుంబ భద్రత, దేశ భద్రత నిజంగా మనకు ముఖ్యమైతే చైనా ఉత్పత్తులను కొనడం ఆపేయాలి. ఏదైనా వస్తువు కొంటే ముందు దాని లేబుల్‌ను తప్పకుండా చదవడం ప్రారంభించండి” అని సూచించారు. ఆమె పేర్కొన్నట్టు, ఇప్పటివరకు తాను కూడా అనేక చైనా ఉత్పత్తులను కొనుగోలు చేశానని ఒప్పుకుంటూ, ప్రస్తుతం అయితే ప్రతి వస్తువు లేబుల్‌ను ఖచ్చితంగా పరిశీలిస్తున్నానని చెప్పారు.

Related Articles

స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రాజమౌళి, ఎవరా నటుడు?
స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రాజమౌళి, ఎవరా నటుడు?
నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురు అక్కినేని హీరోలతో  నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురు అక్కినేని హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
36
Asianet Image

అందులో "చైనా" తయారీ అని తెలుస్తే, దానిని కొనకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మార్పు ఒక్క రోజులో సాధ్యపడదని, ఇది ఓ ప్రక్రియ అని ఆమె అంగీకరించారు. “కానీ, కనీసం ఇప్పటికైనా మొదలుపెడదాం. మన దేశాన్ని మనమే ఆదరించాలి” అని రేణు పేర్కొన్నారు.
 

46
photo credit prema interview

photo credit prema interview

ఆమె పోస్ట్‌లో ప్రజలను చైతన్యపరిచేలా మరిన్ని అంశాలు ఉన్నాయి. “మీరు కొనుగోలు చేయదలిచిన వస్తువు ఎక్కడ తయారైందో తెలుసుకోండి. అర్థం లేని టీవీ షోలు, రూమర్ల కన్నా మన దేశ భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం ప్రారంభిద్దాం. ఇది మన దేశానికి మద్దతిచ్చే ఒక socially responsible decision అవుతుంది” అని పేర్కొన్నారు. ( రేణు దేశాయ్ పోస్ట్ కోసం క్లిక్ చేయండి)

56
Asianet Image

ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేయాలని కోరిన రేణు దేశాయ్, “మనమందరం ఎక్కడో ఒకచోట మొదలుపెట్టాలి. మన మాతృభూమికి మనమే మద్దతు ఇవ్వాలి” అంటూ తన దేశభక్తిని వ్యక్తపరిచారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ, చైనా ఉత్పత్తులపై ప్రజలలో మున్ముందు చర్చకు దారితీసేలా కనిపిస్తోంది.

66
Asianet Image

హైదరాబాద్, పూణేలో ఎక్కువగా ఈ బిజెనెస్ జరుగుతుందని తెలుస్తోంది. ఆ నగరాల్లో బాగానే ఆస్తులు కూడా ఉన్నాంట. వాటి నుంచి వచ్చే ఆదాయంతోనే ఇన్నాళ్లు గడిపినట్టు తెలుస్తోంది. ఇక ఓ సినిమానూ కూడా నిర్మించింది. కొన్ని నివేదికల ప్రకారం.. రేణు దేశాయ్ ఆస్తుల విలువ మొత్తం రూ.40 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories